https://oktelugu.com/

Brother Anil Kumar- YS Jagan: బామ్మర్ధి జగన్ ను గెలిపించడానికి బరిలోకి బావ బ్రదర్ అనిల్!

Brother Anil Kumar- YS Jagan: ఏపీలో సాధారణ ఎన్నికలు రావడానికి ఇంకా రెండేళ్ల సమయం ఉంది. కానీ ఇప్పటి నుంచే అధికార వైసీపీ కొత్త స్కెచ్ వేసింది. తిరిగి అధికారంలోకి రావడానికి వైఎస్ఆర్ ఫార్ములాను అనురిస్తున్నట్లుగా తెలుస్తున్నది. మరోసారి ఏపీలో తన బామ్మర్ధిని తిరిగి అధికారంలోకి తీసుకు రావడానికి బావ బ్రదర్ అనిల్ కుమార్ ను రంగంలోకి దించినట్లు తెలుస్తున్నది. ఇబ్బడి ముబ్బడి హామీలతో 2019లో ఏపీలో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి […]

Written By:
  • Admin
  • , Updated On : March 9, 2022 / 01:34 PM IST
    Follow us on

    Brother Anil Kumar- YS Jagan: ఏపీలో సాధారణ ఎన్నికలు రావడానికి ఇంకా రెండేళ్ల సమయం ఉంది. కానీ ఇప్పటి నుంచే అధికార వైసీపీ కొత్త స్కెచ్ వేసింది. తిరిగి అధికారంలోకి రావడానికి వైఎస్ఆర్ ఫార్ములాను అనురిస్తున్నట్లుగా తెలుస్తున్నది. మరోసారి ఏపీలో తన బామ్మర్ధిని తిరిగి అధికారంలోకి తీసుకు రావడానికి బావ బ్రదర్ అనిల్ కుమార్ ను రంగంలోకి దించినట్లు తెలుస్తున్నది. ఇబ్బడి ముబ్బడి హామీలతో 2019లో ఏపీలో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనాపరంగా తప్పటడుగులు వేశాడు. నష్ట నివారణ పనిలో పడ్డాడు. మూడు రాజధానులు, రాజధాని మార్పు విషయంలో కోర్టుల్లో వ్యతిరేకత, వలంటీర్లు, పార్టీ నాయకుల ఆగడాలు, మద్యం, ఇతర నిత్యావసరాల ధరల పెంపు, సినిమా టికెట్ల ధరల తగ్గింపు, పీఆర్సీ పెంపులో అన్యాయం జరిగిందంటూ ఉద్యోగుల నుంచి వ్యతిరేకత. ఇలా ఒక దాని తర్వాత ఒకటి వ్యతిరేకత పెరుగుతూ పోతుంది. దీనిని నివారించడానికి సీఎం వైస్ జగన్ తండ్రి బాటలోనే పయనిస్తున్నట్లుగా అర్థమవుతుంది.

    Brother Anil Kumar- YS Jagan

    నిజంగా ప్రాధాన్యం దక్కలేదనేనా ?

    కొద్ది రోజులుగా ఏపీ సీఎం జగన్ రెడ్డి బావ, క్రైస్తవ తమ ప్రచారకుడు బ్రదర్ అనిల్ కుమార్ ఆంధ్రప్రదేశ్ లో పర్యటనలు చూస్తుంటే కొంత ఆశ్చర్యం కలగక మానదు. ఆయన ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చలు జరగుతున్నాయి. గత ఎన్నికల్లో జగన్ విజయానికి కృషి చేసిన వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్ ఈసారి ఎదురు తిరిగే అవకాశం ఉందనే చర్చ సాగుతున్నది. ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న జగన్ తనను పట్టించుకోవడం లేదని ఆగ్రహించి తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ పెట్టారని ప్రచారం జరిగింది. ఏపీలోనూ తన అన్న జగన్ ను దెబ్బతీయడానికి షర్మిల ప్రయత్నిస్తున్నారనే ప్రచారం లో ఎంత వరకూ నిజమనేది నమ్మశక్యంగా లేదు. తెలంగాణలో వైసీపీ నేతలు ఎవరూ చేరకుండా అన్న మనుషులే అడ్డుకుంటున్నారని ఆమె సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నట్లు ఎక్స్ పోజ్ చేస్తున్నారని రాజకీయ పరిశీలకుల భావన. షర్మిల నేరుగా రంగంలోకి దిగకుండా తన భర్త బ్రదర్ అనిల్ కుమార్ ను రంగంలోకి దించుతున్నదని నమ్మించే ప్రయత్నం చేస్తున్నట్లు పలువురు భావిస్తున్నారు. తెలంగాణలో 2018 లో వైసీపీ పోటీలోనే లేదు. ఆ పార్టీ మెజార్టీ క్యాడరంతా టీఆర్ఎస్ లోనే చేరింది. ఉన్నది కూడా రెడ్డి సామాజిక వర్గమే. ప్రస్తుతం షర్మిల పార్టీలో చేరింది కూడా వైసీపీలో పని చేసిన వారే ఉన్నారు. ఈ పరిణామాలను బట్టి చూస్తే చెల్లె షర్మిలను జగన్ రాజకీయంగా అడ్డకుంటున్నాడనేది ఎంత వరకు వాస్తవం. ఆస్తి పంపకాలో, లేదో రాజకీయ ప్రాధాన్యం ఇవ్వకపోవడమనేది నిజమే అయితే ముందుగా ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటారు కదా. ఒకవేళ ఇంట్లో చర్చలు జరిపినా జగన్ వినకుంటు షర్మిల ఏపీలోనే పార్టీ పెట్టేది. అసలు తెలంగాణలో వైసీపీ ఉనికి లేని సమయంలో ఎందుకు మారుతుందనే సందేహాలు ఇప్పటికే వ్యక్తమయ్యాయి. ప్రాధాన్యం దక్కలేదనే విషయంపైనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

    వ్యతిరేకతను చీల్చడానికే..?

     

    brother anil kumar undavalli

    మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఉండవల్లి అరుణ్ కుమార్ ను బ్రదర్ అనిల్ కుమార్ కలవడం రాజకీయ కారణాలేనని చెప్పవచ్చు. ఏపీలో జగన్ పాలనపై విమర్శలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ, జనసేన పార్టీలు వైసీపీ పాలనపై విరుచుకుపడుతున్నాయి. బీజేపీ తో జగన్ కు పెద్ద గా నష్టమేమీ లేదు. ఆ పార్టీ ప్రభావం చూపే స్థితిలోనూ లేదు. పైగా కేంద్రంలోని బీజేపీ తో జగన్ అనుకూలంగానే ఉంటున్నారు. ఇక కాంగ్రెస్ ఉనికి చాటుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ ఇలాగే ముందుకు సాగితే రాజకీయంగా వైసీపీకి గడ్డు పరిస్థితులు తప్పకపోవచ్చు. టీడీపీకి బలమైన అనుకూల మీడియా ఉన్నది. రాబోయే ఎన్నికల వరకు జనసేన అధినేత, సినీ నటుడు పవర్ స్టార్ వపన్ కల్యాణ్ టీడీపీ తో జట్టుకడితే అధికార వియోగం తప్పదు. ఈ సంకేతాలు జగన్ ముందుగానే పసిగట్టినట్లుగా ఉన్నాడు.
    అందుకే తన బావ బ్రదర్ అనిల్ కుమార్ ను ముందు పెట్టి గేమ్ స్టార్ట్ చేశాడు. ముందుగా తన తండ్రికి అత్యంత సన్నిహితుడైన ఉండవల్లితో భేటి వేయించాడు. అంతటితో ఆగకుండా బీసీ, మైనార్టీ వర్గాల్లోని అసంతృప్తులతో
    కలిసే ప్లాన్ వేస్తున్నాడు. ఆయా వర్గాలతో గత ఎన్నికల్లో అనిల్ మంతనాలు చేసి జగన్ కు అండగా నిలవడంలో సక్సెస్ అయ్యాడు. ప్రస్తుత పరిణామాలను బట్టి ఏపీలో కొత్త పార్టీ పెడుతాడో పెట్టడో ఇప్పుడే చెప్పలేమని పలువురు పేర్కొంటున్నారు.

    వైఎస్సార్ ఫార్ములా ?

    CM Jagan

    జగన్ కూడా తండ్రి వైఎస్ఆర్ ను అనుసరిస్తున్నట్లు అవగతమవుతున్నది. టీడీపీ మళ్లీ బలపడితే అధికారం కోల్పోవడం ఖాయమని జగన్ భావించినట్లు అర్థమవుతున్నది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీలోని తన వ్యతిరేకులకు చెక్ పెట్టాడు. తన కంటే సీనియర్లను కూడా పక్కకు నెట్టేశాడు. 2004 ఎన్నికల్లో పలు చోట్ల సీనియర్లకు చెక్ పెట్టేందుకు మరో వర్గాన్ని ఏర్పాటు చేశాడని, ఆ పార్టీ నాయకులు చెబుతుంటారు. తెలంగాణలోని సీనియర్లకు చెక్ పెట్టేందుకు టీఆర్ఎస్ తో పొత్తు కుదిరేలా మాస్టర్ ప్లాన్ వేశాడని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అలాగే 2009 ఎన్నికల్లో వ్యతిరేకతను చీల్చేందుకు, టీడీపీని నిలువరించేందుకు ఏపీలో మెగాస్టార్ చిరంజీవితో ప్రజారాజ్యం పార్టీని పెట్టించాడని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. చిరంజీవి ప్రజారాజ్యం ప్రభావం టీడీపీ కి వ్యతిరేకంగా మారింది. టీడీపీ బీసీ ఓటు బ్యాంకును చిరంజీవి చీల్చేశాడు. అలాగే తెలంగాణలో టీఆర్ఎస్, టీడీపీ పొత్తుకూ వైఎస్సారే కారణమని పేర్కొంటున్నారు. 2009 ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ కి కేటాయించిన సీట్లలోనూ టీఆర్ఎస్ అభ్యర్థులను నిలబెట్టింది. దీంతో టీడీపీ, టీఆర్ఎస్ కొట్లాటతో కాంగ్రెస్కు లాభం చేకూరింది. పొత్తు ధర్మాన్ని టీఆర్ఎస్ విస్మరించిందని, టీడీపీ అధినేత చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇప్పడు జగన్ కూడా అదే ఫాలో అవుతున్నాడని పలువురు పేర్కొంటున్నారు. ప్రస్తుతం జగన్ బీజేపీతో పొత్తు లేకున్నా సఖ్యతగానే ఉంటున్నాడు. ఏపీకి ప్రత్యేక హోదాపై ఇప్పటి వరకు కేంద్రంతో చర్చించడం లేదు. జగన్ క్రిస్టియన్. బీజేపీతో సఖ్యతగా ఉంటున్నాడనే కారణంతో మైనార్టీ ఓట్లు టీడీపీ కి టర్న్ అయితే అధికారం కోల్పోవడం ఖాయం. దీంతో బావ అనిల్ ను ముందు పెట్టి పాలనపై ఉన్న వ్యతిరేకతను చీల్చడానికి జగన్ ఇప్పటికే ఆట మొదలు పెట్టాడని భావించవచ్చు. వ్యతిరేకత చీలితే తాను తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని జగన్ భావిస్తున్నాడని చెప్పవచ్చు. ముందు ముందు ఇంకెన్ని మార్పులు ఉంటాయో ఇప్పడే చెప్పలేం.

    Tags