https://oktelugu.com/

ఆన్ లైన్ అప్పు.. ఆయువును మింగేస్తుందా?

ప్రస్తుతం మనమంత కరోనా కాలంలో జీవిస్తున్నాం. కరోనా ధాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవడంతో కోట్లాది మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఆదాయం లేకపోవడంతో అప్పులిచ్చే నాథుడు కరువు అవడంతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. Also Read: తెలంగాణ విద్యార్థులకు, నిరుద్యోగులకు విద్యాశాఖ శుభవార్త.. ఆన్ లైన్ లో టెట్..? ఈ బలహీనతనే కొన్ని ఆన్ లైన్ సంస్థలు వ్యాపారంగా మార్చేశాయి. ఇన్ స్టంట్ లోన్ పేరిట కొన్ని ఆన్ లైన్ సంస్థలు ఇటీవల కొత్తగా పట్టుకొస్తున్నాయి. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 18, 2020 / 10:51 AM IST
    Follow us on

    ప్రస్తుతం మనమంత కరోనా కాలంలో జీవిస్తున్నాం. కరోనా ధాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవడంతో కోట్లాది మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఆదాయం లేకపోవడంతో అప్పులిచ్చే నాథుడు కరువు అవడంతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు.

    Also Read: తెలంగాణ విద్యార్థులకు, నిరుద్యోగులకు విద్యాశాఖ శుభవార్త.. ఆన్ లైన్ లో టెట్..?

    ఈ బలహీనతనే కొన్ని ఆన్ లైన్ సంస్థలు వ్యాపారంగా మార్చేశాయి. ఇన్ స్టంట్ లోన్ పేరిట కొన్ని ఆన్ లైన్ సంస్థలు ఇటీవల కొత్తగా పట్టుకొస్తున్నాయి. మీకు అప్పు ఇచ్చేందుకు మీకు రెడీ అంటూ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వారికి గాలం వేస్తున్నాయి.

    కరోనా సమయంలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోవడంతో వాళ్ల ఆదాయం తగ్గింది. బ్యాంకులు.. వడ్డీ వ్యాపారుల చుటూ తిరగకుండానే ఆన్ లైన్లోనే డబ్బులు అప్పుగా ఇస్తుండటంతో చాలామంది వీటికి అట్రాక్ట్ అవుతున్నారు. దీనికితోడు కొందరు మీకు డబ్బులా కావాలా నాయనా? అంటూ హస్కీ వాయిస్ తో బురిడి కొట్టిస్తున్నారు.

    వీరి మాటలు నమ్మి అప్పు తీసుకుంటే ఇక అంతే.. తీసుకున్న అప్పు.. వడ్డీ టైము చెల్లికపోతే సదరు యాప్ నిర్వాహఖులు వేధింపులకు గురిచేస్తుంటారు. దీనిని తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుండటం శోచనీయంగా మారింది.

    Also Read: 10వేల సాయం ఇచ్చారు కానీ.. వివరాలే లేవంట..!

    ఇటీవలే సిద్దిపేట కు చెందిన యువతి ఓ ఆన్ లైన్ యాప్లో ఇన్‌స్టంట్ లోన్ తీసుకొని డబ్బులు చెల్లించడంలో ఆలస్యం చేసింది. దీంతో ఆ యాప్ నిర్వాహకులు డబ్బులు కట్టాలంటూ ఆమెను వేధింపులకు గురిచేయడంతో ఆమె తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది.

    ఈ సంఘటన మరువక ముందే హైదరాబాద్లోనూ ఇలాంటి సంఘటనే తాజాగా వెలుగుచూసింది. రాజేందర్ నగర్ కిస్మాత్ పూర్ కు చెందిన ఓవ్యక్తి సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. కరోనాతో ఆర్థిక సమస్యలు తలెత్తడంతో ఓ ఆన్ లైన్ యాప్లో ఇన్ స్టంట్ లోన్ తీసుకున్నాడు.

    కొన్ని నెలలుగా బాగానే కట్టాడు. అయితే ఇటీవల ఆదాయం తగ్గడంతో లోన్ కట్టడం ఆలస్యమైంది. దీంతో సదరు యాప్ నిర్వహాకులు యువకుడి అమ్మకు సైతం ఫోన్ చేసి వేధించారు. దీంతో ఆ యువకుడు ఆత్మహత్యకు చేసుకున్నాడు.

    ఆర్థిక మాద్యంతో ఇబ్బందుల్లో ఉన్నవారికి ఇన్ స్టంట్ లోన్ల పేరుతో అప్పులు ఇచ్చి.. తిరిగి కట్టడం లేదనే సాకుతో వేధింపులకు పాల్పడుతున్న సదరు ఆన్ లైన్ సంస్థలపై పోలీసులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే డిమాండ్స్ విన్పిస్తున్నాయి.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్