
దేశంలో కరోనా కేసులు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 30,093 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. 125 రోజుల తర్వాత కరోనా కేసులు 30 వేలకు చేరాయి. మరో వైపు కొత్తగా 45,254 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. వైరస్ బారిన పడి 374 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్త కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,11,74,322కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 4,06,130 యాక్టివ్ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది.