Taliban Government: తాలిబన్ ప్రభుత్వం: భారత్ కు దెబ్బ.. పాకిస్తాన్ కు వరం

Taliban Government: మొత్తానికి అప్ఘనిస్తాన్లో తాలిబన్లు అధికారంలో కూర్చున్నారు. నిన్న ప్రకటించిన పాలకవర్గంతో ఇక తాలిబన్లు దేశాన్ని పరిపాలించనున్నట్లు తెలుస్తోంది. అయితే పాలక వర్గంలో నియమించిన నాయకులతో ప్రపంచ దేశాల్లో కొత్త ఆందోళన మొదలైంది. ముఖ్యంగా తాలిబన్ల ప్రభుత్వంతో భారత్ కు ఎదురుదెబ్బలు తప్పేలా లేవని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. అప్ఘాన్ కు  ముల్లా మహమ్మద్ హసన్ అఖుండ్ ప్రధానమంత్రిగా ప్రకటించారు. ఉప ప్రధానికిగా ముల్లా బరాదర్ నియామకమయ్యారు. ఇక హోం మంత్రిగా సిరాజుద్దీన్ హక్కానీ నియమించారు. […]

Written By: NARESH, Updated On : September 9, 2021 10:01 am
Follow us on

Taliban Government: మొత్తానికి అప్ఘనిస్తాన్లో తాలిబన్లు అధికారంలో కూర్చున్నారు. నిన్న ప్రకటించిన పాలకవర్గంతో ఇక తాలిబన్లు దేశాన్ని పరిపాలించనున్నట్లు తెలుస్తోంది. అయితే పాలక వర్గంలో నియమించిన నాయకులతో ప్రపంచ దేశాల్లో కొత్త ఆందోళన మొదలైంది. ముఖ్యంగా తాలిబన్ల ప్రభుత్వంతో భారత్ కు ఎదురుదెబ్బలు తప్పేలా లేవని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. అప్ఘాన్ కు  ముల్లా మహమ్మద్ హసన్ అఖుండ్ ప్రధానమంత్రిగా ప్రకటించారు. ఉప ప్రధానికిగా ముల్లా బరాదర్ నియామకమయ్యారు. ఇక హోం మంత్రిగా సిరాజుద్దీన్ హక్కానీ నియమించారు. అయితే 2001లో బుద్ధుడి విగ్రహాలను ధ్వంసం చేయించింది… 2009-10ల మధ్య కాలంలో భారతీయుల సదుపాయాలపైనా దాడులు చేసింది హక్కానీయే. దీంతో ఇప్పుడు రాను రాను ఎలాంటి పరిణామాలకు దిగుతారోనని చర్చించుకుంటున్నారు.

ఈ సందర్భంగా భారత వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడు బ్రహ్మ చెలానీ కొన్ని విషయాలను ప్రస్తావిస్తూ ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ‘ఐక్యరాజ్యసమితి ఉగ్రవాదిగా గుర్తించిన వారిని తాలిబన్ ప్రభుత్వంలో చోటు కల్పించడంపై ఆందోళనకరమే. ముఖ్యంగా హోంమంత్రిగా కరుడుగట్టిన హక్కానీ నెట్ వర్క్ అధినేత సిరాజుద్దీన్ బాధ్యతలు తీసుకోబోతున్నాడు. దీంతో తాలిబన్ల పాత పాలనే మళ్లీ ప్రారంభం కానుంది’ అని పేర్కొన్నాడు.
సండే టైమ్స్ ఇంటర్నేషనల్ కరస్పాండెంట్ క్రిస్టీనా లాంబ్ ‘తాలిబన్ ప్రభుత్వంలో 33 మంది ముల్లాలు ఉన్నారు. వీరిలో నలుగురిపై అమెరికా ఆంక్షలు విధించింది. ఒక్క మహిళా కూడా కేబినెట్ లో లేదు. మరోవైపు ముల్లా ఒమర్ కుమారుడిని రక్షణ శాఖ మంత్రిగా చేశారు. తాలిబన్లు మారిపోయారని అన్నారు. ఇదే మార్పా..?’ అని ట్వీట్ చేశారు.

తాలిబన్ల కొత్త ప్రభుత్వంపై భారత్ కుఎదురుదెబ్బ ఉంటుందని ద ఇండియన్ ఎక్స్ ప్రెస్ పేర్కొంది. ‘తాలిబన్ కొత్త కేబినెట్లో కాందహార్ కు చెందిన తాలిబన్లు, హక్కానీ ఆధిపత్యం కనిపిస్తోంది. మొత్తం 33 మంది ఉన్న కేబినెట్లో 20 మంది వరకు కాందహార్ తాలిబన్లే ఉన్నారు.’ అని తెలిపింది. అయితే తాలిబన్ల పాలక వర్గంలో ఎక్కుగా ఆందోళన చెందాల్సిన విషయమేంటంటే హోంమంత్రిగా నియామకమైన సిరాజుద్దీన్ హక్కానీ గురింది. పాక్ గూఢాచార్య సంస్థ ఐఎస్ఐ నాయకుల్లో సిరాజుద్దీన్ ఒకరు. హక్కనీ నెట్ వర్క్ అధిపతి అయిన సిరాజుద్దీన్ పై 2008లో కాబుల్లోని భారత్ దౌత్య కార్యాలయంపై దాడికి కుట్ర పన్నినట్లు ఆరోపణులన్నాయి.

దీంతో రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలుంటాయోనన్న చర్చ జరుగుతోంది. సిరాజుద్దీన్ హోంమంత్రి మాత్రమే కాకుండా 34 ప్రావిన్స్ లకు కూడా గవర్నర్లను ఈయనే నియమిస్తాడు. అంటే ఇందులో ఐఎస్ఐకి కూడా పాత్ర ఉండబోతుంది. దీంతో భారత్ ఈ పరిణామాలను ఎలా ఎదుర్కొంటుందోనని అనుకుంటున్నారు. రహ్ బరి -షురాకు సిరాజుద్దీన్ 20 ఏళ్లుగా అధినేతగా పనిచేశాడు. అంతేకాకుండా ముల్లా హిబ్తుల్లా అఖుండ్ జుదాకు ఇతడు సన్నిహితుడు. గత తాలిబన్ల నాయకత్వంలో విదేశాంగ మంత్రిగా పనిచేశాడు.

ఇదిలా ఉండగా తాలిబన్ ఉప ప్రధాని ముల్లా బరాదర్ ను పాక్ 2010 లో కరాచీలో అరెస్టు చేసింది. అమెరికా సూచలనపై 2018లో బరాదర్ ను జైలు నుంచి విడుదల చేశారు. 2019లో ఖతార్ లో ఏర్పాటు చేసిన తాలిబన్ రాజకీయ కార్యాలయాల వ్యవహారాలను పర్యవేక్షించాడు. మార్చి 2020లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో ఫోన్లో మాట్లాడారు. కొత్త ప్రభుత్వాన్ని ముల్లా బరాదర్ నేతృత్వం వహిస్తారని అనుకున్నారు. కానీ ఆయనపై పాక్ కు నమ్మకం లేదు. దీంతో అధ్యక్షుడిగా ముల్లా మహమ్మద్ హసన్ అఖుండ్ నియమితులయ్యారు. 33 మంబది సభ్యులున్న కొత్త కేబినెట్లో కేవలం ముగ్గురు మాత్రమే పష్తోన్ యేతర నాయకులు ఉన్నారు. ఇక ఇరానల్ తరహానే తాలిబన్ కూడా ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందనే వార్తలు వస్తున్నాయి.