Site icon OkTelugu

RSS Chief Mohan Bhagwat: ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ దేశద్రోహి.. సంచలన విమర్శ చేసి అభాసుపాలైన కాంగ్రెస్‌!

RSS Chief Mohan Bhagwat

RSS Chief Mohan Bhagwat

RSS Chief Mohan Bhagwat: దేశ ద్రోహం.. ఒకప్పుడు దేశంలో బాగా వినిపించేది. నేతలపైనే విమర్శలు ఎక్కువగా వచ్చేవి. ఇక పోలీసులు కూడా కేసులు నమోదు చేసేవారు. అయితే మోదీ ప్రభుత్వం దీనిని తొలగించింద. అయినా విమర్శలు ఆగడం లేదు. అయితే మోదీ ప్రధాని అయ్యాక కాంగ్రెస్‌నే బీజేపీ నేతలు దేశద్రోహ పార్టీగా పేర్కొంటున్నారు. స్వాతంత్య్రం తర్వాత జరిగిన ఘటనలు ఉదహరిస్తూ విమర్శలు చేస్తున్నారు. కానీ, ఈసారి ఆ అవకాశం కాంగ్రెస్‌ దక్కించుకుంది. ఆర్‌ఎస్‌ఎస్‌ శతాబ్ధి ఉత్సవాల్లో భాగంగా చీఫ్‌ మోహన్‌ భగవత్‌ ప్రముఖ గాయకుడు అద్నాన్‌ సామీకి ఆతిథ్యం ఇచ్చాడు. దీనినే కాంగ్రెస్‌ దేశ ద్రోహంగా పేర్కొంటోంది.

ఏం జరిగిందంటే..
బాలీవుడ్‌ సింగర్‌ ఆద్నాద్‌సామీ భారతీయ పౌరుడు. పద్మశ్రీ కూడా పొందాడు. ఆర్‌ఎస్‌ఎస్‌ శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ ఆద్నాద్‌సామీకి ఆతిథ్యం ఇచ్చాడు. ఆత్మీయ భోజనం ఏర్పాటు చేశారు. ఇద్దరూ పక్కపక్కన కూర్చుని భోజనం చేశారు. ఈ ఫోటోను ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఈ సాధారణ చర్యే మహారాష్ట్ర కాంగ్రెస్‌లో తీవ్ర కోపాన్ని రేకెత్తించింది. దీన్ని ‘దేశవ్యతిరేక చర్య’గా పేర్కొంటూ భగవత్‌పై దేశద్రోహి కేసు పెట్టాలని డిమాండ్‌ చేశారు.

కోపానికి కారణం..
కాంగ్రెస్‌ ప్రకారం.. అద్నాన్‌ సామీ తండ్రి అర్షద్‌ సామీఖాన్‌ పాకిస్తానీ. పాకిస్తాన్‌ వాయుసేనలో పనిచేశాడు. 1965 యుద్ధంలో పాల్గొన్నాడు. పఠాంకోట్‌ దాడిలో కూడా ఆయన పాత్ర ఉందని ఆరోపణలు ఉన్నాయి. అలాంటి వ్యక్తి కుమారుడితో భోజనం చేయడం దేశద్రోహమని కాంగ్రెస్‌ వాదించింది. శివసేన (ఉద్ధవ్‌ఠాక్రే) కూడా ఇదే విమర్శ చేసింది.

అద్నాద్‌ జర్నీ ఇలా..
లండన్‌లో పుట్టి పెరిగిన అద్నాన్‌ సామీ భారత్‌లో వచ్చి బాలీవుడ్‌లో గాయకుడిగా డెబ్యూ అయ్యారు. తెలుగు సినిమాల్లో కూడా పాటలు పాడారు. 2016లో పాకిస్తాన్‌ పౌరసత్వం వదులుకుని భారత పౌరుడయ్యారు. భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు కల్పించింది. ఇప్పుడు పూర్తిగా భారతీయుడిగా దేశ సంస్కృతికి సేవ చేస్తున్నారు.

మంచి మెస్సే ఇచ్చినా బాధే..
ఆర్‌ఎస్‌ఎస్‌పై ముస్లిం వ్యతిరేకి అన్న అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో మోహన్‌ భగవత్‌ అద్నాద్‌సామీతో భోజనం చేయడం స్వాగతించాల్సిన అంశం. ఇది ఒక మంచి మెస్సేజ్‌. కానీ కాంగ్రెస్‌ దీనిని తప్పు పట్టడమే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

కాంగ్రెస్‌ ద్వంద్వవాదం..
కాంగ్రెస్‌ విమర్శపై అద్నాన్‌ సామీ తీవ్రంగా స్పందించారు. దేశ విభజనకు కాంగ్రెస్‌ నాయకులే కారణమని, అయితే అది అప్పటి నాయకులు చేశారని, దానికి ప్రస్తుత తరం బాధ్యులు కాదని పేర్కొనానడు. అలాగే తన తండ్రి చర్యలకు తాను బాధ్యుడిని కాదని స్పష్టం చేశారు. ‘చరిత్రకు నేను బాధ్యత వహించను‘ అని పేర్కొన్నారు. ఇది కాంగ్రెస్‌ ద్వంద్వాన్ని బహిర్గతం చేస్తోంది.

ఇలాంటి రాజకీయ అంశాల కారణంగా కాంగ్రెస్‌ ప్రజల మన్ననలు పొందలేకపోతోంది. దేశంలో బీజేపీపై వ్యతిరేకత ఉన్నా ఎన్నికల్లో గెలవలేకపోతోంది. ద్వంద్వ విధానాల కారణంగా అటు ముస్లింలకు, ఇంటు హిందువులకు దగ్గర కాలేకపోతోంది.

Exit mobile version