Nara Lokesh: గల్లీలో టీడీపీ అభిమాని ఆందోళన.. ఢిల్లీలో లోకేష్ రిలాక్స్

తెలుగుదేశం పార్టీకి కర్త కర్మ క్రియ చంద్రబాబే. ఆ తరువాత ఎవరు? అన్నదే ఇప్పుడు అసలు సిసలైన ప్రశ్న. మొన్నటి వరకు చిన్న బాబు లోకేష్ ఉన్నాడు అంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరపడిపోయారు.

Written By: Dharma, Updated On : October 2, 2023 5:29 pm
Follow us on

Nara Lokesh: చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో రెండు ఎకరాల చంద్రబాబు నాయుడు వేలాది కోట్లకు అధిపతి ఎలా అయ్యాడు? రాజకీయాల్లో ఎలా రాణించాడు? హెరిటేజ్ ద్వారా పాలు, పెరుగు, కూరగాయలు, అమ్మితే ఇంత సంపద తెచ్చుకోగలిగాడా? అంటే సమాధానం దొరుకుతుందా? దాని నిస్సిగ్గుగా చంద్రబాబు ఒప్పుకోగలరా? ఆయన కచ్చితంగా రాజకీయాలను, అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేలాది కోట్ల ఆస్తులను కూడబెట్టుకున్నారు. ఎవరైనా కేసులు వేస్తే ఎంతకాలం వ్యవస్థలను మేనేజ్ చేసుకుని తప్పించుకుంటూ వచ్చారు. కోర్టు లు ఇచ్చిన స్టేలతో కాలం గడుపుతున్నారు. ఇప్పుడు ఇప్పుడు మాత్రం అడ్డంగా బుక్ అయ్యారు. అసలు చంద్రబాబును టచ్ చేస్తారనుకున్నారా? కనీసం అరెస్టు చేస్తారని భావించారా? అరెస్టు చేసినా ఇన్ని రోజులు రిమాండ్ ఉంటుందని ఊహించారా? గంటలు రోజులయ్యాయి.. రోజులు వారాలయ్యాయి.. అయినా సరే చంద్రబాబు బయటపడే మార్గం కనిపించడం లేదు. ప్రపంచం బద్దలైనట్టు ఎల్లో మీడియా గోల పెడుతోంది. టిడిపి శ్రేణులు కంచాలతో రణగోణ ధ్వనులు చేస్తున్నాయి. అయితే సామాన్య జనం మాత్రం సాఫీగా జీవనం సాగిస్తున్నారు.

నారా లోకేష్ కు గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. కానీ దానిని చేజేతులా దూరం చేసుకున్నారు. అధినేత జైలులో ఉన్నప్పుడు.. పార్టీకి కష్టకాలం వచ్చినప్పుడు.. ఇంతటి సంక్షోభం ఎదురైనప్పుడు అడ్వాంటేజ్ గా తీసుకొని తనను తాను నిరూపించుకోవాలి. ఒక విధంగా చెప్పాలంటే వైసిపి ఆ ఛాన్స్ ఇచ్చింది. తన తండ్రి మాదిరిగా సంక్షోభాలను తనకు అనుకూలంగా మలుచుకోవడంలో లోకేష్ ముమ్మాటికి ఫెయిలయ్యారు. ఇది రాజకీయ విమర్శకుల మాటా కాదు. ప్రత్యర్థుల విమర్శ కాదు. అసలు సిసలు టిడిపి కార్యకర్త నోటి నుంచి వినిపిస్తున్న మాట ఇది. చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు నా తండ్రిని చూడనివ్వరా? అంటూ తూర్పుగోదావరి పోలీసులతో లోకేష్ గొడవ పడినప్పుడు.. ఇక చినబాబు విశ్వరూపం చూస్తామంటూ తెలుగు తమ్ముళ్లు సంబరపడిపోయారు. కానీ అటు తరువాత లోకేష్ ఆవేశం ఆవిరైపోయింది. తనకు తానుగా సోదరుడిగా ప్రకటించిన పవన్ వచ్చేసరికి ఆవేశం మరింత క్షీణించింది. సిఐడి అరెస్టును తప్పించుకునేందుకు ఢిల్లీ బాట చూపించింది.

తాను అరెస్టులకు భయపడేది లేదంటూ ఢిల్లీ మీడియా ముందు లోకేష్ గర్జించారు. నేల విడిచి సాము చేశారు. అదే గల్లీ మీడియా ముందుకు వచ్చి.. పాదయాత్రను కంటిన్యూ చేస్తూ వైసీపీ మీద నిప్పులు తిరుగుతూ.. తన తండ్రి అరెస్టు విషయంలో జరుగుతున్న అన్యాయంపై గర్జిస్తే తప్పకుండా అనుకూల వాతావరణం ఏర్పడేది. ముందుగా టిడిపి క్యాడర్లో ధైర్యం పెరిగేది. తాను ఢిల్లీలో ఉంటూ.. తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణితో పార్టీని నడిపించుకోవాలనుకోవడం ముమ్మాటికి మూర్ఖత్వమే. నాలుగున్నర దశాబ్దాల చరిత్ర కలిగిన టిడిపికి అసలు సిసలైన గడ్డు రోజులే. చంద్రబాబు అరెస్ట్ కంటే.. లోకేష్ ఢిల్లీ వెళ్లి ఉండిపోవడమే టిడిపి శ్రేణులకు అసలు సిసలు బాధ. ఒకవేళ తండ్రితో పాటు అరెస్ట్ అయి ఉంటే దాని పర్యవసానాలు తీవ్రంగా ఉండేవి. కానీ రోజుల తరబడి ఢిల్లీలో ఉండి… అన్ని చల్లబడాక ఏపీకి వచ్చి అరెస్టు అయినా దాని ఫలితం అంతంత మాత్రమే. పార్టీ శ్రేణుల్లో సైతం అది ఇబ్బందికర పరిణామమే.

తెలుగుదేశం పార్టీకి కర్త కర్మ క్రియ చంద్రబాబే. ఆ తరువాత ఎవరు? అన్నదే ఇప్పుడు అసలు సిసలైన ప్రశ్న. మొన్నటి వరకు చిన్న బాబు లోకేష్ ఉన్నాడు అంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరపడిపోయారు. మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసేసరికి వారసుడు దొరికాడంటూ మురిసిపోయారు. ఇక తమకు ఏ జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదన్నట్టు భావించారు. కానీ చంద్రబాబు అరెస్ట్ తర్వాత లోకేష్ చూపిన నిర్వాకంతో డిఫెన్స్ లో పడిపోయారు. చంద్రబాబు లేని టిడిపి అనే నావకు లోకేష్ చుక్కని అవుతారని ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ వెన్ను చూపి లోకేష్ ఢిల్లీ వెళ్లి దాక్కున్న తీరు చూసి నివ్వెర పోయారు. తల్లి, భార్యకు రాజకీయాలను అప్పజెప్పి.. తాను మాత్రం అస్త్ర సన్యాసం చేసి హస్తినాలో కూర్చున్న తీరుతో అందరి ఆశలను నీరుగార్చారు. వైసీపీ సర్కార్ ఏరి కోరి ఇచ్చిన గోల్డెన్ ఛాన్స్ ను లోకేష్ మిస్సయ్యారు.

ఒకరోజు ఎంపీ గల్లా జయదేవ్ ఇంట్లో.. మరో రోజు ఎంపీ కనకమేడల ఇంట్లో రిలాక్స్ కావడమే తప్ప.. అధినేత అరెస్టుతో తల్లడిల్లిపోయిన సగటు టిడిపి కార్యకర్తల సైతం సౌండ్ చేయని స్థితిలో లోకేష్ మారడం ముమ్మాటికి తప్పిదమే. కొడుకు కోసం తెలుగుదేశం పార్టీలో రెండో నాయకుడు లేకుండా చంద్రబాబు చేసుకున్నారు. ప్రస్తుతం అది పార్టీకి మైనస్ గా మారింది. చంద్రబాబు లోకేష్ నమ్ముకుంటే.. ఆయనేమో పార్టీ కష్టకాలంలో ఉంటే ఢిల్లీ బాట పట్టారు. ఢిల్లీలో ఉండి ట్విట్ల ద్వారా పార్టీని నడిపించడం ముమ్మాటికీ తప్పిదమే. బహుశా లోకేష్ సామర్థ్యం తెలుసుకొని.. చంద్రబాబు సమిష్టి నాయకత్వం పేరుతో 14 మందిని పెట్టి హై పవర్ పేరుతో కమిటీని ఏర్పాటు చేశారు. అప్పుడే తెలిసిపోయింది లోకేష్ పనితీరు. బ్రాహ్మణిని ముందు పెట్టి రాజకీయం చేయాల్సిన దౌర్భాగ్యపు పరిస్థితి వస్తుందని సగటు టిడిపి అభిమాని ఊహించి ఉండరు. లాలూ ప్రసాద్ యాదవ్ ను సిబిఐ అరెస్టు చేసినప్పుడు తేజస్వి యాదవ్ చాలా చిన్నవాడు. పాతికేళ్లు కూడా నిండని తేజస్వి పార్టీ పగ్గాలు అందుకొని ముందుకు నడిపించారు. అంతెందుకు యూపీలో ములాయం సింగ్ యాదవ్ ఉండగానే.. అఖిలేష్ యాదవ్ తనను తాను నిరూపించుకున్నారు. అటు తెలంగాణలో కెసిఆర్ సైతం పెద్ద శ్రమ లేకుండా కేటీఆర్ అన్నీ తానై చూసుకుంటున్నారు. కానీ చంద్రబాబుకు మాత్రం ఆ అదృష్టం లేదు.

సంక్షోభాలు,సంక్లిష్ట పరిస్థితుల నుంచి నాయకత్వాలు పుట్టుకొస్తాయి. ఆ విషయంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక మంచి ఉదాహరణ. అతేంద్రీయమైన శక్తిగా ఉన్న సోనియా గాంధీని ఎదిరించారు.సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్నారు.సమస్యలను, సంక్షోభాలను అధిగమించి పార్టీని విజయ పధంలోకి తీసుకురాగలిగారు. కానీ బీహార్ లో తేజస్వి యాదవ్ కానీ, యూపీలో అఖిలేష్ యాదవ్ కానీ, తెలంగాణలో కేటీఆర్ కానీ, ఇప్పుడు ఏపీలో లోకేష్ కానీ.. వారికి అప్పటికే నిర్మితమైన ఓ స్ట్రక్చరల్ పార్టీ ఉంది. ఆ పార్టీని నడిపించడం చాలా సులువు. కష్టాలను, సంక్షోభాలను అధిగమించడం సునాయాసమైన టాస్క్. కానీ లోకేష్ మాత్రం చిన్నపాటి టాస్క్ ను సైతం పూర్తి చేయలేకపోయారు. తండ్రి అరెస్టును చక్కగా డీల్ చేయలేకపోయారు. భయంతో ఢిల్లీ పరుగులు పెట్టారు. ఎల్లో మీడియా జాకీ పెట్టి లేపినా లేవలేని స్థితిలో ఉండడం సగటు తెలుగుదేశం అభిమానికి రుచించడం లేదు. చంద్రబాబుకు క్వాష్ పిటిషన్ కొట్టివేతకు గురైనా, బెయిల్ పై బయటకు వచ్చినా లోకేష్ కొట్టిన దెబ్బతో టిడిపి శ్రేణులు విలవిలలాడుతున్నారు. గతం మాదిరిగానే జూనియర్ ఎన్టీఆర్ను కోరుకుంటున్నారు.