https://oktelugu.com/

శశికళ పొలిటికల్‌ రీ ఎంట్రీపై సస్పెన్స్‌..

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆప్తురాలు శశికళ. అక్రమాస్తుల కేసులో ఈ మధ్యే ఆమె జైలు నుంచి విడుదలయ్యారు. దీంతో ఆమె త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్‌ పెట్టారు. శశికళ విడుదలతో ఈసారి ఎన్నికలు కూడా రసవత్తరంగా మారనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో శశికళ ముఖ్య పాత్ర పోషిస్తారని.. ఎన్నికల్లో పోటీ చేస్తారని ఆమె అనుచరులు బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. అయితే.. శశికళ ప్రత్యక్ష ఎన్నికల్లో ఎంతవరకు పోటీకి అర్హురాలనే విషయం సందేహమే. Also Read: […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 2, 2021 / 01:08 PM IST
    Follow us on


    తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆప్తురాలు శశికళ. అక్రమాస్తుల కేసులో ఈ మధ్యే ఆమె జైలు నుంచి విడుదలయ్యారు. దీంతో ఆమె త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్‌ పెట్టారు. శశికళ విడుదలతో ఈసారి ఎన్నికలు కూడా రసవత్తరంగా మారనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో శశికళ ముఖ్య పాత్ర పోషిస్తారని.. ఎన్నికల్లో పోటీ చేస్తారని ఆమె అనుచరులు బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. అయితే.. శశికళ ప్రత్యక్ష ఎన్నికల్లో ఎంతవరకు పోటీకి అర్హురాలనే విషయం సందేహమే.

    Also Read: అన్నాడీఎంకేకు ఆమే కాబోయే లీడర్

    1988 అవినీతి నిరోధక చట్టం ప్రకారం ఆర్థిక నేరంపై జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి ఆరేళ్ల వరకూ ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతికి పాల్పడ్డారన్న కారణంగా నాలుగేళ్లు జైలు జీవితం గడిపిన శశికళ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. సెక్షన్8(1) మేరకు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడడం.. అత్యాచారం చేయడం.. మహిళల పట్ల క్రూరంగా వ్యవహరించడం.. రెండు సమూహాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించడం.. వంటి నేరాల విషయంలో ఒక వ్యక్తికి న్యాయస్థానం జరిమానా విధించినట్టయితే వారు శిక్షార్హమైన తేదీ నుంచి 6 సంవత్సరాలపాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులే.

    Also Read: నార్త్‌ వర్సెస్‌ సౌత్‌.. : దక్షిణాది ఉద్యమం తప్పదా

    అక్రమాస్తుల కేసును విచారించిన బెంగుళూరు ట్రయల్ కోర్టు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 109 (ఒక నేరానికి పాల్పడడం) 120-బి (క్రిమినల్ కుట్ర) 13 (1)(ఇ) సెక్షన్ల ప్రకారం 1998 పీసీ యాక్ట్ లోని 13(డి) ప్రకారం ప్రభుత్వోద్యోగి ద్వారా అక్రమార్జన చేయడం తదితరాలకు సంబంధించి ఆమెను దోషిగా తేల్చింది. ట్రయల్ కోర్టు జడ్జి జాన్ మైకేల్ కున్హా ఆమెకు నాలుగేళ్ల జైలుశిక్ష రూ.10 కోట్లా 10 వేల జరిమానా విధిస్తూ 2014 సెప్టెంబరు 27వ తేదీన తీర్పు ఇచ్చారు. 2017 ఫిబ్రవరి 14వ తేదీన ఆ తీర్పును సుప్రీంకోర్టు ఖరారు చేసింది. దీంతో ఆ మరునాడే శశికళ జైలుకెళ్లారు.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

    ఇటీవల కరోనా నుంచి కోలుకోవడం.. జైలు శిక్ష కూడా ముగియడంతో శశికళ పొలిటికల్‌ రీఎంట్రీకి సిద్ధమవుతున్నారు. బెంగళూరులోని ఓ ఫాం హౌస్ వేదికగా సిద్ధమవుతున్నారు. టీటీవీ దినకరన్ సోమవారం బెంగళూరులోని ఓ ఫాం హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటున్న శశికళతో భేటీ అయి సుదీర్ఘంగా చర్చించారు. ఈ వారం రోజుల్లో శశికళ రాజకీయంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశమున్నట్లు తెలిసింది. ఈనెల 7 లేదా 8 తేదీల్లో చెన్నై చేరాక.. దీనిపై తగిన నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. ఈసీ నుంచి మినహాయింపు వస్తే ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనే పోటీ చేయాలని శశికళ భావిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.