https://oktelugu.com/

గ్రేటర్ వార్.. ఎన్నికలపై ఉపాధ్యాయుల ఎఫెక్ట్ పడనుందా?

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం ఈసారి ఎన్నడూ లేనంత హోరాహోరీగా సాగాయి. గత ఆరేళ్లలో తెలంగాణలో ఏ ఎన్నిక జరిగినా టీఆర్ఎస్ హవానే కొనసాగింది. అయితే ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక టీఆర్ఎస్ పార్టీకి గట్టి షాకిచ్చింది. దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు స్వల్ప మెజార్టీతో గెలుపొందాడు. ఈ ఓటమిని సీఎం కేసీఆర్ అవమానంగా ఫీలవడంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపించాలని భావిస్తున్నారు. బీజేపీ సైతం జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఛాలెంజ్ గా తీసుకోవడంతో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 1, 2020 11:43 am
    Follow us on

    1. GHMC ELECTION-2020

    జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం ఈసారి ఎన్నడూ లేనంత హోరాహోరీగా సాగాయి. గత ఆరేళ్లలో తెలంగాణలో ఏ ఎన్నిక జరిగినా టీఆర్ఎస్ హవానే కొనసాగింది. అయితే ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక టీఆర్ఎస్ పార్టీకి గట్టి షాకిచ్చింది. దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు స్వల్ప మెజార్టీతో గెలుపొందాడు. ఈ ఓటమిని సీఎం కేసీఆర్ అవమానంగా ఫీలవడంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపించాలని భావిస్తున్నారు. బీజేపీ సైతం జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఛాలెంజ్ గా తీసుకోవడంతో శీతాకాలంలోనూ వేడిరాజుకుంది.

    Also Read:  ప్రీపోల్ సర్వే: జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ కే మొగ్గు?

    ఈక్రమంలోనే సీఎం కేసీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారాన్ని మంత్రి కేటీఆర్ కలిసి పర్యవేక్షించారు. టీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఎక్కడా కూడా ఛాన్స్ ఇవ్వద్దని సీఎం కేసీఆర్ భావించడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటున్న టీచర్లను ఈసారి ఎన్నికలకు దూరంగా ఉంచినట్లు తెలుస్తోంది. దుబ్బాక ఎన్నికలో ఉపాధ్యాయులంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేయడంతో టీఆర్ఎస్ ఓటమిపాలైందని భావించడంతోనే వారిని ఈసారి ఎన్నికలకు దూరంగా ఉంచినట్లు తెలుస్తోంది.

    అయితే రాష్ట్రంలో ఇప్పటివరకు ఎలాంటి ఎన్నిక జరిగినా కూడా ఉపాధ్యాయులదే కీలక పాత్ర. ఈసారి వారంతా ఎన్నికలకు దూరంగా ఉండటం ఆ ప్రభావం జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణపై పడుతోంది. ఈసారి నాన్ టీచింగ్ స్టాఫ్ ను ఎన్నికల కోసం ఎన్నికల అధికారులు వినియోగించుకుంటున్నారు. ఈసారి తక్కువ విద్యార్హత ఉన్నవారికి ఎన్నికల విధులు అప్పగించడంతో ఆ ప్రభావం బల్దియా ఎన్నికలపై ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది.

    Also Read: కేసీఆర్‌‌కు గడ్డు రోజులేనా..!

    ఎన్నికల నిబంధనల ప్రకారం 30శాతం సిబ్బంది రిజర్వులో కేటాయించగా అవసరమైన సిబ్బంది అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఉపాధ్యాయులు లేకపోవడంతో సిబ్బంది కొరత కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. ఇప్పటికే డ్యూటీలు వేసిన వారిలో చాలామంది కరోనా భయాలు.. సిఫారసులు.. ఇతర కారణాలతో రాలేదని తెలుస్తోంది. దీంతో ఉన్నఫలంగా అందుబాటులో ఉన్న అంగన్ వాడీ.. ఆర్అండ్ బీ ఇతర శాఖల సిబ్బందిని వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది.

    ఎన్నికల్లో ఏదైనా సమస్య వస్తే ఉపాధ్యాయులు వెంటనే చక్కబెడుతారనే పేరుంది. టీచర్లకు ఉన్న సహజ లక్షణాల్లో ఇదొకటి కావడంతో ప్రతీ ఎన్నికల్లోనూ వీరిని ఎన్నికల కమిషన్ వాడుకుంటోంది. అయితే ఈసారి ఉపాధ్యాయులు లేకుండా ఎన్నికలు జరుగుతుండటంతో ఏదైనా సమస్య వస్తే మాత్రం ఓటర్లు ఇబ్బందులుపడే అవకాశం కన్పిస్తోంది. మరోవైపు ఉపాధ్యాయులను ప్రభుత్వం దూరంగా ఉంచడంతో ఈ ఎన్నికల్లో వారంతా వ్యతిరేకంగా ఉండే అవకాశం కన్పిస్తోంది. ఏదిఏమైనా ఉపాధ్యాయుల్లేకుండా రాష్ట్రంలో జరుగుతున్న తొలి ఎన్నికగా గ్రేటర్ ఎన్నికలు రికార్డులకెక్కింది. ఈనేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎలా జరుగుతాయనే ఆసక్తి ప్రతీఒక్కరిలో నెలకొంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్