2014లో ఏపీలో చంద్రబాబు.. తెలంగాణలో కేసీఆర్ సీఎంలుగా ఉండేటప్పుడు.. ప్రతీసారి కేసీఆర్ కొత్త పథకం ప్రవేశపెట్టడం.. దాన్ని చంద్రబాబు పేరు మార్చేసి కాపీ కొట్టి అమలు చేయడం జరిగేది. కానీ ఇప్పుడు 2019లో జగన్ సీఎం అయ్యాక.. ఆయన పథకాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయి. అదే క్రమంలో పారదర్శకతో ప్రజలకు చేరువ అవుతున్నాయి. జగన్ పథకాలనే కేసీఆర్ అమలు చేయాల్సిన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.
Also Read: అమరావతి విషయంలో జగన్ కు చుక్కెదురు..! షాకిచ్చిన సుప్రీం
ఇప్పుడు తెలుగురాష్ట్రాల్లో అత్యంత అవినీతిమయమైనది ఏదంటే ఖచ్చితంగా రెవెన్యూ శాఖే. ఆ శాఖలో కిందినుంచి పైదాకా అన్ని వ్యవహారాల్లోనూ తడపనిదే ఏపని కాదు.. ఇటీవలే ఓ భూకొనుగోల్ మాల్ లో కీసర తహసీల్దార్ ఏకంగా రూ.1.10 కోట్లు లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కవ్వడం సంచలనమైంది. ఈ క్రమంలోనే రెవెన్యూశాఖలో మరో విప్లవాత్మక నిర్ణయంతో అవినీతికి అడ్డుకట్ట వేసి సంచలనం సృష్టించారు సీఎం జగన్.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాజాగా మరోసారి సంచలన నిర్ణయాలు, పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వార్తల్లో నిలిచారు. ఇక ఏపీలో ఇప్పటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియలను వీడియోలో నమోదు చేయాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్లలో పెద్ద ఎత్తున అవినీతిని అరికట్టడానికి ఇలా వీడియోలు తీసి పారదర్శకత పెంచడం.. దాంతోపాటు ప్రజలకు లంచాలు ఇవ్వకుండా అడ్డుకోవడం ప్రధాన ధ్యేయంగా ఈ వ్యవస్థను తీసుకొచ్చారు.
రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో వీడియో తీసే పైలెట్ ప్రాజెక్టును ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 20 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేయనున్నారు. ఆ తర్వాత రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు విస్తరిస్తారు.
Also Read: జగన్ దగ్గరకు సీక్రెట్ లిస్ట్..! వణికిపోతున్నారు
ఈ మేరకు వీడియో రికార్డింగ్ సదుపాయంతోపాటు ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం రెవెన్యూశాఖ అధికారులను ఆదేశించింది. ఈ నిర్ణయం ఏపీలో రెవెన్యూశాఖలో అవినీతిని అరికడుతుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు..
-ఎన్నం