2011 మార్చిలో జపాన్ ను ముంచెత్తిన సునామీ ఉత్పాతం గురించి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ దారుణ ప్రళయంలో భవనాలు, వాహనాలు ఎన్నో కొట్టుకుపోయాయి. ఇక గాల్లో కలిసిన ప్రాణాలకు లెక్కేలేదు. ఈ ఘోర విపత్తులో దాదాపు 18,000 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ఆ దేశం గుర్తించింది. దాదాపు లక్షా యాభై వేల మందిని నిరాశ్రయులను చేసింది. అయితే.. సునామీతోపాటు మరో ప్రమాదం కూడా దీని వెనక ఉంది.
Also Read: ఔరంగ జేబు దర్శించిన దేవాలయం.. ఎన్నెన్ని ప్రత్యేకతలో..!
జపాన్ లోని హోన్షూ దీవిలో పుకుషిమా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉన్న ప్రాంతానికి కొన్నికిలోమీటర్ల దూరంలో సముద్రంలో మొదటగా భూకంపం సంభవించింది. ఆ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 9.0గా నమోదైంది. ఈ భూకంపం వల్ల సముద్ర జలాలు ఆ దీవి మొత్తాన్ని ముంచెత్తాయి. అవి జనావాసాలను ధ్వంసం చేయడంతోపాటు మరో ప్రమాదానికి కూడా కారణం అయ్యాయి. దాదాపు 14మీటర్ల ఎత్తుతో ఎగిసిపడిన సముద్ర జలాలు అనురియాక్టర్లకు రక్షణగా ఏర్పాటు చేసిన ప్రహరీని దాటుకొని అందులోకి ప్రవేశించాయి. దీంతో.. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మొత్తం జలమయం అయిపోయింది.
Also Read: శివరాత్రి పూజ చేస్తున్నారా.. పూజించే సమయంలో పాటించాల్సిన నియమాలివే..?
దీంతో.. అందులో మంటలు కూడా సంభవించాయి. కొన్ని చోట్ల పేలుళ్లు కూడా జరిగాయి. దీనివల్ల వెలువడే రేడియేషన్ తో దారుణమైన దుష్ప్రభావాలు ఉండే అవకాశం ఉంటుందని.. సమీపంలోని దాదాపు లక్షా 50 వేల మందిని ఇతర ప్రాంతాలకు తరలించారు.
అయితే.. ఈ ఘటన జరిగి ఇప్పటికి పదేళ్లు అవుతున్నప్పటికీ.. ఇంకా ఆ ప్రాంతంలోని పట్టణాలన్నీ నిర్జీవంగా ఉన్నాయి. అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కానీ.. రేడియేషన్ భయం ఇంకా పూర్తిగా తొలగిపోలేదు.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
పదేళ్ల క్రితం అను రియాక్టర్లలో నిండిన నీటిని ఇప్పటి వరకూ బయటకు వదల్లేదు. అందులో దాదాపు కొన్ని మిలియన్ టన్నుల రేడియో యాక్టివ్ పదార్థాలు నిండి ఉన్నాయి. వాటిని ఎలా బయటకు తీయాలి అనేది అర్థం కావట్లేదు. ఈ నీటిని తిరిగి సముద్రంలోకి పంపించేందుకు యోచిస్తున్నారు. కానీ.. ఈ క్రమంలో ఏదైనా తేడా జరిగితే.. నష్టం దారుణంగా ఉంటుంది. అందుకే.. ఆచూతూచి స్పందిస్తోంది అక్కడి ప్రభుత్వం.
ఆ నీటిని బయటకు వదలడానికి కొన్ని వేల మంది కార్మికులు దాదాపు 30 నుంచి 40 సంవత్సరాలు పనిచేస్తే తప్ప, సాధ్యం కాదట! ఈ నీటిని సముద్రంలోకి వదిలితే జలచరాలకు జరిగే నష్టం.. తద్వారా మనుషులపై పడే ప్రభావంపైనా ఆందోళనలు ఉన్నాయి. ఈ రేడియేషన్ మనిషి డీఎన్ఏ పై ప్రభావం చూపుతుందని అంటున్నారు. మరికొందరు మాత్రం.. సముద్రంలోకి వదలడం వల్ల పెద్దగా ప్రమాదం ఉండదని చెబుతున్నారు. మొత్తానికి పదేళ్ల క్రితం జరిగిన దారుణం.. ఇంకా జపాన్ ను వెంటాడుతూనే ఉంది. భవిష్యత్ లోనూ కొనసాగనుంది. ఇంతకంటే దారుణ విపత్తు ఏముంటుంది?