Homeఎంటర్టైన్మెంట్Ormax Stars Survey: సర్వే షాకింగ్: టాలీవుడ్ నంబర్ 1 స్టార్ హీరో ఇతడే?

Ormax Stars Survey: సర్వే షాకింగ్: టాలీవుడ్ నంబర్ 1 స్టార్ హీరో ఇతడే?

Ormax Stars Survey: టాలీవుడ్ లో నంబర్ 1 హీరో ఎవరంటే అందరూ పెద్దలు, మెగాస్టార్ చిరంజీవి అంటారు. కానీ సర్వేలో మాత్రం చిరంజీవి ఎక్కడో ఉన్నారు. అథ: పాతాళంలో ఆయన ర్యాంక్ ఉంది. ప్రేక్షకుల దృష్టిలో టాలీవుడ్ నంబర్ 1 హీరో స్థానం అనూహ్యంగా ఆ అద్భుత నటుడికి దక్కడం విశేషం. ఆర్మాక్స్ మీడియా ప్రతీనెల సర్వే నిర్వహించి ఆ ఫలితాలను వెల్లడిస్తుంటుంది. ఈ క్రమంలోనే ఏప్రిల్ నెల ఫలితాలు విడుదల చేసింది. అవిప్పుడు షాకింగ్ గా ఉన్నాయి.

ఏప్రిల్ నెల సర్వేలో టాలీవుడ్ నంబర్ 1 హీరోగా జూనియర్ ఎన్టీఆర్ నిలవడం సంచలనమైంది. ఆర్ఆర్ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం.. ఆ సినిమాలో ఎన్టీఆర్ నటనకు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడడంతో యంగ్ టైగర్ ఈ జాబితాలో నంబర్ 1 స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో తారక్ తొలి స్థానంలో నిలిస్తే.. రెండో స్థానంలో స్టార్ హీరో ప్రభాస్ ఉన్నారు. రాధేశ్యామ్ ఫ్లాప్ అయినా కూడా ప్రభాస్ పై ప్రేోకుల ప్రేమ మాత్రం తగ్గలేదు.

పుష్పతో దేశవ్యాప్తంగా షేక్ చేసిన అల్లు అర్జున్ ఈ జాబితాలో మూడో స్థానంలో నిలవడం విశేషం. ఇక ఆర్ఆర్ఆర్ లో మరో హీరోగా నటించిన రాంచరణ్ నాలుగో స్థానంలో నిలిచారు.

ఇక సర్కారువారి పాట సినిమాతో మరో హిట్ ను సొంతం చేసుకున్న మహేష్ బాబు ఐదో స్తానంలో నిలవగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆరో స్థానంలో ఉన్నారు.

ఇక నేచురల్ స్టార్ ఏడోస్థానంలో నిలిచారు. ఏడాదికి రెండు మూడు సినిమాలను విడుదల చేస్తూ నాని జోరుగా ముందుకెళుతున్నారు. బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంటారు.

ఇక లైగర్ సినిమాతో ప్రేక్షకులను అరలించేందుకు సిద్ధమవుతున్న విజయ్ దేవరకొండ 8వ స్థానంలో ఉన్నారు. చిరంజీవి కూడా ఈ జాబితాలో 9వ స్థానంలో ఉండడం విశేషం. మెగాస్టార్ గా ఇండస్ట్రీ పెద్దగా ఉన్నా కూడా చిరంజీవి మాత్రం ప్రేక్షకుల దృష్టిలో 9వ స్థానానికే పరిమితం కావడం గమనార్హం. ఇక మాస్ మహరాజ్ రవితేజ ఈ జాబితాలో 10వ స్థానంలో నిలవడం విశేషం.

Recommended Videos
SVP నెగటివ్ టాక్ తో కూడా రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ |SVP Set New Records |Oktelugu Entertainment
మళ్లీ గీతగోవిందం కాంబినేషన్.. ఈ సారి ట్రిపుల్ ధమాకా || Vijay Deverakonda ||Director Parasuram
మహేష్ బాబు మాస్ స్టెప్పులు | Mahesh Babu Mass Steps on Stage At Kurnool | SVP Success Meet

 

 

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version