టీడీపీకి గడ్డు కాలం తప్పదా..? మున్సిపల్‌ ఫలితాలు తేల్చేశాయా..?

ఏపీలో మరికొద్ది గంటల్లో కార్పొరేషన్‌, మున్సిపల్ ఫలితాలు పూర్తిస్థాయిలో వెల్లడికానున్నాయి. ఇప్పటికే కొన్ని రిజల్ట్స్‌ స్పష్టం కాగా.. అన్నింటిలో కీలమైనవి రాజధాని ప్రాంతంలో ఉన్న విజయవాడ, గుంటూరు, అలాగే రాజధాని కాబోతున్న విశాఖ కార్పొరేషన్లు. వీటి ఫలితాలు అధికార, ప్రతిపక్షాలు రెండింటికీ కీలకం. రెండేళ్ల కిందట అధికారంలోకి వచ్చిన వైసీపీ సంక్షేమ పథకాలే ఆలంబనగా పాలన సాగిస్తోంది. Also Read: మున్సిపల్ ఫలితాల్లో వైసీపీ ప్రభజనం.. 15 మున్సిపాల్టీలు కైవసం.. బోణి కొట్టని టీడీపీ ఎన్నివిధాలా దాడి చేయాలో […]

Written By: Srinivas, Updated On : March 14, 2021 12:36 pm
Follow us on


ఏపీలో మరికొద్ది గంటల్లో కార్పొరేషన్‌, మున్సిపల్ ఫలితాలు పూర్తిస్థాయిలో వెల్లడికానున్నాయి. ఇప్పటికే కొన్ని రిజల్ట్స్‌ స్పష్టం కాగా.. అన్నింటిలో కీలమైనవి రాజధాని ప్రాంతంలో ఉన్న విజయవాడ, గుంటూరు, అలాగే రాజధాని కాబోతున్న విశాఖ కార్పొరేషన్లు. వీటి ఫలితాలు అధికార, ప్రతిపక్షాలు రెండింటికీ కీలకం. రెండేళ్ల కిందట అధికారంలోకి వచ్చిన వైసీపీ సంక్షేమ పథకాలే ఆలంబనగా పాలన సాగిస్తోంది.

Also Read: మున్సిపల్ ఫలితాల్లో వైసీపీ ప్రభజనం.. 15 మున్సిపాల్టీలు కైవసం.. బోణి కొట్టని టీడీపీ

ఎన్నివిధాలా దాడి చేయాలో అన్నివిధాలా ప్రభుత్వం మీద రెండేళ్లుగా దాడి జరిగింది. మతం కార్డు వాడారు. కులం కార్డు వాడారు. ఇసుక అన్నారు, భవన నిర్మాణ కార్మికులు అన్నారు. రౌడీయిజం అన్నారు. ఇలా వాడని కార్డు లేదు. కుట్రలు, కుతంత్రాలు చేశారు. గుళ్లపై దాడులు చేసి వైసీపీ ఖాతాలో వేశారు. ప్రతీ కార్డు ఉన్నట్లుండి చటుక్కున మాయం అయినవే. ఇలాంటి నేపథ్యంలో మున్సిపల్‌ ఎన్నికలు వచ్చాయి. గుంటూరు, విజయవాడ దగ్గర నూరు రోజులకు పైగా రాజధాని ఉద్యమం తెలుగుదేశం అనుకూల మీడియాలో సాగుతోంది. అందువల్ల అది నిజంగా ఉంటూ ఈ ఎన్నికల్లో కచ్చితంగా ప్రతిఫలించాలి.

Also Read: గంటా కొత్త స్కెచ్‌.. బీజేపీ నుంచి పవన్‌ను దూరం చేయడమే టార్గెట్‌

అలాగే విశాఖ ఉక్కు సమస్య. తెలుగుదేశం పార్టీ, దాని మద్దతు దారులు విపరీతంగా ప్రచారం చేసి, దాన్ని మోడీ ఖాతాలోంచి లాక్కుని మరీ వైసీపీ ఖాతాలోకి వేశారు. పైగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖలో తెలుగుదేశం తన పట్టు చాటుకుంది. తెలుగుదేశం మూలాల్లో ఉన్న సామాజిక వర్గం విశాఖ మీద దశాబ్దాల కాలంగా సాధించిన పట్టును కోల్పోకూడదని కిందా మీదా అవుతోంది. విజయసాయిరెడ్డి ధాటిని తట్టుకోలేక విలవిల్లాడుతోంది. ఇలాంటి నేపథ్యంలో కార్పొరేషన్ ఎన్నికలు వచ్చాయి. రాజధాని సమస్య ఉన్న విజయవాడ, గుంటూరుల్లో అలాగే తమ పట్టువున్న విశాఖలో పరువు నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

పార్టీని కాపాడుకోవాలనే తాపత్రయంతో తన వారసుడు లోకేష్‌ను నమ్ముకోకుండా స్వయానా చంద్రబాబే రంగంలోకి దిగారు. నానా మాటలు మాట్లాడారు. పులివెందుల అన్నారు. ఫ్యాక్షనిజం, రౌడీయిజం అన్నారు. అవన్నీ చాలక జనాలను తిట్టడం మొదలు పెట్టారు. ‘మీకు సిగ్గు లేదు, శరం లేదు.. పౌరుషం లేదు’ అంటూ నానా విధాలుగా రెచ్చగొట్టారు. ఇన్ని చేసిన తరువాత ఇప్పుడు మూడు చోట్లా కానీ గెలవకపోతే, ఇక తెలుగుదేశం 2023 మీద కూడా ఆశలు వదిలేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకుంటే ఇప్పుడు ఆ పార్టీ వాడని అస్త్రమంటూ లేదు. వాడని కార్డ్ లేదు. మరో రెండేళ్లలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ రెండేళ్లలో చేయగలిగిందీ లేదు. పైగా ఈ మూడు చోట్ల పరువు దక్కకపోతే తెలుగుదేశం పార్టీ ఇక గడ్డు పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందనేది వాస్తవం.