Monsoon 2022: వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. ఈ ఏడాది తొలకరి తొందరగానే పలకరించనుంది. దీంతో ప్రజలకు ఉపశమనం లభించనుంది. ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనానికి నిజంగానే సాంత్వన కల్పించే వార్త. రుతుపవనాల ఆగమనం ఈ సంవత్సరం ముందే రానున్నట్లు తెలుస్తోంది. వాతావరణ శాఖ అధికారుల సూచనల ప్రకారం అసని తుఫాను ఏర్పడటంతో ఆకాశం సాదారణంగా మేఘావృతంగా ఉంటోందని చెబుతున్నారు. చాలా ప్రాంతాల్లో వేసవి వేడి తగ్గి చల్లగానే ఉంటున్నట్లు పేర్కొన్నారు.
భారత వాతావరణ కేంద్రం, విశాఖ వాతావరణ కేంద్రం సంయుక్తంగా వెల్లడించిన వివరాలు నైరుతి రుతుపవనాల రాక ఈసార ముందే ఉంటున్నట్లు చెబుతున్నాయి. దీని ప్రభావంతో ఎండలు తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తోంది. సోమవారం నాటికి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రాన్ని ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ వెల్లడిస్తోంది.
Also Read: Rashmika Mandanna: పెళ్లి ఫోటోలు పోస్ట్ చేసిన రష్మిక.. లుక్ అదిరింది
బంగాళాఖాతం నుంచి ఈశాన్య భారతంపైకి బలమైన తేమగాలులు వీస్తున్నాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. బీహార్, నుంచి చత్తీస్ గడ్, తెలంగాణ, కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే 24 గంటల్లో రాయలసీమ, కోస్తాలో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచిస్తోంది. వచ్చే ఐదు రోజుల్లో కేరళ, లక్ష్యద్వీప్ లలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు.
తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుంది. కానీ అక్కడక్కడ వర్షాలు పడతాయని తెలుస్తోంది. మొత్తానికి ఈ సారి ఏపీకి వాతావరణ శాఖ తీపి కబురు చెబుతోంది. రాష్ట్రంలోకి రుతుపవనాలు ముందే ప్రవేశించి వర్షాలు కురుస్తాయని చెప్పడం గమనార్హం. మొత్తానికి వర్షాలు ముందే వస్తాయనే ఆశతో రైతులు ఉన్నారు.పంటలు పండించుకునేందుకు అనువైన వాతావరణం ఉంటుందని మర్షం వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ శాఖ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది.
Also Read:Pranitha Subhash Seemantham: పసుపు పచ్చని చీరలో బాపు బొమ్మకు సీమంతం
Recommended Videos: