https://oktelugu.com/

తెలంగాణ కేబినెట్ భేటి: వరాలు ఇవేనట?

తెలంగాణ కేబినెట్ కీలక భేటి ఈరోజు జరుగబోతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం మంత్రివర్గం సమావేశం అవుతోంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే జులైలో రెండు సార్లు తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహించారు. జూలై 6న మంత్రివర్గం సమావేశమైంది. ఆ తర్వాత జూలై 13న కొనసాగిన సమావేశం ఏకంగా రెండు రోజుల పాటు సాగింది. నాడు రైతుబంధుతోపాటు వ్యవసాయ సంబంధమైన నిర్ణయాలను తెలంగాణ కేబినెట్ తీసుకుంది. ఇవాళ మరోసారి కీలక భేటికి సమావేశమైంది. […]

Written By:
  • NARESH
  • , Updated On : August 1, 2021 / 09:34 AM IST
    Follow us on

    తెలంగాణ కేబినెట్ కీలక భేటి ఈరోజు జరుగబోతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం మంత్రివర్గం సమావేశం అవుతోంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే జులైలో రెండు సార్లు తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహించారు. జూలై 6న మంత్రివర్గం సమావేశమైంది. ఆ తర్వాత జూలై 13న కొనసాగిన సమావేశం ఏకంగా రెండు రోజుల పాటు సాగింది.

    నాడు రైతుబంధుతోపాటు వ్యవసాయ సంబంధమైన నిర్ణయాలను తెలంగాణ కేబినెట్ తీసుకుంది. ఇవాళ మరోసారి కీలక భేటికి సమావేశమైంది. ఈ సమావేశంలో దళిత బంధు అమలుతోపాటు ఇతర వ్యవసాయ సంబంధిత అంశాలపై కూడా చర్చ జరుగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రైతు బంధుకు సంబంధించి రూ.500 కోట్ల రూపాయలను తెలంగాణ సర్కార్ విడుదల చేసింది. ఇక దళితబంధును రాష్ట్రమంతటా ప్రవేశపెట్టాలన్న ఎమ్మెల్యేల డిమాండ్ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది.

    తెలంగాణలో చేపట్టిన అభివృద్ధి మహాయజ్ఞం ఆగబోదని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆరునూరైనా దళితబంధు అమలు చేసి తీరుతామన్నారు. రైతుబీమా తరహాలోనే చేనేతలకు, దళితులకు బీమాను అందిస్తామన్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ కేబినెట్ భేటి ప్రాధాన్యత సంతరించుకుంది.

    ఇక ఈ భేటిలో హుజూరాబాద్ ఉప ఎన్నిక, ఎమ్మెల్యే కోటా ఆరుగురు ఎమ్మెల్సీల ఎంపిక కూడా నేతలను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.