spot_img
Homeఆంధ్రప్రదేశ్‌దివీస్‌ విషయంలో టీడీపీ, వైసీపీ యూటర్న్‌

దివీస్‌ విషయంలో టీడీపీ, వైసీపీ యూటర్న్‌

Divis‌ east godavari
తూర్పుగోదావరి జిల్లా దివీస్ పరిశ్రమలో విధ్వంసం తీవ్ర దుమారం రేపుతోంది. దాదాపుగా వెయ్యి మందికిపైగా ఒక్క సారిగా పరిశ్రమపై దాడి చేసి.. గోడలు బద్దలు కొట్టి.. నిర్మాణాలకు.. కంటెయినర్లకు నిప్పు పెట్టారు. ఆందోళనకారుల ఆవేదనతోనే ఇదంతా చేసినట్లుగా స్పష్టమవుతోంది. అంతేకాదు.. రాజకీయ పార్టీలూ తమను మోసం చేశాయన్న ఆగ్రహం వారిలో కనిపిస్తోంది. తమను ఎవరూ పట్టించుకోకుండా.. రాజకీయంగా వాడుకుంటూ.. తమను కాలుష్యానికి బలి చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది.

Also Read: జగన్‌తో ట్వంటీ ట్వంటీ ఆడేసుకున్న 2020

తొండంగిలోని సెజ్‌ కోసం స్థలం కేటాయించగా.. అందులో దివీస్‌ పరిశ్రమ పెట్టాలని టీడీపీ హయాంలో నిర్ణయించారు. అందుకు గాను అప్పటి ప్రభుత్వం భూములు కేటాయించింది. అయితే.. ఆ పరిశ్రమ కాలుష్య కారకమని.. వద్దంటూ వైసీపీ నేతలు.. రైతులను రెచ్చగొట్టి ఉద్యమం చేశారు. పెద్ద ఎత్తున వివాదాలు జరిగాయి. ప్రతిపక్ష నేత జగన్.. దివీస్ పరిశ్రమను అక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేశారు. తాము గెలవగానే కాలుష్య కారక పరిశ్రమలన్నింటినీ దూరంగా తరలిస్తామని హామీ ఇచ్చారు. దీంతో అక్కడి ప్రజలు వైసీపీకి పెద్ద ఎత్తున ఓట్లు వేశారు.

కానీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ ఆ పరిశ్రమకు శంకుస్థాపన చేయడానికి వస్తున్నారు. దీంతో అక్కడ ఆందోళనలు చేసిన వారి కడుపు మండిపోయింది. జగన్ కూడా తమను మోసం చేశారంటూ.. అక్కడి ఆందోళనకారులు.. తమ ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు. కొద్ది రోజులుగా నిరాహారదీక్షలు చేస్తున్నారు.

Also Read: బీజేపీ డ్యూయెల్‌ రోల్‌..: అటు రైతులతో, ఇటు సీఎంలతో చర్చలు

జగన్‌ నిర్ణయంతో వారిలో ఆగ్రహం పెరిగిపోయింది. కాలుష్య కారక పరిశ్రమను బలవంతంగా తమ నెత్తిపై పెట్టబోతున్నారని అసహనానికి లోనయ్యారు. ఫలితంగా విధ్వంసకాండ సృష్టించారు. ఈ విషయంలో వైసీపీ మాత్రమే కాదు.. టీడీపీ కూడా మడమ తిప్పింది. గతంలో దివీస్ పరిశ్రమకు అనుమతి ఇచ్చిన టీడీపీ నేతలు ఇప్పుడు అక్కడ పరిశ్రమ వద్దంటున్నారు. ఈ తీరుతోనే ప్రజల్లో తిరుగుబాటు వచ్చే ప్రమాదం ఏర్పడుతోంది. మరోవైపు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనావాసాల మధ్య కాలుష్య పరిశ్రమ వద్దంటూ నినదించిన వైసీపీ.. ఇప్పుడు శంకుస్థాపనకు రావడం గమనార్హం.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...
Oktelugu Epaper
Exit mobile version