ఏపీలోని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై నిరసనలు కొనసాగుతున్నాయి. ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల నాయకులతో పాటు ప్రతిపక్ష పార్టీలు ఉవ్వెత్తున ఉద్యం చేస్తున్నాయి. అధికార వైసీపీ సైతం ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ప్రకటించింది. ఈ సందర్భంగా పొరుగు తెలుగు రాష్ట్రమైన తెలంగాణ నుంచి కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకునేందుకు మద్దతు వస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై ఆసక్తి వ్యాఖ్యలు చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా చేస్తున్న ఉద్యమానికి తమ మద్దతు తెలుపుతున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. అవసరమైతే కేసీఆర్ అనుమతి తీసుకొని విశాఖ వెళ్లి ఆందోళన చేస్తామన్నారు. తెలంగాణలోని బయ్యారంలో సెయిల్ ద్వారా ఉక్కు కర్మాగారంలో వేలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న విశాఖ ఉక్కును వంద శాతం అమ్మేయడం దారుణమన్నారు.
విశాఖ ఉక్కు కర్మాగారంపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోతున్నారని అన్నారు. ఎక్కడో విశాఖలో జరిగే ఉద్యమం మనకెందుకులే అనుకుంటే రేపు మన దగ్గరకు వస్తారు.. ఇవాళ విశాఖ ఉక్కును అమ్ముతున్నారు.. రేపు బీహెచ్ఎల్ ను అమ్ముతారు అనికేటీఆర్ విమర్శించారు. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ప్రైవేట్ పరం చేయండి.. అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమం రోజురోజుకు తీవ్ర మవుతోంది. ఎక్కడికక్కడ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ప్రధాన రహదారుల దిగ్బంధించడంతో రవాణా స్తంభించింది. స్టీల్ ప్లాంట్ పరిపాలన భవనాలను చుట్టుముట్టారు,