Property Loan: కాలం మారుతున్న కొద్దీ అవసరాలు పెరిగిపోతున్నాయి. దీంతో వస్తున్న ఆదాయం సరిపోవడం లేదు. ఒక్కోసారి ప్రత్యేక అవసరాలకు చేతిలో డబ్బు లేకపోవడంతో బ్యాంకు నుంచి రుణం తీసుకోవాల్సి వస్తోంది. అయితే మంచి సాలరీ ఉంటేనే బ్యాంకులు వ్యక్తిగత రుణం ఇచ్చేందుకు ముందుకు వస్తాయి. ఈ అవకాశం లేని వారు ఏదైనా ప్రాపర్టీని తాకట్టుపెట్టి లోన్ తీసుకోవ్చు. దీంతో కొన్ని బ్యాంకులు ప్రాపర్టీ ఆధారంగా అవసరమైనంత మేర రుణాన్ని ఇస్తాయి. దీంతో కొందరు అత్యవసర పరిస్థితుల్లో ఇల్లు డాక్యమెంట్లు లేదా ఇతర ముఖ్యమైన పత్రాలు తాకట్టుపెట్టి రుణం తీసుకుంటారు. ఇలా తీసుకున్న వారికి ఓ విషయంలో బ్యాంకు రోజుకు రూ.5000 ఫ్రీగా ఇస్తుంది. ఎలాగో తెలుసా?
వ్యక్తులకు రుణాలు ఇచ్చే విషయంలో బ్యాంకులు పకడ్బందీగా ఉంటాయి. లోన్ తీసుకునేవారి డాక్యుమెంట్లను సరైనవా? లేవా? అని పరిశీలించిన తరువాతే రుణాన్ని జారీ చేస్తాయి. డాక్యమెంట్లలో ఏ చిన్న మిస్టేక్ ఉన్నా రిజెక్ట్ చేస్తాయి. రుణం జారీ చేసిన తరువాత నెల నెలా లేదా గడువు లోగా చెల్లించకపోతే భారీ వడ్డీని విధిస్తుంది. అంతేకాకుండా గడువు దాటి సంవత్సరాలు గడిస్తే పాపర్టీని జప్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
బ్యాంకులు ఇంత పకడ్బందీగా ఉన్నప్పుడు అవి చేసే తప్పులకు కూడా భారీ జరిమానాలు వినియోగదారులకు చెల్లిస్తాయి. ఎలాగంటే? బ్యాంకులో నుంచి ఒక వ్యక్తి రుణం తీసుకున్నాడనుకుందాం. ఆ వ్యక్తికి సంబంధించిన డాక్యుమెంట్లను బ్యాంకు వారు జాగ్రత్తగా భద్రపరచాలి. రుణం తీసుకునే సమయంలో ఆ వ్యక్తి ఇచ్చిన డాక్యుమెంట్లు ఎలా ఉన్నాయో.. అంతే సేఫ్ గా ఉంచాలి. కానీ ఒక్కోసారి బ్యాంకులు ఇలాంటి డాక్యుమెంట్లు మిస్ చేస్తుంటాయి. అంతేకాకుండా సరైన సమయానికి అందుబాటులో ఉంచవు.
వ్యక్తులు బ్యాంకు నుంచి తీసుకున్న రుణాన్ని చెల్లించిన రోజే వారికి సంబంధించిన డాక్యమెంట్లు రిటర్న్ ఇవ్వాలి. లేదా నెల రోజులలోపు ఎట్టిపరిస్థితుల్లో వారికి ఇవ్వాల్సి ఉంటుంది. నెలరోజులు గడిచినా తనకు సంబంధించిన డాక్యమెంట్లు ఇవ్వని పక్షంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం రుణం తీసుకున్న వ్యక్తికి బ్యాంకు వారు రోజుకు రూ.5000 చెల్లించాలి. అలా ఎన్ని రోజుల పాటు డిలే చేస్తే అన్ని రోజులు ఇలా చెల్లిస్తూనే ఉంటాయి.