https://oktelugu.com/

జర్నలిజంలో అనుభవం ఉన్నవాళ్లకు శుభవార్త.. భారీ వేతనంతో జాబ్స్?

కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 34 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. తెలుగు, ఇంగ్లీష్ తో పాటు ఇతర భాషల్లో జర్నలిస్ట్ గా అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2021 సంవత్సరం ఆగష్టు నెల 12వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : July 31, 2021 9:44 pm
    Follow us on


    కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 34 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. తెలుగు, ఇంగ్లీష్ తో పాటు ఇతర భాషల్లో జర్నలిస్ట్ గా అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2021 సంవత్సరం ఆగష్టు నెల 12వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

    ప్రస్తుతం ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ జరుగుతుండగా https://www.upsc.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. https://upsconline.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా సీనియర్ గ్రేడ్ ఆఫ్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండటం గమనార్హం.

    పదో తరగతి సంబంధిత భాషలో చదివి ఉండటంతో పాటు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి జర్నలిజం డిగ్రీని కలిగి ఉండటం లేదా మాస్ కమ్యూనికేషన్‌లో డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా లేదా డిగ్రీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కనీసం రెండు సంవత్సరాల అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు.

    30 సంవత్సరాల లోపు వయస్సు ఉండటంతో పాటు రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ.1,42,400 వేతనం లభించనుంది. నిరుద్యోగులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.