Kodali Nani: ఏపీలో అధికార వైసీపీ, టీడీపీ మధ్య సవాళ్లు కొనసా..గుతూనే ఉన్నాయి. ఇటీవల తాను గుడివాడలో కేసినో నిర్వహించినట్లు నిరూపిస్తే అక్కడే పెట్రోల్ పోసి నిప్పంటించుకుంటానని మంత్రి కొడాలి నాని సవాల్ చేశారు. కాగా, ఆ సవాలును టీడీపీ స్వీకరించింది. కేసినో నిర్వహించారనే దానికి అన్ని ఆధారాలు సమర్పిస్తామని చెప్పిన టీడీపీ ఆధారాలను బయటపెట్టింది. ఇందుకు సంబంధించిన సోషల్ మీడియా పోస్టులు, లింకులను విడుదల చేసింది.

యాసెస్ కేసినో అనే కంపెనీ గుడివాడలో మూడు రోజుల పాటు కేసినో నిర్వహించిందని, సంక్రాంతి పండుగ అయిన 15న సోషల్ మీడియాలో ఈ మేరకు పోస్ట్ చేసిందని టీడీపీ నేతలు వివరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఉందని, ఇదిగో ఆ వీడియో అంటూ.. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్లను చూపిస్తూ ప్రచారం చేస్తున్నారు టీడీపీ నేతలు. ఈ యాసెస్ కేసినో నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన ప్రిమాల్ టోపీవాలా అనే వ్యక్తికి సంబంధించిన సోషల్ మీడియా పోస్టును మీడియాకు టీడీపీ నేతలు విడుదల చేశారు.
Also Read: పవన్ కెరీర్లోనే ‘భీమ్లా నాయక్’ బెస్ట్ అట.. థమన్ షాకింగ్ కామెంట్స్ !
అలా కేసినోకు సంబంధించిన రెండు వీడియోలు స్పష్టంగా ఉన్నాయని టీడీపీ నేతలు చెప్తున్నారు. మూడు రోజుల పాటు వైసీపీ వారు కేసినో నిర్వహించినట్లు ఆధారాలివేనంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ వివరాలతో వైసీపీపైన ఫిర్యాదు చేస్తామని టీడీపీ నేతలు చెప్తున్నారు. డీజీపీకి కంప్లయింట్ చేస్తామని, అయితే, తమకు పోలీసు వ్యవస్థపైన నమ్మకం లేదని, వారు ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది తెలియదని చెప్తున్నారు.

తాము ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తామని స్పష్టం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. మొత్తంగా ఏపీలోని రాజకీయ వాతావరణం ఈ కేసినో వ్యవహారంతో ఇంకా వేడెక్కిందని చెప్పొచ్చు. అధికార వైసీపీ, టీడీపీ మధ్య రాజకీయ వైరం ఇంకా ముదురుతున్నది. మంత్రి కొడాలి నాని సవాల్ మేరకు టీడీపీ నేతల ఆధారాల సమర్పణ జరిగింది. అయితే, టీడీపీ నేతలు సమర్పించిన ఆధారాలపైన కొడాలి నాని ఏ విధంగా స్పందిస్తారనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశం కానుంది. కొడాలి నాని గతంలో టీడీపీలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. ఇకపోతే కేసినో నిర్వహించినట్లు వైసీపీ నేతలు కొందరు ఆఫ్ ది రికార్డు చెప్తున్నట్లు సమాచారం.
Also Read: ఈ యాక్టర్లను స్టార్ డైరెక్టర్లు సెంటిమెంట్ గా భావిస్తున్నారు తెలుసా..!