మన దేశంలో నివశించే ప్రజలకు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లా రేషన్ కార్డ్ కూడా అవసరమనే సంగతి తెలిసిందే. ఎవరైతే రేషన్ కార్డ్ ను కలిగి ఉంటారో వాళ్లు సబ్సిడీ ధరలకే రేషన్ సరుకులను పొందవచ్చు. దేశంలో తక్కువ ఆదాయం కలిగిన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఉంటుంది. రేషన్ కార్డ్ ఉంటే మాత్రమే పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు పొందడానికి అర్హత సాధించవచ్చు అయితే రేషన్ కార్డ్ ఉన్నవాళ్లు కొన్ని తప్పులు మాత్రం అస్సలు చేయకూడదు.
Also Read: ఎస్బీఐ కస్టమర్లకు బంపర్ ఆఫర్.. డబ్బులు లేకున్నా విత్ డ్రా..?
రేషన్ కార్డును కలిగి ఉన్నవాళ్లు కుటుంబ సభ్యులలో ఎవరైనా మరణిస్తే వెంటనే అధికారులను సంప్రదించి పేరును రేషన్ కార్డ్ నుంచి తొలగించుకోవాలి. అలా చేయకుండా రేషన్ సరుకులను పొందితే మాత్రం ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. కార్డులో ఇతరుల పేర్లను వినియోగించుకున్నా లేదా చనిపోయిన వారి పేర్లతో రేషన్ సరుకులు పొందినా అధికారులు అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు పోలీస్ కేసు నమోదయ్యే అవకాశాలు ఉంటాయి.
Also Read: ఈ తప్పులు చేస్తున్నారా.. గ్యాస్ సిలిండర్ పేలిపోయే ఛాన్స్..?
రేషన్ కార్డ్ విషయంలో అక్రమాలకు పాల్పడిన వారిపై ఫుడ్ సప్లై డిపార్ట్‌మెంట్ కూడా చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. తప్పుడు ధృవపత్రాలను ఉపయోగించి రేషన్ కార్డును పొందితే గరిష్టంగా ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తెలుస్తోంది. కోర్టు జైలుశిక్షతో పాటు భారీ మొత్తంలో జరిమానా విధిస్తుంది. అందువల్ల అర్హత లేకపోతే రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోకూడదు.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
రేషన్ కార్డు దరఖాస్తు సమయంలో సమాచారం తప్పుగా ఇచ్చినా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. రేషన్ కార్డు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునే వాళ్లు సైతం దరఖాస్తు చేసుకునే సమయంలో అర్హత ఉందో లేదో తెలుసుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు పడకుండా జాగ్రత్త పడవచ్చు.