
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘రాష్ట్ర ప్రభుత్వమనే పెద్దనావ.. అప్పులనే మంచుకొండ కారణంగా మునిగిపోయే పరిస్థితి తలెత్తింది. 19 నెలల్లోనే జగన్ ప్రభుత్వం లక్షా 40 వేల కోట్ల అప్పులు చేసింది. చంద్రబాబు ప్రభుత్వం 5 ఏళ్లలో చేసిన అప్పు రూ.లక్షా28 వేల కోట్లు మాత్రమే. రెండేళ్లకే లక్షా 40 వేల కోట్ల అప్పులు చేస్తే.. మిగిలిన మూడేళ్లలో జగన్మోహన్ రెడ్డి 6 నుంచి 7లక్షల కోట్ల అప్పులు చేయడం ఖాయం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదికే జగన్ ప్రభుత్వ అప్పుల బండారాన్ని బయటపెట్టింది. అయినకాడికి అప్పులు చేసి.. జగన్ జైలుకుపోతే రాష్ట్రానికి దిక్కెవరు?’ అని ప్రశ్నించారు.