Suman on Y S Jagan Govt: ప్రస్తుతం ఏపీలో జగన్ పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో అప్పుల్లో కూరుకు పోవడంతో జగన్ పై ప్రజల నుంచి ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తూనే ఉన్నాయి. పైగా ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని అన్ని వర్గాల ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. మరీ ముఖ్యంగా చిత్ర పరిశ్రమ నుంచి జగన్ పై చాలామంది తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.

ఇలాంటి సమయంలో హీరో సుమన్ చేసిన కామెంట్లు తీవ్ర రాద్ధాంతానికి దారితీస్తున్నాయి. జగన్ కు ఇంకో రెండు సార్లు సీఎంగా అవకాశం ఇస్తే ఏపీని స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తాడంటూ పొగడ్తలతో ముంచెత్తాడు హీరో సుమన్. విజయవాడలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సుమన్ అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ కామెంట్లు చేశాడు. వరుసగా ఒకే వ్యక్తికి మూడుసార్లు సీఎంగా అవకాశం ఇస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అంటూ ఎక్కడలేని ప్రేమను కురిపించేశాడు.
Also Read: Janasena-TDP Alliance: పవన్ స్పీచ్‌తో టీడీపీలో కొత్త ఆశలు.. వైసీపీలో అలజడి
దీంతో నెటిజన్లు సుమన్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఒక్కసారి సీఎం చేస్తేనే రాష్ట్రం పరిస్థితి ఇలా ఉంది ఇంకా మూడు సార్లు చేయాలా అంటూ సుమన్ ను ట్రోల్ చేస్తున్నారు. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అని జగన్ అడిగినందుకు ఇచ్చామని.. అందుకు ప్రతిఫలంగా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో పడేశాడని, సంక్షేమ పథకాలు తప్ప.. మరే అభివృద్ధి లేదంటూ కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.
నవరత్నాలు లాంటి స్కీంలతో రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందదని.. మరింత అప్పుల్లో కూరుకు పోతుందని సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. అయితే ఎలాంటి ఫామ్ లో లేని సుమన్ చేసిన ఈ కామెంట్ కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ తెలంగాణలో కేసీఆర్‌కు సపోర్ట్ గా ఉండే సుమన్.. సడన్ గా జగన్ పై ప్రేమ కురిపించడం ఏంటో ఎవరికీ అర్థం కావట్లేదు.
Also Read: AP Politics: ఆంధ్రప్రదేశ్ లో అధికారమే లక్ష్యంగా పార్టీల ప్లాన్లు?
[…] CM Jagan Meeting with MLAs: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం సర్వేల భయం పట్టుకుంది. వైసీపీ అందరు ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయించడంతో అందులో సుమారు యాభై మంది పనితీరు బాగాలేదని నివేదికలు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అందరిలో ఇప్పుడు సర్వే ఫీవర్ వెంటాడుతోంది. మూడేళ్ల కిందట గెలిచిన వారికి ఇప్పుడు టికెట్ ఇవ్వాలా? వద్దా? అనే సందేహాలు జగన్ వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలకు పదవి భయం పట్టుకుంది. త్వరలో మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశాలు కూడా ఉండటంతో మంత్రుల్లో సైతం తమ పదవి ఉంటుందో ఊడుతుందోనని సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. […]
[…] Also Read: Suman on Y S Jagan Govt: ఇంకో రెండు సార్లు జగన్‌ను… […]