Bihar: జడ ఉంటేనే కళాశాలలోకి అనుమతి.. సెల్ఫీలపై నిషేధం

బిహార్ లోని భాగల్ పూర్ లో ఉన్న సుందరావతి మహిళా మహా విద్యాలయం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. కళాశాల ఆవరణలో యువతులు పక్కాగా జడ వేసుకుని కనిపించాలని యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఈ ఏడాది ఇంటర్ లో చేరిన బాలికలకు ప్రత్యేక డ్రెస్ కోడ్ ను నిర్దేశించింది. దీనితో పాటు విద్యార్థినిలు కళాశాల ఆవరణలో సెల్ఫీలు తీసుకోవడం కూడా నిషేధించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అమ్మాయిలు లూజ్ హెయిర్ తో వస్తే వారిని కళాశాలలోకి […]

Written By: Suresh, Updated On : August 23, 2021 3:07 pm
Follow us on

బిహార్ లోని భాగల్ పూర్ లో ఉన్న సుందరావతి మహిళా మహా విద్యాలయం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. కళాశాల ఆవరణలో యువతులు పక్కాగా జడ వేసుకుని కనిపించాలని యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఈ ఏడాది ఇంటర్ లో చేరిన బాలికలకు ప్రత్యేక డ్రెస్ కోడ్ ను నిర్దేశించింది. దీనితో పాటు విద్యార్థినిలు కళాశాల ఆవరణలో సెల్ఫీలు తీసుకోవడం కూడా నిషేధించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అమ్మాయిలు లూజ్ హెయిర్ తో వస్తే వారిని కళాశాలలోకి అనుమతించబోమని ప్రిన్సిపాల్ ప్రొఫసర్ రామన్ సిన్హా తేల్చి చెప్పారు. కళాశాల కమిటీ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం వివాదాస్పదంగా మారుతోంది.