ఆ తల్లుల ఖాతాల్లోకి రూ.6,673 కోట్లు

వైఎస్‌ జగన్‌ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా జగన్‌ రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరిగేలా నవరత్నాలను అమల్లోకి తెచ్చారు. ఇందులో భాగంగా అమ్మ ఒడి పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ స్కీమ్‌ ప్రకారం ఏపీలోని స్కూలు, కాలేజీలకు వెళ్తున్న ప్రతీ విద్యార్థికి రూ.10 వేలు జమ చేయనున్నారు. అయితే.. ఇప్పటికే ఒకవిడత అమలు చేసిన సర్కార్‌‌.. ఇప్పుడు రెండో విడత డబ్బులను వేయనున్నారు. Also Read: ప్రభుత్వాన్ని వదిలి.. మేఘా గూటికి.. […]

Written By: Srinivas, Updated On : January 11, 2021 2:12 pm
Follow us on


వైఎస్‌ జగన్‌ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా జగన్‌ రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరిగేలా నవరత్నాలను అమల్లోకి తెచ్చారు. ఇందులో భాగంగా అమ్మ ఒడి పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ స్కీమ్‌ ప్రకారం ఏపీలోని స్కూలు, కాలేజీలకు వెళ్తున్న ప్రతీ విద్యార్థికి రూ.10 వేలు జమ చేయనున్నారు. అయితే.. ఇప్పటికే ఒకవిడత అమలు చేసిన సర్కార్‌‌.. ఇప్పుడు రెండో విడత డబ్బులను వేయనున్నారు.

Also Read: ప్రభుత్వాన్ని వదిలి.. మేఘా గూటికి..

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పథకం రెండో విడత డబ్బులను మీటనొక్కి నెల్లూరులో ప్రారంభిస్తారు. గతేడాది 75 శాతం హాజరు నిబంధనల పెట్టారు. ఈ సారి కరోనా కారణంగా నిబంధనలకు మినహాయింపు ఇచ్చారు. కుటుంబ ఆదాయ పరిమితి గతంలో గ్రామీణ ప్రాంతంలో నెలకు రూ.5 వేలు మాత్రమే ఉండేది. ఈ సారి దాన్ని పదివేలకు పెంచారు. మరికొన్ని సడలింపులు కూడా ఇచ్చారు. గతేడాది చాలా మంది అర్హులకు ఇవ్వలేదన్న విమర్శలు రావడంతో లబ్ధిదారుల సంఖ్య పెంచారు. ఈ ఏడాది అమ్మఒడి ద్వారా 44 లక్షల 48 వేల 865 మంది తల్లులకు నగదు బదిలీ చేస్తున్నారు. ఒక్క సారి మీట నొక్కడం ద్వారా సీఎం జగన్ తల్లుల ఖాతాల్లోకి రూ.6,673 కోట్లు జమ కానున్నాయి.

Also Read: పవన్‌ బాగానే పరిణతి సాధించారే..! : అందుకే బీజేపీని ఇన్‌వాల్వ్‌ చేయడం లేదా..?

కరోనా నేపథ్యంలో పోయిన ఏడాది విద్యావ్యవస్థ అస్తవ్యస్తం అయింది. కొంత తగ్గుముఖం పట్టాక నవంబర్‌ 2వ తేదీ నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. 9,10 తరగతులకు నవంబర్‌ 23 నుంచి.. 7, 8 తరగతులకు డిసెంబర్‌ 14 నుంచి తరగతులు మొదలయ్యాయి. జనవరి 18 నుంచి ఆరో తరగతి విద్యార్థులకు తరగతుల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. అప్పటి పరిస్థితులను బట్టి ఒకటో తరగతి నుంచి 5 వరకు తరగతుల నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. మొత్తంగా గతేడాది జనవరి 9న దాదాపు 43 లక్షల మంది తల్లుల ఖాతాల్లో సుమారు రూ.6336.45 కోట్లు జమ చేశారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

పిల్లల ఉజ్వల భవిష్యత్తే ధ్యేయంగా జగన్‌ సర్కార్‌‌ విద్యారంగంపై భారీగా ఖర్చు పెడుతోంది. రెండేళ్లకు కలిపి అమ్మఒడికి రూ,13,023 కోట్లు, విద్యా దీవెనకు రూ.4,101 కోట్లు, వసతి దీవెనకు రూ.1,220.99 కోట్లు ఖర్చు చేసినట్లుగా ప్రభుత్వం చెప్పింది. ఇక విద్యా కానుక, గోరు ముద్దు, నాడు-నేడు వంటి వాటికి ఇంకా భారీగా ఖర్చు పెడుతోంది. 12 నెలల కాలంలో మొత్తంగా 1,87,95,804 మంది లబ్ధిదారులకు రూ.24,560 కోట్లు ఖర్చు చేసినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. విద్యారంగంలో పెట్టుబడిని.. నగదు బదిలీని ప్రభుత్వం సంక్షేమంగా మాత్రమే చూడకుండా.. మానవ వనరులపై పెట్టుబడిగా చూస్తోంది.