చర్చలు మళ్లీ అసంపూర్ణం.. రైతుల ఆందోళనలు యథాతథం..!

కేంద్రప్రభుత్వం వ్యవసాయంలో సంస్కరణలు తెస్తూ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం దళారులు లేకుండా రైతులు తమ ఇష్టం వచ్చిన వారికి తమ పంటను అమ్ముకోవచ్చు. అయితే ధర విషయంలో మాత్రం కొనుగోలు దారులదే పైచేయి ఉంటుంది. వారు నిర్ణయించిన ధరకే రైతులు తమ ధాన్యాన్ని అమ్మాలి. ఈ విషయంలో ప్రభుత్వ జోక్యం ఉండదు. ఇందుకు సంబంధించిన బిల్లును పార్లమెంట్, ఆ తరువాత రాజ్యసభలో ప్రవేశపెట్టిన మోడీ ప్రభుత్వం ఆ తరువాత చట్టాన్ని చేసింది. అయితే […]

Written By: NARESH, Updated On : December 9, 2020 8:42 pm
Follow us on

కేంద్రప్రభుత్వం వ్యవసాయంలో సంస్కరణలు తెస్తూ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం దళారులు లేకుండా రైతులు తమ ఇష్టం వచ్చిన వారికి తమ పంటను అమ్ముకోవచ్చు. అయితే ధర విషయంలో మాత్రం కొనుగోలు దారులదే పైచేయి ఉంటుంది. వారు నిర్ణయించిన ధరకే రైతులు తమ ధాన్యాన్ని అమ్మాలి. ఈ విషయంలో ప్రభుత్వ జోక్యం ఉండదు. ఇందుకు సంబంధించిన బిల్లును పార్లమెంట్, ఆ తరువాత రాజ్యసభలో ప్రవేశపెట్టిన మోడీ ప్రభుత్వం ఆ తరువాత చట్టాన్ని చేసింది. అయితే ఈ నిర్ణయంపై ముందుగా పంజాబ్ రైతులు ఆందోళన మొదలు పెట్టారు. ఆ తరువాత హర్యానా అటు నుంచి ఉత్తప్రదేశ్ అలా దేశ వ్యాప్తంగా రైతులు కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టారు.

Also Read: కొత్త వ్యవసాయ చట్టాల్లో మార్పులకు కేంద్రం సుముఖం?

14 రోజులుగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రైతులు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఆందోళన చేపడుతున్నారు. కేంద్రం వీరి ఆందోళనలకు దిగి వచ్చి వారితో చర్చలు జరుపుతోంది. అయితే ప్రభుత్వం, రైతులు ఎవరి పట్టులో వారే ఉండడంతో పరిష్కారం దొరకడం లేదు. ఇప్పటి వరకు ఆరు రౌండ్లుగా చర్చలు జరిపిన కేంద్రం ఎట్టి పరిస్థితిలో వ్యవసాయ చట్టాన్ని వెనక్కి తీసుకునేది లేదని చెబుతోంది. మరోవైపు రైతులు వ్యవసాయ చట్టాన్ని వెనక్కి తీసుకోవడం తప్ప ఇతర సంస్కరణలకు ఒప్పుకోమంటున్నారు.

ఈ నేపథ్యంలో మంగళవారం దేశవ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చారు. ఈ బంద్ కు దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లోని రైతులు , ప్రతిపక్షాల నాయకులు మద్దతు పలికారు. అయితే బంద్ కార్యక్రమాన్ని గమనించిన కేంద్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. బుధవారం జరగాల్సిన చర్చలను ఒకరోజు ముందుకు జరిపి నిన్న సాయంత్రమే రైతులు చర్చలకు పిలిచింది. దీంతో ప్రభుత్వం దిగి వచ్చిందని అనుకున్నారే. కానీ ఆ చర్చలు కూడా అసంపూర్ణంగానే మిగిలాయి.

Also Read: వరద సాయం కొనసాగుతుంది.. బాధితులు అధైర్య పడొద్దు: జీహెచ్ఎంసీ

నిన్న జరిగిన చర్చల్లోనూ వ్యవసాయ చట్టంపై ఏమాత్రం వెనుకడుగు వేయమని అమిత్ షా తెగేసి చెప్పడంతో తాము కూడా ఆందోళనలు తగ్గించమని రైతులు స్పష్టం చేశారు. అయితే చట్టంలో కొన్ని మార్పులు తీసుకొస్తామని, అవి లిఖిత పూర్వకంగా హామీ ఇస్తామని చెప్పారు. కానీ వాటికి రైతులు ఒప్పుకోవడం లేదు. దీంతో తాము పండించే పంటకు తాము ధరను నిర్ణయించుకునే హక్కు లేదా..? అంటూ విమర్శిస్తున్నారు. అయితే చివరికి ఈ ఆందోళనలు ఎక్కడికి దారి తీస్తాయో చూడాలి..

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్