Sentiment Actors: సినిమా రంగం అంటేనే హిట్ లేదా ప్లాన్ అనేలా ఉంటాయి. ఒకసారి సినిమా హిట్ అయిందంటే చాలా ఆ సినిమాలో ఏవేం పనులు అయితే కలిసి వచ్చాయో వాటిని రిపీట్ చేస్తుంటారు హీరోలు. ఈ విషయంలో స్టార్ డైరెక్టర్లు కూడా వెనకడుగు వేయరు. తమ సినిమాల్లో కొందరు యాక్టర్ల విషయంలో, కేటగిరీల విషయంలో అలాంటివే తరచూ ఫాలో అవుతుంటారు. మన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు కూడా కొందరు యాక్టర్ల విషయంలో చాలా సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారండోయ్.
ముఖ్యంగా దర్శక ధీరుడు జక్కన్న తన ప్రతి సినిమాలో చంద్రశేఖర్ అనే యాక్టర్‌కు అవకాశం ఇస్తూ వస్తున్నారు. జక్కన్న సినిమాలో ఆయన చాలా కీలకమైన పాత్రలు పోషిస్తుంటారు. ఒక్క యమదొంగ, బాహుబలిలో మాత్రమే ఆయన కనిపించలేదు. మిగతా అన్ని సినిమాల్లో మాత్రం ఆయనకు మంచి ఛాన్సులు ఇస్తున్నారు. ఇక జక్కన్న దర్శకత్వం వహించిన సినిమాలు అన్నీ సంచలన విజయాలు నమోదు చేసిన విషయం తెలిసిందే.
Also Read: జూనియర్ ఎన్టీఆర్ కు ఎన్ని కోట్ల ఆస్తులున్నాయో తెలుసా..?
ఇక డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా యాక్టర్ సుబ్బరాజును తరచూ రిపీట్ చేస్తుంటారు. ఆయన దర్శకత్వం వహించిన 8 సినిమాల్లో సుబ్బరాజుకు అవకాశం ఇచ్చారు పూరి జగన్నాథ్.
అమ్మా నాన్న తమిల అమ్మాయి సినిమా నుంచి సుబ్బరాజును రిపీట్ చేస్తున్నారు పూరీ జగన్నాథ్. ఇక డైరెక్టర్ హరీశ్ శంకర్ కూడా మిరపకాయ్ సినిమా నుంచి మొదలుకుని ప్రతి సినిమాలో రావు రమేశ్‌కు ఏదో ఒక పాత్ర ఇస్తున్నారు.
ఇక క్లాస్ డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా తన సినిమాల్లో అమిత్ తివారి కు ఛాన్సలు ఇస్తుంటారు. ఏదో ఒక చిన్న పాత్రలో అయినా ఆయన్ను చూపిస్తారు త్రివిక్రమ్. ఇక కృష్ణ వంశీ బ్రహ్మాజీని, ఆర్జీవీ తనికెళ్ల భరణిని, శ్రీకాంత్ అడ్డాల రావు రమేశ్‌ను తమకు కలిసి వచ్చే యాక్టర్లుగా భావిస్తుంటారు కాబోలు. వారు తెరకెక్కించే సినిమాల్లో వారికి మాత్రం ఒక ఛాన్సు కచ్చితంగా ఇస్తుంటారు. అయితే ఈ సెంటిమెంట్ కూడా వారికి బాగానే పనిచేస్తుందండోయ్.
Also Read: ‘పుష్ప’రాజ్‌గా మారిన సురేశ్ రైనా.. ‘శ్రీవల్లి’ సాంగ్‌కు స్టైలిష్ స్టెప్స్..