https://oktelugu.com/

అఖిల్ తో భారీ రిస్క్ చేస్తున్న ప్లాప్ నిర్మాత !

తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు దేశంలో అన్ని చిత్రపరిశ్రమలలో వారసుల హవానే ఎక్కువుగా నడుస్తుంది. వారసత్వం మీద సామాన్య ప్రజల్లో మిశ్రమ స్పందన ఉన్నా.. సినీ ప్రముఖుల మాత్రం వారసత్వంకే మొగ్గు చూపుతున్నారు. మొత్తానికి ఈ వారసత్వం మీద సామాన్యులకి అవకాశం ఇవ్వరా అని కొందరు అంటుంటే దానిలో తప్పేముంది అని కొందరు అంటున్నారు. ఒక్క సినిమా ఇండస్ట్రీలోనేనా వారసత్వం ఉందా ? రాజకీయ నాయకుల కొడుకులు రాజకీయాల్లోకి రావట్లేదా?వ్యాపారస్తుల కొడుకులు వ్యాపారంలోకి రావట్లేదా? మరి సినిమా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 21, 2020 / 07:08 PM IST
    Follow us on


    తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు దేశంలో అన్ని చిత్రపరిశ్రమలలో వారసుల హవానే ఎక్కువుగా నడుస్తుంది. వారసత్వం మీద సామాన్య ప్రజల్లో మిశ్రమ స్పందన ఉన్నా.. సినీ ప్రముఖుల మాత్రం వారసత్వంకే మొగ్గు చూపుతున్నారు. మొత్తానికి ఈ వారసత్వం మీద సామాన్యులకి అవకాశం ఇవ్వరా అని కొందరు అంటుంటే దానిలో తప్పేముంది అని కొందరు అంటున్నారు. ఒక్క సినిమా ఇండస్ట్రీలోనేనా వారసత్వం ఉందా ? రాజకీయ నాయకుల కొడుకులు రాజకీయాల్లోకి రావట్లేదా?వ్యాపారస్తుల కొడుకులు వ్యాపారంలోకి రావట్లేదా? మరి సినిమా వాళ్ళ కొడుకులు సినిమాల్లోకి రావటంలో తప్పేముంది? సినిమా ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా , టాలెంట్, అదృష్టం ఉంటేనే కెరీర్ ఉంటుంది. కానీ అక్కినేని యువ కెరటం అఖిల్ విషయంలో ఏం జరుగుతుందో ఎవరికి అర్ధం కావట్లేదు.

    అక్కినేని వంశం నుండి నాగేశ్వర రావు , నాగార్జునలు తెలుగు సినిమా చరిత్రలో ఉన్నత స్థానానికి చేరుకున్నారు. నాగార్జున మొదటి కొడుకు నాగచైతన్య కూడా వారి దారిలోనే పయనిస్తున్నాడు. కానీ అఖిల్ కి మాత్రం ఇంకా ఆ దారి అందనంత దూరంగా ఉంది. వీవీ వినాయక్ దర్శకత్వంలో ‘అఖిల్’ సినిమాతో గ్రాండ్ గా కెరీర్ ను మొదలుపెట్టిన అఖిల్ కు ఆ సినిమా ఫలితం భారీ షాక్ ఇచ్చింది. డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఆ సినిమా బడ్జెట్ లో సగం కూడా రికవరీ చేయలేకపోయింది. ఇష్క్ ,మనం, 24 లాంటి వరస హిట్లతో ఉన్న విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో అఖిల్ హీరోగా తెరకెక్కిన ‘హలో’ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా కమర్షియల్ గా ఫ్లాప్ అయింది.

    Also Read: ప్రభాస్ రెడీగా ఉన్నాడు… డైరెక్టర్ కావాలి అంటున్న నిర్మాత

    తొలిప్రేమ సినిమాతో హిట్ కొట్టిన వెంకీ అట్లూరి డైరెక్షన్ లో అఖిల్ ‘మిస్టర్ మజ్ను’ సినిమాలో నటించగా ఆ సినిమా కూడా అంచనాలను అందుకోలేకపోయింది. హిట్ కొట్టి ఉన్న డైరెక్టర్ లతో చేసినా కూడా అఖిల్ కు హిట్ అందలేదు . ప్రస్తుతం పుష్కర కాలం క్రితం హిట్ అందుకున్న బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా తరువాత అఖిల్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో అనిల్ సుంకర నిర్మాతగా దాదాపు 40 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో సినిమా తెరకెక్కనుందనట.

    Also Read: పవన్ ని ఢీ కొట్టనున్న రానా… ఆ క్రేజీ రీమేక్ స్టార్ట్

    మరోవైపు సురేందర్ రెడ్డి సినిమాలంటే మాస్ ఆడియన్స్ పెద్దగా ఆసక్తి చూపరు. మరి అఖిల్ పై అంత బడ్జెట్ పెడితే రికవరీ చేయగలడా ? కష్టమే ఫిలిం నగర్ టాక్. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఫలితం మీద అనిల్ సుంకర సినిమా ఫలితం ఆధారపడి ఉందని అంటున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్