రేషన్ కార్డ్ ఉంటే 2,500 రూపాయలు.. ప్రభుత్వం బంపర్ ఆఫర్..?

తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్నవారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. సంక్రాంతి పండుగ కానుకగా 2,500 రూపాయలు రేషన్ కార్డ్ ఉన్నవాళ్లకు పంపిణీ చేయడానికి సిద్ధమైంది. పండుగ ఖర్చుల కోసం ప్రభుత్వం ఈ మొత్తాన్ని రేషన్ కార్డ్ లబ్ధిదారులకు అందించనుంది. ఈ ఏడాది సంక్రాంతి పండుగ సమయంలో 1,000 రూపాయలు ఇచ్చిన తమిళనాడు సర్కార్ వచ్చే ఏడాది 2,500 రూపాయలు పంపిణీ చేయనుంది. Also Read: నిరుద్యోగులకు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా గుడ్ న్యూస్.. రూ.40 […]

Written By: Navya, Updated On : December 22, 2020 12:47 pm
Follow us on


తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్నవారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. సంక్రాంతి పండుగ కానుకగా 2,500 రూపాయలు రేషన్ కార్డ్ ఉన్నవాళ్లకు పంపిణీ చేయడానికి సిద్ధమైంది. పండుగ ఖర్చుల కోసం ప్రభుత్వం ఈ మొత్తాన్ని రేషన్ కార్డ్ లబ్ధిదారులకు అందించనుంది. ఈ ఏడాది సంక్రాంతి పండుగ సమయంలో 1,000 రూపాయలు ఇచ్చిన తమిళనాడు సర్కార్ వచ్చే ఏడాది 2,500 రూపాయలు పంపిణీ చేయనుంది.

Also Read: నిరుద్యోగులకు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా గుడ్ న్యూస్.. రూ.40 వేల వేతనంతో ఉద్యోగాలు..?

2021 సంవత్సరం జనవరి 4వ తేదీ నుంచి అర్హత ఉన్నవారికి నగదు పంపిణీ జరగనుంది. తమిళనాడు సర్కార్ నగదుతో పాటు పండుగ సరుకులను కూడా లబ్ధిదారులకు ఉచితంగా ఇస్తోంది. కిలో బియ్యం, కిలో బెల్లం, ఎండు ద్రాక్ష, చక్కెరను కూడా ప్రభుత్వం పంపిణీ చేయనుంది. రాష్ట్రంలో దాదాపు రెండున్నర కోట్ల మందికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా ప్రయోజనం చేకూరనుందని తెలుస్తోంది.

Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. రాత పరీక్ష లేకుండా 50వేల వేతనంతో ఉద్యోగాలు..?

అన్నాడీఎంకే పార్టీ గత ఐదేళ్ల నుంచి ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సమయంలో మాత్రం రేషన్ కార్డ్ ఉన్నవాళ్లకు కచ్చితంగా నగదు పంపిణీ చేస్తోంది. అయితే వచ్చే ఏడాది తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం సాధారణంగా ఇచ్చే నగదు కంటే వచ్చే ఏడాది సంక్రాంతికి ఎక్కువ మొత్తంలో పంపిణీ చేస్తున్నట్టు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

అయితే తమిళనాడు సర్కార్ నగదు పంపిణీ విషయంలో తీసుకున్న నిర్ణయం గురించి ప్రతిపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలకు కొన్ని నెలలు ఉన్న నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో నగదు పంపిణీ చేస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.