టీఆర్ఎస్‌లోకి కోదండరామ్.. కేసీఆర్‌తో భేటీ.. ఇందులో నిజమెంత..?

ప్రొఫెసర్‌‌ కోదండరాం.. తెలంగాణలో పరిచయం అక్కర్లేని పేరు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగడానికి ఉద్యోగ జేఏసీ ఏర్పాటు చేసిన నేత. అలాంటి నేతకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ప్రత్యేక స్థానమంటూ ఏమీ దొరకలేదు. అంతేకాదు.. సీఎం కేసీఆర్‌‌తో వచ్చిన విభేదాలతో సొంతంగా తెలంగాణ జన సమితి పేరిట పార్టీని స్థాపించారు. ఇప్పుడు ఏకంగా పట్టభద్రుల స్థానం నుంచి ఎమ్మెల్సీగా బరిలో నిలిచారు. ఇప్పుడు కోదండరాం గురించి కొత్త న్యూస్‌ వైరల్‌ అవుతోంది. Also Read: భవిష్యత్తులో పవన్–-షర్మిల మధ్యే […]

Written By: Srinivas, Updated On : March 14, 2021 12:46 pm
Follow us on


ప్రొఫెసర్‌‌ కోదండరాం.. తెలంగాణలో పరిచయం అక్కర్లేని పేరు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగడానికి ఉద్యోగ జేఏసీ ఏర్పాటు చేసిన నేత. అలాంటి నేతకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ప్రత్యేక స్థానమంటూ ఏమీ దొరకలేదు. అంతేకాదు.. సీఎం కేసీఆర్‌‌తో వచ్చిన విభేదాలతో సొంతంగా తెలంగాణ జన సమితి పేరిట పార్టీని స్థాపించారు. ఇప్పుడు ఏకంగా పట్టభద్రుల స్థానం నుంచి ఎమ్మెల్సీగా బరిలో నిలిచారు. ఇప్పుడు కోదండరాం గురించి కొత్త న్యూస్‌ వైరల్‌ అవుతోంది.

Also Read: భవిష్యత్తులో పవన్–-షర్మిల మధ్యే పోటీ..?

కోదండరాం త్వరలో టీఆర్‌‌ఎస్‌లో చేరబోతున్నట్లు సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందుకోసం కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్లి ఆయనతో భేటీ అయ్యారని ఆ వీడియోలో పేర్కొన్నారు. టీవీ9 లోగో పేరుతో ఈ వీడియోలు సర్క్యులేట్ చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారంపై టీవీ9 స్పందించింది. ఇది ఫేక్ వీడియో అని.. దీంతో టీవీ9కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. అంతేకాదు.. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశామని వెల్లడించింది.

Also Read: బండి సంజయ్‌ @ 600 కోట్ల కథ

ఇక.. ఇదే అంశంపై కోదండరాం కూడా స్పందించారు. తమకు ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చిందని.. ఈ విషయాన్ని తట్టుకోలేక కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నట్టు కోదండరాం తెలిపారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

తెలంగాణలో ప్రస్తుతం రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో ఒకటైన నల్లగొండ, ఖమ్మం, వరంగల్ స్థానం నుంచి కోదండరామ్ ఎన్నికల బరిలో నిలిచారు. గతేడాది నుంచి ఇందుకు సంబంధించి ఆయన ప్రచారం కూడా చేపట్టారు. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు కోదండరామ్ కూడా బరిలో ఉండటంతో.. ఈ స్థానం నుంచి ఎవరు విజయం సాధిస్తారని ఉత్కంఠ నెలకొంది. అయితే.. ఎన్నికలు జరిగే రోజే కోదండరామ్ టీఆర్ఎస్‌లో చేరబోతున్నట్టు వార్తలు రావడం కలకలం రేపింది.