CM KCR: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ప్రస్తుతం మాటల యుద్ధం కొనసాగుతోంది. వరి ధాన్యం విషయంలో రెండు పార్టీలు తగ్గేదేలే అంటున్నాయి. రైతులను మధ్యలో ఉంచుతూ ధాన్యం కొనుగోలును రాజకీయం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్ లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో జరిగిన బీసీ విద్యావంతుల సదస్సులో కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొని రాష్ట్ర ప్రభుత్వంపై కొన్ని వ్యాఖ్యలు చేశారు.
మనసీఎం కేసీఆర్ అబద్దాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. ఆయన ఇచ్చిన హామీలతో గిన్నిస్ రికార్డ్స్ లో స్థానం కల్పించొచ్చు. గిన్నిస్ రికార్డ్స్ ను సైతం బద్దలు కొట్టే ఘనత ఆయనది. మతపరమైన రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత మన కేసీఆర్ కే సొంతం. ఆనాడే బీజేపీ చెప్పింది మతపరమైన రిజర్వేషన్లతో దేశానికే నష్టమని మొత్తుకున్నా పట్టించుకోలేదు. కొన్ని బీసీ సంఘాలు ప్రభుత్వం ఇచ్చే డబ్బులకు ఆశపడి నోరు మెదపలేదు. ఫలితంగా ఇప్పుడు పశ్చాత్తాపపడితే ఏం లాభం.
Also Read: Bandi Sanjay: మరోసారి ”బండి” లాగడం కష్టమే.. సంజయ్ చేజారిపోతున్న పట్టు..?
2014లో కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. దళితులకు దళితబంధు ఇస్తున్నామని ప్రకటించినా అది అమలు చేసిన దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. బీసీ బందు ఇవ్వాలని డిమాండ్లు పెరుగుతున్నా అది సాధ్యం కాదని తెలుస్తోంది. అయినా సీఎం కేసీఆర్ ఏదో చేస్తున్నట్లు భ్రమలు కల్పించడంలో ఆయనది అందెవెసిన చేయి.
రుణాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఎదురు చూస్తున్నా ఎవరికి కూడా పైసా ఇవ్వలేదు. సరికదా వారిని నిత్యం కార్యాలయాల చుట్టు తిప్పుతూ అధికారులు సైతం వారితో ఆడుకుంటున్నారు. 5.50 లక్షల మంది రుణాల కోసం ఎదరు చూస్తున్నా వారి ఆశలు అడియాశలే అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపిస్తుంది కానీ ఫలితాలు మాత్రం కాదని తెలుస్తోంది.
2017లో బీసీ సబ్ ప్లాన్ అమలు చేస్తామని చెప్పినా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. బీసీల సంక్షేమం కోసం రూ. 10 వేల కోట్లు అదనంగా సమకూర్చాల్సి ఉన్నా ఆ దిశగా అడుగులు పడటం లేదు. తెలంగాణలో బీసీలకు కేవలం 2.3 శాతం నిధులు మాత్రమే కేటాయిస్తూ వారిని మభ్యపెడుతున్నారు.
బీసీ రిజర్వేషన్లు 34 శాతం నుంచి 18 శాతానికే కుదించారు. దీంతో వారికి నష్టాలు ఎదురవుతున్నాయి. 50 శాతం బీసీ జనాభా ఉంటే మూడు మాత్రమే మంత్రి పదవులు ఇచ్చి చేయి దులుపుకున్నారు. మోడీ కేబినెట్ లో 27 మంది బీసీలకు స్థానం కల్పించారు.
Also Read:Akbaruddin Owaisi: అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై కోర్టు శిక్ష విధిస్తుందా?