spot_img
Homeఆంధ్రప్రదేశ్‌TDP: చంద్రబాబు రాకున్నా.. తెలుగు తమ్ముళ్ల క్లారిటీ!

TDP: చంద్రబాబు రాకున్నా.. తెలుగు తమ్ముళ్ల క్లారిటీ!

TDP: ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో త్వ‌ర‌లో బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ స‌మావేశాల‌కు హాజ‌రు కావాలా వ‌ద్దా అనే సందిగ్ధంలో టీడీపీ ఉంది. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాల్సిందేనా అనే దానిపై ప్ర‌ధానంగా చ‌ర్చించారు. గ‌తంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల సంద‌ర్భంగా ఆయ‌న ఇక తాను స‌భ‌కు రాన‌ని శ‌ప‌థం చేసి మ‌రీ వెళ్లారు. ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి తాను స‌భ‌కు రాన‌ని చెబుతున్నారు. తాము కూడా స‌భ‌కు వెళ్ల‌మ‌ని ఎమ్మెల్యేలు చెబుతుండ‌టంతో చంద్ర‌బాబు స‌ర్దిచెబుతున్నారు. స‌భ‌లో ప్ర‌తిప‌క్షం లేకుంటే విలువ ఉండ‌దు. అందుకే మ‌నం క‌చ్చితంగా వెళ్లాల్సిందేన‌ని సూచిస్తున్నారు.

TDP
TDP Chandrababu

దీనిపై టీడీపీ కూలంక‌షంగా చ‌ర్చించింది. స‌భ‌లో పాల్గొని అధికార పార్టీ ఆగ‌డాల‌ను అడ్డుకోవాల‌ని భావిస్తోంది. అధికార పార్టీ దురాగాతాల‌కు అడ్డుక‌ట్ట వేయాల‌ని చూస్తోంది. ఇందులో భాగంగానే స‌భ‌లో అనుస‌రించాల్సిన వ్యూహంపై కూడా ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌రిగింది. వైసీపీ నిర్ణ‌యాల‌తో రాష్ట్రంలో పురోగ‌తి క‌నిపించ‌డం లేద‌ని తెలుస్తోంది. దీన్నే ప్ర‌ధాన అస్త్రంగా చేసుకుని వైసీపీపై ఎదురుదాడి చేయాల‌ని వ్యూహాలు ఖ‌రారు చేస్తోంది.

దీనికి గాను ఎమ్మెల్యేలంద‌రు సిద్ధం కావాల‌ని చెబుతోంది. రాబోయే ఎన్నిక‌ల నేప‌థ్యంలో వైసీపీని ఎక్క‌డిక‌క్క‌డ నిలువ‌రించే ప్ర‌య‌త్నాల్లో భాగంగా టీడీపీ అన్ని మార్గాల‌ను అన్వేషిస్తోంది. విజ‌య‌గ‌ర్వంతో విర్ర‌వీగిపోతున్న వైసీపీకి చెక్ పెట్టాల‌ని నిర్ణ‌యించుకుంది. దీనికి అన్ని దారుల‌ను అవ‌కాశంగా మ‌లుచుకోవాల‌ని చూస్తోంది. ఈ క్ర‌మంలో స‌భ నిర్వ‌హ‌ణ‌లో ప్ర‌జ‌ల పక్షంగా నిల‌బ‌డి వైసీపీని నిల‌దీసేందుకు రెడీ అవుతోన్న‌ట్లు క‌నిపిస్తోంది.

Also Read: ఫైర్ బ్రాండ్ కొడాలి నానికి వేటు తప్పదా.. ఆయన ప్లేస్ లో వచ్చేది అతనేనట..
చంద్ర‌బాబు స‌భ‌లో ఉన్న‌ప్పుడే ప‌ట్టించుకోని సీఎం జ‌గ‌న్ ఇక బాబు రాకపోతే టీడీపీ ఎమ్మెల్యేల‌కు అవ‌కాశం ఇస్తారా? లేక వారితో ఆడుకుంటారా? అనే అనుమానాలు అంద‌రిలో వ‌స్తున్నాయి. బాబునే లెక్క‌చేయ‌ని జ‌గ‌న్ ఎమ్మెల్యేల‌కు త‌గిన గౌర‌వం ఇస్తారా? లేదా అనేది సందిగ్దం నెల‌కొంది. మొత్తానికి టీడీపీకి మాత్రం క‌ష్టాలే రానున్నాయ‌ని తెలుస్తోంది.

చంద్ర‌బాబు రాకున్నా తాము జ‌గ‌న్ ను ఎదుర్కొంటామ‌ని టీడీపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. అధికార పార్టీ చేస్తున్న తప్పుల‌ను ఎత్తిచూపుతామ‌ని భావిస్తున్నారు. ప్ర‌జ‌ల ఇబ్బందుల‌ను స‌భా వేదిక‌గా నిల‌దీస్తామ‌ని చ‌ర్చించుకుంటున్నారు. ఏదిఏమైనా బడ్జెట్ స‌మావేశాల్లో ఎంత‌మేర‌కు ప్ర‌భావం చూపుతారో వేచి చూడాల్సిందే.

Also Read: పోలవరంపై కేంద్రం హామీలు సరే.. నిలబెట్టుకుంటదా.. నమ్మొచ్చా..?

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Tata Sierra

Tata Sierra: కఠినమైన రోడ్లపై కూడా సాఫీగా సాగేలా.. టాటా కొత్త ప్రయోగం..

Tata Sierra: ప్రస్తుత కాలంలో కారు కొనే ముందు చాలా విషయాలు ఆలోచిస్తున్నారు. కొందరు కేవలం సిటీలో మాత్రమే రన్ అయ్యే కారుపై ఆసక్తి చూపుతుండగా..మరికొందరు మాత్రం లాంగ్ డ్రైవ్ లో గతుకుల...
Banana Benefits

Banana Benefits: అరటిపండు ఈ టైంలో తినొచ్చా..ఎవరు తినకూడదు..

Banana Benefits: మార్కెట్లో విరివిగా లభించే పండ్లలో అరటిపండు ఒకటి. ఇది రుచితో పాటు శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లు, పొటాషియం, విటమిన్ B6, ఫైబర్ వంటి పోషకాలను అందిస్తుంది. చిన్నారుల నుంచి పెద్దల...
July 26 Zodiac Predictions

July 26 Zodiac Predictions: జూలై 26 నుంచి ఈ ఆరు రాశుల వారికి పండుగే.. ఎలాగంటే

July 26 Zodiac Predictions: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల్లో మార్పుల కారణంగా కొన్ని రాశుల స్థానాలు మారుతూ ఉంటాయి. జూలై 26 నుంచి గురు చంద్రుల మధ్య ఏర్పడనున్న రాశి పరివర్తన...
Japan Heatwave

Japan Heatwave: అధిక ఉష్ణోగ్రతలతో హీటెక్కుతున్న జపాన్.. హ్యుమన్ ఫ్రిడ్జ్ వాడుతున్న జనం.. అసలేంటిది..

Japan Heatwave: సాధారణంగా ఆహ్లదకరమైన వాతావరణాన్ని కలిగి ఉండే జపాన్ ఇప్పుడు అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇటీవల దేశంలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్ కు చేరుకోవడంతో అక్కడి...
Lenin Success

Lenin Success: లెనిన్ హిట్ తో దర్శకుడి జాతకం మతిపోయింది… స్టార్ హీరోతో మూవీ సెట్ చేసుకున్నాడుగా…

Lenin Success: అఖిల్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అక్కినేని అఖిల్... మొదటి సినిమాతోనే బుక్క బోర్లపడ్డాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన కెరియర్ లో ఒక్క సక్సెస్ కూడా దక్కలేదు. ఎట్టకేలకు...
Oktelugu Epaper