దొంగను పట్టించిన గూగుల్ యాప్.. ఎలా అంటే..?

మనం ఏ విషయానికి సంబంధించిన సమాచారం కావాలన్నా వెంటనే గూగుల్ యాప్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అయితే గూగుల్ యాప్ తాజాగా ఒక దొంగను పట్టించింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా గూగుల్ యాప్ వల్ల తప్పు చేసిన ఒక వ్యక్తి ఇప్పుడు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. బాల్యంలో బాగా చదువుకుని ఉంటే ఇలా జైలులో శిక్ష అనుభవించే పరిస్థితి వచ్చి ఉండేది కాదని ఆ దొంగ బాధ పడుతున్నాడు. Also Read: ఆన్ లైన్ అప్పు.. […]

Written By: Navya, Updated On : December 18, 2020 11:51 am
Follow us on


మనం ఏ విషయానికి సంబంధించిన సమాచారం కావాలన్నా వెంటనే గూగుల్ యాప్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అయితే గూగుల్ యాప్ తాజాగా ఒక దొంగను పట్టించింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా గూగుల్ యాప్ వల్ల తప్పు చేసిన ఒక వ్యక్తి ఇప్పుడు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. బాల్యంలో బాగా చదువుకుని ఉంటే ఇలా జైలులో శిక్ష అనుభవించే పరిస్థితి వచ్చి ఉండేది కాదని ఆ దొంగ బాధ పడుతున్నాడు.

Also Read: ఆన్ లైన్ అప్పు.. ఆయువును మింగేస్తుందా?

పూర్తి వివరాల్లోకి వెళితే లండన్ లో ఒక కారులో నుంచి గంజాయి వాసన ఘాటుగా వస్తూ ఉండటంతో పోలీసులు కారును, కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులను తనిఖీ చేశారు. అయితే కారులో కానీ, వ్యక్తుల దగ్గర కానీ గంజాయి ఆకు కూడా దొరకకపోవడంతో తాము పొరబడ్డామని పోలీసు భావించారు. ఆ తరువాత పోలీసులు ఇంగ్లీష్ లో దొంగలకు క్షమాపణ చెప్పారు. అయితే కారులోని ఇద్దరు వ్యక్తులలో ఒక వ్యక్తికి స్థానిక భాష తప్ప ఇంగ్లీష్ కూడా రాదు.

Also Read: లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే వారంలో రెండు రోజులు ఇలా చేయాల్సిందే!

ఇంగ్లీష్ రాకపోవడం వల్ల పోలీసులు పొరపాటు పడి కారును తనిఖీ చేశామని చెప్పిన మాటలు అతనికి అర్థం కాలేదు. దీంతో ఆ వ్యక్తి గూగుల్ ట్రాన్స్ లేట్ ఓపెన్ చేసి వాళ్లు చెప్పే మాటలను అర్థం చేసుకోవాలని భావించాడు. అయితే స్మార్ట్ ఫోన్ లో పొరపాటున ఆ వ్యక్తి గూగుల్ ట్రాన్స్ లేషన్ కు సంబంధించిన బటన్ కు బదులుగా గంజాయి తోటలో ఉన్న వీడియోను ప్లే చేశాడు. పోలీసులు వెంటనే అతని స్మార్ట్ ఫోన్ ను తీసుకోవడంతో పాటు ఇద్దరిని అరెస్ట్ చేశారు.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

ఆ తరువాత వాళ్లు పెంచుతున్న 300 గంజాయి మొక్కలను సీజ్ చేశారు. ఎన్నో దొంగతనాలు చేసిన ఆ వ్యక్తి చేసిన చిన్న పొరపాటు వల్ల పోలీసులకు దొరికిపోయాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఘటన వైరల్ అవుతుండగా దొంగ మూర్ఖత్వంతో దొరికిపోయాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.