ఇలా అయితే ఆ పథకం లక్ష్యం దెబ్బతిన్నట్లే..: జగన్‌ సారూ స్పందించండి మీరు

  తాము ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలన్నీ లబ్ధిదారుల ఇంటికి చేర్చడమే లక్ష్యమని జగన్‌ అధికారంలోకి రాకముందు ప్రకటించారు. ఆ ప్రకటనకు అనుకూలంగానే జగన్ అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ.. లబ్ధిదారులకు డోర్‌‌ టు డోర్‌‌ అందిస్తున్నారు. అయితే.. ఇటీవల ఇంటింటికే వచ్చి రేషన్‌ సరుకులు అందించేందుకు కొత్త పథకానికి రూపకల్పన చేశారు జగన్‌మోహన్‌రెడ్డి. దీంతో లబ్ధిదారులు ఎవరూ రేషన్‌ షాపుల ముందు క్యూలో ఉండాల్సిన అక్కర్లేదని.. ఇంటికే రేషన్‌ వస్తుందని ఎంతో ఆర్భాటంగా ప్రకటించేశారు. […]

Written By: Srinivas, Updated On : February 2, 2021 12:57 pm
Follow us on

 


తాము ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలన్నీ లబ్ధిదారుల ఇంటికి చేర్చడమే లక్ష్యమని జగన్‌ అధికారంలోకి రాకముందు ప్రకటించారు. ఆ ప్రకటనకు అనుకూలంగానే జగన్ అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ.. లబ్ధిదారులకు డోర్‌‌ టు డోర్‌‌ అందిస్తున్నారు. అయితే.. ఇటీవల ఇంటింటికే వచ్చి రేషన్‌ సరుకులు అందించేందుకు కొత్త పథకానికి రూపకల్పన చేశారు జగన్‌మోహన్‌రెడ్డి. దీంతో లబ్ధిదారులు ఎవరూ రేషన్‌ షాపుల ముందు క్యూలో ఉండాల్సిన అక్కర్లేదని.. ఇంటికే రేషన్‌ వస్తుందని ఎంతో ఆర్భాటంగా ప్రకటించేశారు. ఇందుకోసం ఆటోలను సైతం కొనుగోలు చేశారు.

Also Read: బరి తెగిస్తున్న టీడీపీ నేతలు.. ఎదురు తిరుగుతున్న ప్రజలు

ప్రభుత్వం అట్టహాసంగా దాదాపు రూ.వెయ్యి కోట్లు వెచ్చించారు. అయితే.. దీని లక్ష్యం బాగానే ఉన్నప్పటికీ సంక్షేమ రథాలు ఇంటింటికీ రేషన్ అందించడంలో బాలారిష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఫిబ్రవరి ఒకటో తేదీ అంటే నిన్నటి నుంచి ఈ పథకం ప్రారంభమైంది. గ్రామాల్లో ఇంకా ప్రారంభంకాలేదు. పట్టణాల్లో మాత్రం స్టార్ట్‌ చేశారు. అయితే.. పట్టణాల్లో ఈ సంక్షేమ రథాలు బియ్యం తీసుకుని సైరన్ మోగించుకుంటూ ఓ వీధిలోకి వెళ్తాయి. అందరూ అక్కడికే వచ్చి రేషన్ తీసుకుంటున్నారు. దీంతో ఆ వాహనాల దగ్గర క్యూ లైన్లు కనిపించాయి. ఇంటింటికీ ఇచ్చుకుంటూ పోతే ఆలస్యం అవుతుందని.. వాహనాల దగ్గరకే లబ్ధిదారులు స్వచ్ఛదంగా తరలి రాగా మరికొన్ని చోట్ల వాహనదారులే పిలుచుకొచ్చి ఇచ్చారు.

Also Read: నిమ్మగడ్డకు హైకోర్టు చెక్

ఇంటింటికీ వెళ్లి రేషన్‌ ఇవ్వాలనే ఉద్దేశంతోనే జగన్‌ ఈ పథకాన్ని ప్రారంభించారు. కానీ.. ఇలా ఒక పాయింట్‌ చూసుకొని అక్కడ బండి పెట్టడం.. అక్కడికే వచ్చి లబ్ధిదారులు రేషన్‌ తీసుకోవాలంటే పథకం లక్ష్యం దెబ్బతింటుంది. అయితే.. కొన్ని చోట్ల వాహనాదారులు ఇంటికి వెళ్లి ఇచ్చే ప్రయత్నం చేశారు. కొన్నిచోట్ల చేశారు కూడా. అదే పద్ధతిని అంతటా కొనసాగిస్తే బాగుంటుందని లబ్ధిదారుల కోరిక. అయితే.. వాహనాలు పట్టని కాలనీలు పట్టణాల్లో కొన్ని ఉంటాయి. కొండ ప్రాంతంలా ఉన్న కాలనీలు ఉన్నాయి. అలాంటి చోట్ల.. వాలంటీర్లు వెళ్లి ఇచ్చి రావాల్సి ఉంది. కానీ.. ఆ బాధ తమకెందుకని కొంత మంది లబ్ధిదారుల్నే కిందకు పిలుస్తున్నారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

మరోవైపు.. ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉంది. దీని కారణంగా గ్రామాల్లో ఇంటింటికీ రేషన్ పంపిణీ ప్రారంభం కాలేదు. అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టం. ఒకవేళ వాహనదారులు.. తమకెందుకు కష్టం అని ఓ పాయింట్‌లో బండిని నిలబెట్టి.. అందర్నీ అక్కడికే వచ్చి తీసుకోవాలని చెబితే మొదటికే మోసం. ఎందుకంటే.. రేషన్ దుకాణాలు అంతకుముందు కూడా సమీపంలోనే ఉండేవి. ఎప్పుడు వీలుంటే అప్పుడు తీసుకునే చాన్స్ ఉండేది. కానీ ఇప్పుడు.. రేషన్ దుకాణాల్లో ఇవ్వరు. బండి ఎప్పుడొస్తుందో చెప్పడం కష్టమన్నట్లుగా పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సర్కార్‌‌ ఏ లక్ష్యంతో అయితే ఈ స్కీమ్‌ను ప్రారంభించిందో అదే క్రమంలో నడిపిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.