https://oktelugu.com/

బల్దియాలో చివరగా బ్యాలెట్ ఎన్నిక ఎప్పుడు జరిగిదంటే?

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం ముగిసింది. గత కొద్దిరోజులుగా ప్రధాన పార్టీల మధ్య హోరా హోరీ ప్రచారం జరిగింది. నిన్నటితో ప్రచారం ముగియగా నేడు నగరంలో పోలింగ్ జరుగనుంది. ఎన్నికల అధికారులు జీహెచ్ఎంసీ ఎన్నికలకు పకడ్బంధీ ఏర్పాట్లు చేశారు. దాదాపు 18ఏళ్ల తర్వాత బల్దియాలో బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరుగుతుండటం ఈసారి ప్రధాన ఆకర్షణగా నిలువనుంది. Also Read: ప్రీపోల్ సర్వే: జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ కే మొగ్గు? మారుతున్న కాలానికి తగ్గట్టుగానే ఎన్నికల ప్రక్రియలోనూ సరికొత్త మార్పులు వచ్చాయి. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 1, 2020 / 08:00 AM IST
    Follow us on

    జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం ముగిసింది. గత కొద్దిరోజులుగా ప్రధాన పార్టీల మధ్య హోరా హోరీ ప్రచారం జరిగింది. నిన్నటితో ప్రచారం ముగియగా నేడు నగరంలో పోలింగ్ జరుగనుంది. ఎన్నికల అధికారులు జీహెచ్ఎంసీ ఎన్నికలకు పకడ్బంధీ ఏర్పాట్లు చేశారు. దాదాపు 18ఏళ్ల తర్వాత బల్దియాలో బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరుగుతుండటం ఈసారి ప్రధాన ఆకర్షణగా నిలువనుంది.

    Also Read: ప్రీపోల్ సర్వే: జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ కే మొగ్గు?

    మారుతున్న కాలానికి తగ్గట్టుగానే ఎన్నికల ప్రక్రియలోనూ సరికొత్త మార్పులు వచ్చాయి. బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఎన్నికల స్థానంలో ఈవీఎంలు వచ్చి చేరాయి. బ్యాలెట్ పేపర్ కంటే ఈవీఎంలకు వ్యయప్రసాలు తక్కువగా ఉండటంతో 1994ఎన్నికల నుంచి దేశంలో ఈవీఎంలను వాడటం మొదలు పెట్టారు.

    1994 సంవత్సరంలో మూడు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఈవీఎంలను తొలిసారి ప్రయోగాత్మకంగా వినియోగించారు. ఆ తర్వాత 2004 లోక్ సభ ఎన్నికల నుంచి ఈవీఎంలను దేశవ్యాప్తంగా వాడటం షూరు చేశారు. కాగా ఈసారి జీహెచ్ఎంసీలో బ్యాలెట్ పద్ధతిలో జరుగడానికి రాజకీయ పార్టీలే కారణమని తెలుస్తోంది.

    Also Read: గ్రేటర్ వార్.. ఎన్నికలపై ఉపాధ్యాయుల ఎఫెక్ట్ పడనుందా?

    జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించే ముందు రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాన్ని కోరింది. దాదాపు అన్ని పార్టీలు బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని కోరడంతో అందుకు తగ్గ ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల సంఘం చేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల దృష్టిలో ఉంచుకొని 28,683 బ్యాలెట్ బాక్సులను ఎన్నికల సంఘం సిద్ధం చేసిందని సమాచారం.

    కాగా 2002లో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్(MCH)గా ఉన్న సమయంలో చివరిసారిగా బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరిగాయి. ఇక 2009లో.. 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలను ఈవీఎంలతోనే నిర్వహించారు. ఇక 2020లో జరుగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు మాత్రం బ్యాలెట్ పద్ధతిలో నిర్వహిస్తుండటం గమనార్హం.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్