
అయితే, ఆ తరువాత ఏమైందో ఏమో గానీ, మళ్ళీ ఈ సినిమా రిలీజ్ గురించి ఎవ్వరు డైరెక్ట్ గా మాట్లాడిన దాఖలాలు లేవు. మొత్తానికి ఈ సినిమా రిలీజ్ కి సిద్ధం అయి ఏడాది గడిచింది. ఐతే, రెండు నెలల క్రితం ఒక కొత్త విడుదల తేదీని నిర్మాతలు అధికారికంగా ప్రకటించకపోయినా ఇన్ డైరెక్ట్ గా ఒక తేదీని బయటకు వదిలారు. అంతలో మళ్ళీ కరోనా సెకెండ్ వేవ్ వచ్చి రిలీజ్ ను అడ్డుకుంది.

ఏది ఏమైనా ‘కీర్తి సురేష్’ సోలో సినిమాలన్నీ ప్లాప్ లు అవ్వడంతో ఆయా చిత్రాల నిర్మాతలు పూర్తిగా నష్టపోతున్నారు. కరోనా సెకెండ్ వేవ్ లాక్ డౌన్ చాలామంది నిర్మాతలను ఇబ్బంది పెట్టింది. ఈ క్రమంలో ‘గుడ్ లక్ సఖి’ నిర్మాతలు ఎక్కువగానే నష్టపోయారు. సినిమా కొనడానికి ఏ బయ్యరు ముందుకు రావడం లేదు. పైగా డిజిటల్ అండ్ టీవీ శాటిలైట్ రైట్స్ కూడా ఇంతవరకు అమ్ముడుపోలేదు.

సినిమా రిలీజ్ అయి హిట్ అయితేనే, ఈ సినిమా రైట్స్ కి డబ్బులు వస్తాయి. లేదు అంటే.. ఈ సినిమా వల్ల నిర్మాతలకు భారీ నష్టాలూ వచ్చే అవకాశం ఉంది. ఇవ్వన్నీ ఆలోచించుకునే ఈ సినిమాని డైరెక్ట్ గా ఓటిటిలో రిలీజ్ చెయ్యాలని మేకర్స్ ప్లాన్ చేశారు. జనవరి 28న ‘గుడ్ లక్ సఖి’ సినిమా విడుదల కాబోతుంది. ఈ సినిమాకు పోటీగా మరే చిత్రం లేకపోవడంతో మరింతగా ప్రమోట్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

మరి ప్రమోషన్స్ ను వేగవంతం చేస్తే.. ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ, గతేడాది, కీర్తి సురేష్ నటించిన ‘పెంగ్విన్’, ‘మిస్ ఇండియా’ సినిమాలు డిజిటల్ వేదికల పైనే బిగ్ ప్లాప్ అయ్యాయి. దాంతో ‘గుడ్ లక్ సఖి’కి గుడ్ లక్ లేకుండా పోయింది. మరి ఓపెనింగ్స్ మాత్రం వస్తాయో రావో చూడాలి.