https://oktelugu.com/

కరోనా ఎఫెక్ట్.. ఇంటికే గణేశుడు పరిమితం..!

అందరు అనుకున్నట్లేగానే.. కరోనా ఎఫెక్ట్ గణేశ్ ఉత్సవాలపై పడింది. దీంతో ప్రతియేటా ఘనంగా జరిగే నవరాత్రి ఉత్సవాలను ఈసారి ఇంటికే పరిమితం కానున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా విజృంభణ కారణంగా అనేక పండుగలు కళతప్పాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఘనంగా నిర్వహించే శ్రీరామ నవమి, ఉగాది, రంజాన్ పండుగలు కళతప్పిపోయాయి. ఇక భాగ్యనగరానికే వన్నెతెచ్చే బోనాల పండుగ కూడా కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన సంగతి తెల్సిందే. Also Read: తెలంగాణకు కేంద్రం భారీ నిధులు.. అయినా టెస్టులు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 17, 2020 / 05:29 PM IST
    Follow us on


    అందరు అనుకున్నట్లేగానే.. కరోనా ఎఫెక్ట్ గణేశ్ ఉత్సవాలపై పడింది. దీంతో ప్రతియేటా ఘనంగా జరిగే నవరాత్రి ఉత్సవాలను ఈసారి ఇంటికే పరిమితం కానున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా విజృంభణ కారణంగా అనేక పండుగలు కళతప్పాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఘనంగా నిర్వహించే శ్రీరామ నవమి, ఉగాది, రంజాన్ పండుగలు కళతప్పిపోయాయి. ఇక భాగ్యనగరానికే వన్నెతెచ్చే బోనాల పండుగ కూడా కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన సంగతి తెల్సిందే.

    Also Read: తెలంగాణకు కేంద్రం భారీ నిధులు.. అయినా టెస్టులు తక్కువే?

    తాజాగా వినాయక చవితి ఉత్సవాలను కూడా ఇంటికే పరిమితం కానున్నాయి. ఈమేరకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వినాయక ఉత్సవాలపై క్లారిటీ ఇచ్చారు. సోమవారం మాసాబ్ ట్యాంకులోని తన కార్యాలయంలో హోంమంత్రి మహమూద్ అలీ సమక్షంలో హైదరాబాదు, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్లు అంజనీ కుమార్, సజ్జనార్, మహేష్ భగవత్, మహానగర పాలక సంస్థ కమిషనర్ లోకేష్ కుమార్, భాగ్యనగర ఉత్సవ కమిటీ నిర్వహాకులు తదితరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయక చవితి ఉత్సవాలపై మంత్రి తలసాని క్లారిటీ ఇచ్చారు.

    రాష్ట్రంలో కరోనా విపత్కర పరిస్థితులు నెలకొన్న కారణంగా గణేష్ ఉత్సవాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని చెప్పారు. ఈసారి గణేష్ ఉత్సవాలను ప్రజలకు ఇళ్లల్లోనే శాస్త్రోకత్తంగా నిర్వహించుకోవాలని సూచించారు. కరోనా పరిస్థితులు ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ప్రభుత్వం తరుఫున దేవాదాయ శాఖ పరిధిలోని అన్ని ఆలయాల్లో గణేష్ ఉత్సవాలు నిర్వహించాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. నవరాత్రులు పూర్తయ్యే వరకు వినాయక విగ్రహాలను పూజలు నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

    Also Read: ఓవైపు కరోనా.. మరోవైపు వానలు.. దేనికి సంకేతం?

    ఈ నేపథ్యంలో భాగ్యనగరంలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగే గణేష్ ఉత్సవాలు ఈసారి కళతప్పనున్నాయి. నిమజ్జనం రోజున గణనాథులను ఆటపాటలతో గంగమ్మ ఒడికి చేర్చడం ఆనవాయితీగా వస్తోంది. గణేష్ ఉత్సవాలకు సంబంధించి హైదరాబాద్‌ పోలీసులు కూడా ప్రజలకు పలు సూచనలు చేశారు. వినాయక చవితి వేడుకలు, మొహరం ఒకేసారి వస్తున్నాయని తెలిపారు.ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రద్దీ ప్రదేశాల్లో వినాయక విగ్రహాలు పెట్టడానికి అనుమతులు లేవన్నారు.

    ప్రజలు ఇళ్లలోనే వినాయక విగ్రహాలను పెట్టి పూజలు చేసుకోవాలని సూచించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ మీరు.. మీ కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలని ఆయన ట్వీటర్లో ట్వీట్ చేశారు. అయితే అందరి విఘ్నాలను దూరంచేసే విఘ్నరాజుకే కరోనా విఘ్నం ఏర్పడటం శోచనీయాంగా మారిందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.