Yellow Media: తెలుగు రాష్ట్రాల్లో ఎల్లో మీడియా తీరే వేరు. వారికి తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలు ముఖ్యం. చంద్రబాబు పల్లకీ మోయడం ప్రీతికరం. అత్యవసరంగా టీడీపీ అధికారంలోకి రావాలి. చంద్రబాబు సీఎం కావాలి. తాము కొన్ని రాళ్లు వెనుక వేసుకోవాలి. తెల్లవారు లేచింది మొదలు జగన్ ప్రభుత్వంపై విషపు రాతలతో రెచ్చిపోతుంటాయి. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో వైసీపీ శ్రేణుల్లో అయోమయం, గందరగోళం సృష్టించేందుకు ‘పచ్చ’రాతలతో రెచ్చిపోతున్నాయి. పలానా వారికి జగన్ టిక్కెట్లు ఇవ్వడం లేదంటూ వైసీపీ అంతర్గత వ్యవహారాల్లో కలుగజేసుకుంటున్నాయి. రాజకీయంగా డ్యామేజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. సీనియర్ మంత్రులకు నలుగురికి టిక్కెట్టు లేవట? స్పీకర్ ను పక్కకు తప్నిస్తున్నారుట? ఆ మంత్రులను ఎంపీలుగా పోటీచేయాలని ఆదేశిస్తున్నారుట? ఆ ఎమ్మెల్యేకు ప్రజావ్యతిరేకత అధికంగా ఉందట? అంటూ ఊహాజనిత వార్తలతో కన్ఫ్యూజ్ చేసేందుకు ఎల్లో మీడియా రంగంలోకి దిగడం విశేషం.
ఏ పార్టీకైనా రాజకీయ విధివిధానాలు ఉంటాయి. ఎన్నికల్లో వ్యూహాలు ఉంటాయి. అది ఏ పార్టీకైనా సహజం. కానీ జగన్ ఇటీవల వర్కుషాపులో తేల్చేశారు. ఐ ప్యాక్ టీమ్ నివేదిక ఇచ్చింది. నిఘా వర్గాలు హెచ్చరించాయి. 30 నుంచి 35 మంది దాకా వైసీపీ సిట్టింగులను తప్పిస్తారు. ఈ సంఖ్య అంతకంటే మించి ఉన్నా ఆశ్చర్యపడనవసరం లేదని వైసీపీ ఎమ్మెల్యేల్లో ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేసి వారిలో విష భీజాన్ని నింపాలని చూడడాన్ని ఏమనాలి? ఎలా వర్ణించాలి? ఏ పార్టీ అయినా గెలుపుగుర్రాలకే టిక్కెట్ ఇస్తుంది. దానికి కొంత హేతుబద్ధత చూపిస్తుంది. కానీ గెలుపు కోసం అడ్డదారులు తొక్కే స్థితిలో జగన్ ఉన్నారా? అంటే మాత్రం లేదనే సమాధానం అంతటా వినిపిస్తోంది. కానీ మార్పుచేర్పులపై జగన్ తర్భజభర్ఝన పడుతున్నారని..35 మంది ఎమ్మెల్యేల వరకూ మొండి చేయి తప్పదని..స్పీకర్ తమ్మినేనికి నో చెప్పేశారని..ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో రాజాం, ఎచ్చెర్లలో మార్పు తప్పదని..పాయకరావుపేటలో మహిళా అభ్యర్థిని తీసుకొచ్చారని..నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడు సోదరుడ్ని పోటీలో దించుతున్నారని..సీనియర్లను పక్కనపెట్టి వారసులకు టిక్కెట్లు ఇస్తున్నారని ప్రచారం చేస్తున్నారు.
ఎన్టీఆర్ తరువాత కొత్తవారికి టిక్కెట్లు ఇచ్చి గెలిపించుకుంది జగన్మోహన్ రెడ్డే. గత ఎన్నికల్లో దాదాపు కొత్తవారికే టిక్కెట్లు ఇచ్చారు. కొత్తగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన చాలా మంది విద్యాధికులకు టిక్కెట్లు కట్టబెట్టారు. ఎంపీపీ, జడ్పీటీసీ పదవులు చేపట్టిన వారికి సైతం అప్ గ్రేడ్ కల్పించారు. ఎమ్మెల్యే పదవిపై కొందరి కలలను సాకారం చేయించారు. నాయకులను తయారుచేసిన దిక్సూచిగా జగన్ మారారు. గత ఎన్నికలకు మించి మెజార్టీ రావాలంటే పార్టీలో కొన్ని కీలక నిర్ణయాలు ముఖ్యం. అందుకే జగన్ పనిచేసేవారికే టిక్కెట్లు అని ప్రకటించారు. అది ఎల్లోమీడియాకు బూతు మాటగా వినిపించింది. పలువనలను చిలువలు చేసి… అందుకు తమ సొంత ప్రయోజనాలను కలగలిపి వైసీపీపైనా, సీఎం జగన్ పైనా విషపు రాతలతో రెచ్చిపోతున్నారు. అయితే ఎల్లోమీడియా రాతలను వైసీపీ ఎమ్మెల్యేలు, శ్రేణులు లైట్ తీసుకుంటున్నారు. ఇటువంటి విషపు రాతలకు అలవాటుపడిపోయామని.. అదరం..బెదరం అంటూ తేల్చిచెబుతున్నారు.
అలులేదు చూలు లేదు..కొడుకు పేరు సోమలింగం అన్నట్టు..పలానా ఎమ్మెల్యేలను మార్చుతున్నారని.. వారి కొట్టే దెబ్బ అలా ఇలా ఉండదని చెబుతున్నారు. వారు రెబల్స్ గా మారుతారని వీరు ముందే అంచనా వేస్తున్నారు. మొన్నటివరకూ వైసీపీ ఎమ్మెల్యేలంత
డమ్మీలని చెప్పుకొచ్చేవారు. కానీ ఇప్పుడు నాలుగేళ్లపాటు పవర్ అనుభవించారని.. పదవి వదులుకునేందుకు ఎలా సిద్ధపడతారని ప్రశ్నిస్తున్నారు. కచ్చితంగా రెబల్స్ గా మారుతారని చెబుతున్నారు. కనీసం పది వేల ఓట్లు అయినా పట్టుకెళ్తారని.. మరొకరికి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే ఒప్పుకోరంటూ వారిలో విషం నింపే ప్రయత్నాలు చేస్తున్నారు. తల్లి, చెల్లినే విడిచిపెట్టిన జగన్ మిమ్మల్ని సైతం అలానే చేస్తారని చెప్పుకొస్తున్నారు. అయితే ఎల్లోమీడియా రాతలను చూస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు నవ్వుకుంటున్నారు.
తెలుగుదేశం పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. అధినేత చంద్రబాబు అరెస్టయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో గత మూడు వారాలుగా రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కేసు నుంచి బయటపడేందుకు పడరాని పాట్లు పాడుతున్నారు. అటు కోర్టుల్లో సైతం చుక్కెదురవుతోంది. మరోవైపు కేసుల మీద కేసులు చుట్టుమడుతున్నాయి. ఇప్పట్లో విమక్తి కలిగే చాన్స్ లేదని సంకేతాలు వస్తున్నాయి. అటు కుమారుడు లోకేష్ కు సైతం సీఐడీ నోటీసులిచ్చింది. త్వరలో అరెస్ట్ తప్పదని తెలుస్తోంది. హెరిటెజ్ సంస్థపై కేసు నమోదుకావడంతో మేనేజ్మెంట్ హోదాలో ఉన్న బ్రాహ్మణి, భువనేశ్వరిలపై సైతం అనుమానాపు చూపులు ప్రారంభమయ్యాయి. ఇది అమానుషం, అన్యాయమంటూ ఎల్లో మీడియా రంకెలు వేస్తోంది. ప్రపంచం బద్ధలైపోతుందన్న రీతిలో సౌండ్ చేస్తోంది. అందులో భాగంగా వైసీపీ మీడియాపై విషపురాతలను ప్రారంభించింది. కానీ ఎల్లోమీడియా విషపు రాతల గురించి తెలుసుకున్న సామాన్య జనం సైతం లైట్ తీసుకుంటున్నారు.