https://oktelugu.com/

Taliban Supports Cricket: తాలిబన్ల సంచలనం .. క్రికెట్ కు మద్దతు.. వరల్డ్ కప్ కు అప్ఘన్ జట్టు

Taliban Supports Cricket: శ్రీలంక, బంగ్లాదేశ్ లాంటి పెద్ద జట్లు సైతం ఈసారి వరల్డ్ కప్ టీ20కి నేరుగా అర్హత సాధించలేదు. కానీ ఉగ్రవాదంతో అట్టుడికే అప్ఘనిస్తాన్(Afghanistan) జట్టు నేరుగా సూపర్ 12లోకి అర్హత సాధించి ఔరా అనిపించింది. టీ20లో తిరుగులేని జట్టుగా అప్ఘనిస్తాన్ ఉంది. అయితే తాజాగా అప్ఘనిస్థాన్ దేశాన్ని తాలిబన్లు ఆక్రమించుకోవడంతో అక్కడ క్రికెట్ కు, క్రీడాకారులకు ఇక భవిష్యత్ పై ఆశ చచ్చిపోయింది. కరుడుగట్టిన తాలిబన్ల హయాంలో అప్ఘన్ క్రికెట్ ఇక ముగిసినట్టేనని […]

Written By: , Updated On : August 23, 2021 / 02:58 PM IST
Follow us on

Taliban Supports Cricket: శ్రీలంక, బంగ్లాదేశ్ లాంటి పెద్ద జట్లు సైతం ఈసారి వరల్డ్ కప్ టీ20కి నేరుగా అర్హత సాధించలేదు. కానీ ఉగ్రవాదంతో అట్టుడికే అప్ఘనిస్తాన్(Afghanistan) జట్టు నేరుగా సూపర్ 12లోకి అర్హత సాధించి ఔరా అనిపించింది. టీ20లో తిరుగులేని జట్టుగా అప్ఘనిస్తాన్ ఉంది. అయితే తాజాగా అప్ఘనిస్థాన్ దేశాన్ని తాలిబన్లు ఆక్రమించుకోవడంతో అక్కడ క్రికెట్ కు, క్రీడాకారులకు ఇక భవిష్యత్ పై ఆశ చచ్చిపోయింది. కరుడుగట్టిన తాలిబన్ల హయాంలో అప్ఘన్ క్రికెట్ ఇక ముగిసినట్టేనని అందరూ అనుకున్నారు. కానీ ఆశ్చర్యం.. తాలిబన్లు అప్ఘన్ క్రికెట్ భవిష్యత్ చూసి ఒప్పుకున్నారు. క్రికెట్ కు మద్దతు ప్రకటించారు.

అసలు ఎవరూ ఊహించని విధంగా తాలిబన్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాలిబన్లు క్రికెట్ కు మద్దతు పలికారు. అప్ఘన్ క్రికెట్ పెద్దలను చర్చలకు పిలవడం విశేషం. ఆదివారం తాలిబన్ నాయకుడు అనీస్ హక్కానీతో అప్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ, మాజీ క్రికెట్ బోర్డు అధికారులు అసదుల్లా, నూర్ అలీ జద్రాన్ లు సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా అప్ఘనిస్తాన్ త్వరలో ఆడబోయే క్రికెట్ సిరీస్ లు, విదేశీ పర్యటనల గురించి తాలిబన్లు అడిగి తెలుసుకున్నారు. అప్ఘన్ జట్టు నేరుగా వరల్డ్ కప్ నకు అర్హత సాధించడంపై హర్షం వ్యక్తం చేసిన తాలిబన్లు క్రికెట్ కు మద్దతు పలుకుతూ జట్టును యూఏఈలో జరిగే వరల్డ్ టీ20కి పంపడానికి ఓకేచెప్పారు.

అప్ఘనిస్తాన్ క్రికెట్ కెప్టెన్, క్రికెట్ బోర్డు పెద్దల మాటలను విన్న తాలిబన్ నాయకుడు ఆ దేశ క్రికెటర్లకు పూర్తి భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. క్రికెటర్లకు తాలిబన్లు పూర్తి పలుకుతున్నారని.. మీరు చెలరేగి దేశం కోసం ఆడి మంచి పేరు తీసుకురావాలని ఉత్సాహపరిచినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అప్ఘనిస్తాన్ పరిస్థితులు.. తాలిబన్ల చర్యలపై వ్యతిరేకత నెలకొంది. అందుకే వ్యతిరేకత తగ్గించడానికి అప్గన్ క్రికెటర్లకు తాలిబన్లు స్వేచ్ఛనిచ్చినట్టు తెలుస్తోంది. అప్ఘన్ క్రీడా ప్రతిభతో వరల్డ్ కప్ లో ఆడితే తాలిబన్లపై వ్యతిరేకత తగ్గుతుందని భావిస్తున్నారు.

ఈ క్రమంలోనే అప్ఘాన్ క్రికెటర్లకే కాకుండా అందరు క్రీడాకారులకు ఉన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని తాలిబన్ నాయకుడు హుక్కానీ భరోసానిచ్చారు. యూఏఈలో జరిగే వరల్డ్ కప్ కు పంపిస్తామని చెప్పడంతో అప్ఘన్ క్రికెట్ కు ప్రాణం పోసినట్టైంది.