ఏపీలో పెరుగుతున్న పోలింగ్‌ శాతం.. ఓటు వేసిన ప్రముఖులు

ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల్లో భారీ ఎత్తున పోలింగ్ నమోదవుతోంది. పట్టణాలు, నగరాల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఓటేసేందుకు జనం సాధారణ ఎన్నికల తరహాలో పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లోనూ భారీగా పోలింగ్‌ శాతమే నమోదవుతోంది. ఎన్నికల సంఘం కూడా పోలింగ్ శాతం పెంచేందుకు విస్తృత ఏర్పాట్లు చేసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. ఆరంభంలో కాస్త మందకొడిగా కనిపించినా 10 గంటల తర్వాత వేగం పుంజుకుంది. ఉదయం 11 గంటల వరకూ […]

Written By: Srinivas, Updated On : March 11, 2021 1:21 pm
Follow us on


ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల్లో భారీ ఎత్తున పోలింగ్ నమోదవుతోంది. పట్టణాలు, నగరాల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఓటేసేందుకు జనం సాధారణ ఎన్నికల తరహాలో పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లోనూ భారీగా పోలింగ్‌ శాతమే నమోదవుతోంది. ఎన్నికల సంఘం కూడా పోలింగ్ శాతం పెంచేందుకు విస్తృత ఏర్పాట్లు చేసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. ఆరంభంలో కాస్త మందకొడిగా కనిపించినా 10 గంటల తర్వాత వేగం పుంజుకుంది. ఉదయం 11 గంటల వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 32 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

Also Read: బెంగాల్ లోనూ అదే సీన్ : ఏపీ పరిస్థితి రిపీట్ అవుతుందా..?

ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఉదయం మందకొడిగా కనిపించిన పోలింగ్ ఆ తర్వాత జోరందుకుంది. కోస్తా జిల్లాల్లోనూ భారీ ఎత్తున ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చారు. దీంతో ఇక్కడ భారీ ఎత్తున పోలింగ్‌ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయవాడలో రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్ దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మచిలీపట్నంలో మంత్రి పేర్నినాని కుటుంబంతో కలిసి వెళ్లి ఓటు వేశారు. విజయవాడలో టీడీపీ మేయర్‌ అభ్యర్ధి కేశినేని శ్వేత, వంగవీటి రాధా, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దంపతులతో పాటు పలువురు ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో ఉన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడం చాలా ముఖ్యమని, ప్రతీ పౌరుడూ ఓటు హక్కు వినియోగించుకోవాలని గవర్నర్ హరిచందన్ సూచించారు. సమాజంలో మార్పు రావాలంటే ఓటు వినియోగం తప్పనిసరి అన్నారు. రాష్ట్ర ప్రథమ పౌరుడిగా బాధ్యతతో తన ఓటు హక్కు వినియోగించుకున్నానని హరిచందన్‌ తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా నగరపాలక, పురపాలక ఎన్నికల పోలింగ్‌ ఇంకా కొనసాగుతూనే ఉంది. మధ్యాహ్నం 1 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 42.84 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాల వారీగా నమోదైన పోలింగ్‌ వివరాలను ఒకసారి పరిశీలిస్తే శ్రీకాకుళం 44.38 శాతం, విజయనగరం 45.10, విశాఖ 36.75, తూర్పుగోదావరి 53.08, పశ్చిమగోదావరి 45.51, కృష్ణా 41.49, గుంటూరు 44.69, ప్రకాశం 53.19, నెల్లూరు 48.89, చిత్తూరు 41.28, అనంతపురం 45.42, కడప 46.02, కర్నూలు 40.99 చొప్పున నమోదైంది.

Also Read: హిందూ నినాదం.. కవితకు వర్కౌట్ అవుతుందా..?

ఇక మధ్యాహ్నం మూడు గంటలకు మొత్తంగా పోలింగ్‌ శాతం చూస్తే 53.57 శాతం నమోదైంది. శ్రీకాకుళం జిల్లాలో 59.93, విజయనగరం 56.63, విశాఖ 47.86, తూర్పుగోదావరి 66.21, పశ్చిమగోదావరి 53.68, కృష్ణా 52.87, గుంటూరు 54.42, ప్రకాశం 64.31, నెల్లూరు 61.03, అనంతపురం 56.90, కర్నూలు 48.87, కడప 56.63, చిత్తూరు 54.12 శాతం చొప్పున నమోదైంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్