అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా మారబోతోంది. వైసీపీ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని తేలిపోవడంతో ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందనే దానిప ఉత్కంఠ నెలకొంది. అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా అమరావతిపై ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీకి ఈ తీర్పు ఊరట కల్పించింది. అమరావతికి మద్దతుగా టీడీపీ గట్టిగా వాయిస్ వినిపించేందుకు అవకాశం దొరికినట్లయింది. అమరావతిలో అక్రమాల నిరూపణకు దర్యాప్తు సంస్థలకు సవాల్ కానుంది.
అమరావతి రాజధానిగా ప్రకటించినప్పటి నుంచి ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంది. అప్పట్లో రాజధాని ప్రకటనకు ముందే టీడీపీ నేతలు భూములు కొనేశారని ఓ ఆరోపణ రాజధానికి ప్రధాని శంకుస్థాపన చేసినా నిధులివ్వలేదని నేతలు వాపోతున్నారు. పేద, ఎస్సీ రైతులు భూములు లాక్కొన్నారని మరో ఆరోపణ కూడా ఉంది. ఇలా ఒకదాని వెనుక మరో ఆరోపణ రావడంతో అమరావతికి తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు భారీ ఊరటగా మారుతోంది. ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరిట వైసీపీ కొన్నేళ్లుగా చేస్తున్న ఆరోపణలకు దీంతో చెక్ పడింది. అంతే కాదు అమరావతిలో దర్యాప్తుల పేరిట సాగుతున్న హంగామాకు కూడా చెక్ పడడం ఖాయంగా కనిపిస్తోంది.
అమరావతిల ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలతో టీడీపీ అధినేత చంద్రబాబు, అప్పటి మంత్రులు నారాయణ, పుల్లారావుతో పాటు మరికొందరు కీలక నేతలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ప్రభుత్వం వరుస దర్యాప్తులతో వారిని వెంటాడింది. అమరావతిలో కిందిస్థాయి నేతలు, కార్యకర్తలు, రైతుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. కొన్నేళ్లుగా వారి వాదనను పట్టించుకునే వారే కరువయ్యారు. చివరికి సుప్రీంకోర్టు ఇప్పుడు ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పునే సమర్థించడంతో టీడీపీకి క్లీన్ చిట్ లభించినట్లయింది. దీంతో టీడీపీ అమరావతికి మద్దతుగా మరింత దూకుడుగా వాయిస్ వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలతోనే వైసీపీ సర్కారు అక్కడ సీఐడీ, ఏసీబీ, సిట్ వంటి దర్యాప్తు విభాగాలతో విచారణలు చేయిస్తోంది. అందులో టీడీపీనేతలే ప్రధానంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరితో పాటు భూములు అమ్ముకున్న రైతుల్ని కూడా ప్రభుత్వం టార్గెట్ చేస్తోంది. భూములు అమ్ముకోవడానికి గల కారణాలు చెప్పాలంటూ వారిని పదేపదే విచరాణలకు రప్పిచింది. దీంతో వారి కుటుంబాలు కూడా నలిగిపోతున్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుతో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీఐడీ, సిట్, ఏసీబీ దర్యాప్తులు నిలిచిపోయే అవకాశముంది.
అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న రాష్ర్ట ప్రభుత్వ విభాగాలు సాగిస్తున్న దర్యాప్తుల్ని నిలిపివేయాల్సిన పరిస్థితి ఎదురైంది. దీంతో ఇప్పుడు ఇన్ సైడర్ ట్రేడింగ్ మినహాయించి మిగిలిన ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీలపైనే వైసీపీ సర్కారు దృష్టి పెట్టబోతోంది.
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read MoreWeb Title: Tdp welcomes scs decision on insider trading of amaravati lands
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com