Srinivas Gowda Murder Plan: తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు జరిగిన కుట్రను పోలీసులు ఛేదించారు. మహబూబ్ నగర్ కు చెందిన కొందరు సుపారీ గ్యాంగ్ తో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఆయన సోదరుడు శ్రీకాంత్ గౌడ్ లను హత్య చేయించేందుకు కుట్ర పన్నారు.

ఈ క్రమంలోనే మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు సంబంధించి ఫరూక్ అనే వ్యక్తికి సుపారీ ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఫరూక్ పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మంత్రి హత్యకు కుట్ర పన్నిన విషయం వెలుగుచూసింది. ఘటనకు సంబంధించి పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
Also Read: Amaravati : ఏపీ రాజధానిగా అమరావతి.. గుర్తిస్తూ కేంద్రం సంచలన నిర్ణయం
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వారు. హైదరాబాద్ శివారు నుంచి మహబూబ్ నగర్ వరకూ ఇప్పుడు రియల్ భూమ్ నడుస్తోంది. ఈక్రమంలోనే రియల్ మాఫియానే తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హత్యకు ప్లాన్ చేసినట్టుగా మీడియాలో ప్రచారం సాగుతోంది.
ఇక పాత కక్షల కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. మంత్రి హత్యకే కుట్ర పన్నారంటే వీళ్లు ఎవరు? ఎందుకు చంపాలనుకున్నారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పూర్తి విచారణ తర్వాత పోలీసులు అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించనున్నారు.
Also Read: KCR vs BJP: దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్.. కేసీఆర్‌కు పెద్ద ఆయుధం దొరికిందిగా..!
Recommended Video:
[…] Also Read: తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యక… […]