DLF Investments In Amaravati: అమరావతి రాజధాని( Amaravati capital ) నిర్మాణ పనులు చాలా వేగవంతంగా సాగుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల భవనాల నిర్మాణం కొనసాగుతోంది. ఇంకోవైపు ప్రైవేటు సంస్థలకు సంబంధించిన భవన నిర్మాణ పనులు కూడా వేగవంతంగా సాగుతున్నాయి. వేలాదిమంది ఇంజనీరింగ్ నిపుణులు, కూలీలు పనులు చేస్తున్నారు. డే అండ్ నైట్ పనులు జరుగుతున్నాయి. ఇటువంటి సమయంలో ప్రముఖ నిర్మాణ సంస్థ డిఎల్ఎఫ్ అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. నిన్ననే ఢిల్లీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబుతో డిఎల్ఎఫ్ చైర్మన్ రాజీవ్ సింగ్ భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చించారు. రాజీవ్ సింగ్ కు చంద్రబాబుతో మంచి సాన్నిహిత్యం ఉంది. గతంలో చంద్రబాబు సూచనను పాటించకపోవడంతో తాను ఒక అరుదైన అవకాశాన్ని కోల్పోయానని రాజీవ్ సింగ్ గుర్తు చేశారు.
Also Read: జస్ ప్రీత్ బుమ్రా టీమిండియా వజ్రాయుధం.. బంతి పడితే వికెటే!
1999 ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు( CM Chandrababu). ఆ సమయంలో ఐటి రంగానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో హైదరాబాదులో సైబరాబాద్ నిర్మాణంలో చంద్రబాబు కీలక భూమిక పోషించారు. అయితే ఆ సమయంలో రియల్ ఎస్టేట్ సంస్థ గా ఉన్న డిఎల్ఎఫ్ ను హైదరాబాదులోని రాయదుర్గం ప్రాంతంలో పెట్టుబడులు పెట్టాలని చంద్రబాబు కోరితే పట్టించుకోని విషయాన్ని రాజీవ్ సింగ్ బయటపెట్టారు నిన్న చంద్రబాబు భేటీలో. చంద్రబాబు దార్శనికతను, భవిష్యత్తు ప్రణాళికను సరిగ్గా అంచనా వేయలేకపోయానని తన మనసులో ఉన్న మాటను బయటపెట్టారు. ఆనాడు చంద్రబాబు సలహా పాటించినట్లు అయితే ఎంతో లాభపడేవాళ్ళమని చెప్పుకొచ్చారు. ఒక గొప్ప పెట్టుబడి అవకాశాన్ని చేజార్చుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు విజన్ వల్ల రాయదుర్గం ప్రాంతం ఐటితో పాటు వాణిజ్య కేంద్రంగా మారిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
అయితే తాజాగా సీఎం చంద్రబాబుతో జరిగిన భేటీలో ఏపీలో పెట్టుబడులు పెడతామని డిఎల్ఎఫ్ చైర్మన్ రాజీవ్ సింగ్( Rajiv Singh ) చెప్పడం విశేషం. ఒక్క అమరావతి లో మాత్రమే కాదు విశాఖ నగరంలో సైతం పెట్టుబడుల విషయమై డిఎల్ఎఫ్ సానుకూలంగా ఉంది. అయితే దేశంలోనే అత్యున్నత రియల్ ఎస్టేట్ సంస్థగా డిఎల్ఎఫ్ ఉంది. అందుకే ప్రత్యేకంగా స్వాగతిస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. త్వరలో డిఎల్ఎఫ్ ప్రతినిధులు అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. పెట్టుబడులపై ఒక క్లారిటీ కూడా రానుంది.
నాడు మిస్సయ్యాను.. నేడు వదలను!
అమరావతిపై ‘DLF’ చైర్మన్ రాజీవ్ సింగ్!30 ఏళ్ల క్రితం ఒక నిర్ణయం.. నేడు ఒక పశ్చాత్తాపం.. రేపటి కోసం ఒక భారీ ప్రణాళిక! ఢిల్లీ వేదికగా జరిగిన ‘రైసినా డైలాగ్’ లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. దేశంలోనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ DLF చైర్మన్… pic.twitter.com/Ib9cXgZ0Od
— Swathi Reddy (@Swathireddytdp) March 7, 2026