Rashmika Mandanna: క్రేజీ హీరోయిన్ ‘రష్మిక మందన్నా’ పెళ్లి టాపిక్ ఈ మధ్య బాగా వైరల్ అయ్యింది. అయితే, తాజాగా రష్మిక ఓ పెళ్లి గురించి చేసిన మెసేజ్ అండ్ పిక్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. పెళ్లి రష్మికది కాదు లేండి. రష్మిక చిన్ననాటి స్నేహితురాలి రాగిని పెళ్లి. ఈ పెళ్లి గురించే రష్మిక ఇన్‌స్టాగ్రామ్ లో ఒక మెసేజ్ పెడుతూ ఫ్రెండ్స్ తో దిగిన ఫోటోలను కూడా పోస్ట్ చేసింది.
రష్మిక మాటల్లోనే.. ‘నా బెస్ట్ ఫ్రెండ్ రాగిని పెళ్లి. నేను పెళ్లి కోసం రెడీ అయ్యి వెయిట్ చేస్తున్న సమయంలో.. నా ఫ్లైట్ క్యాన్సిల్ అని తెలిసింది. దాంతో నేను ఈ పెళ్లికి హాజరు కాలేనేమో అని భయపడ్డాను. కానీ దేవుని దయ వల్ల నా ఫ్రెండ్ పెళ్లికి రాగలిగాను. ‘ఈ ఫోటోలో మీకు కనిపిస్తున్న గ్యాంగ్ లోనే నేను పెరిగాను. ఇప్పటికీ వీళ్లలో ఏ మార్పు లేదు. వీళ్లంతా నా వాళ్లు. నటిగా ఈ ప్రపంచానికి పరిచయం కాకముందు నేను ఇలాగే ఉండేదాన్న’ అంటూ రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
Also Read: Pranitha Subhash Seemantham: పసుపు పచ్చని చీరలో బాపు బొమ్మకు సీమంతం
ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రష్మిక వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. పైగా ఆమెకు మంచి విజయాలు కూడా వస్తున్నాయి. దాంతో అమ్మడు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. పైగా ఈ ఏడాది ఇప్పటివరకు ‘రష్మిక మందన్నా’ మరో తెలుగు సినిమా ఒప్పుకోలేదు. ఎన్టీఆర్ సినిమాలో ఆమె నటించే ఛాన్స్ ఉంది.
ఇక ఆ మధ్య రష్మిక మందన్నా కూడా పెళ్లి చేసుకోబోతుంది అంటూ గాసిప్ రాయుళ్లు పుకార్లు పుట్టించారు. దాంతో ఈ బ్యూటీ తన పెళ్లి గురించి తన మనసులో మాటను బయట పెడుతూ అందరికీ క్లారిటీ ఇచ్చింది. తనకు 30 ఏళ్ళు దాటిన తర్వాతే పెళ్లి చేసుకుంటాను అంటూ రష్మిక మందన్నా చెప్పుకొచ్చింది.
రష్మిక మందన్నాకి ప్రస్తుతానికి 25 ఏళ్ళు. అంటే రష్మిక మందన్నా లెక్క ప్రకారం ఇంకో ఐదేళ్ల తర్వాత ఆమె తన పెళ్లి గురించి ఆలోచిస్తుంది అన్నమాట. ఏది ఏమైనా రష్మిక మందన్నా వ్యక్తిత్వం చిన్న పిల్లలా ఉంటుందని టాక్ ఉంది.
Also Read:Vijay Devarakonda- Samantha: నిజంగానే విజయ్ దేవరకొండ – సమంత ఆకట్టుకున్నారు !
Recommended Videos: