https://oktelugu.com/

రాజమౌళియా మాజాకా? యాక్షన్ సీన్ కోసం అన్ని రోజులా?

దర్శక దిగ్గజం రాజమౌళి తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘‘ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం)’. ప్యాన్ ఇండియా మూవీ తెరకెక్కున్న ఈ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్నారు. మెగా.. నందమూరి హీరోలు ఒకే స్క్రీన్ పై కన్పించడంతో అభిమానులు ‘ఆర్ఆర్ఆర్’పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టుగానే ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఇటీవల రిలీజైన్ ‘భీమ్ ఫర్ రామరాజు’.. ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్లు యూట్యూబ్లో సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’లో […]

Written By:
  • NARESH
  • , Updated On : November 30, 2020 / 10:25 PM IST
    Follow us on

    దర్శక దిగ్గజం రాజమౌళి తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘‘ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం)’. ప్యాన్ ఇండియా మూవీ తెరకెక్కున్న ఈ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్నారు. మెగా.. నందమూరి హీరోలు ఒకే స్క్రీన్ పై కన్పించడంతో అభిమానులు ‘ఆర్ఆర్ఆర్’పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

    ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టుగానే ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఇటీవల రిలీజైన్ ‘భీమ్ ఫర్ రామరాజు’.. ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్లు యూట్యూబ్లో సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’లో ఇప్పటికే బాలీవుడ్ కు చెందిన అలియా భట్.. అజయ్ దేవగణ్ వంటి స్టార్స్ నటిస్తున్నారు. దీంతో హిందీలోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

    తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీకి సంబంధించిన అతి భారీ యాక్షన్ ఎపిసోడ్ ని పూర్తి చేశారని తెలుస్తోంది. 50 రోజుల పాటు సింగిల్ యాక్షన్ తీశారని తెలిసింది. ఒక మల్టీస్టారర్ కోసం ఒకే యాక్షన్ సీక్వెన్స్ కోసం 50 రోజులు పనిచేయడం అనేది గతంలో వినని విషయం. ఇలాంటిది రాజమౌళికి మాత్రమే సాధ్యమవుతుందని క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు.

    ఇక షెడ్యూల్ ని ముగించి వెంటనే చిత్రబృందం కొత్త షెడ్యూల్ ని ప్రారంభించనుందని సమాచారం. కరోనా ప్రభావం తగ్గాక ఈ మూవీని విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.