కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై ఢిల్లీ వేదికగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా వీరికి మద్దతు వెల్లువెత్తుతోంది. ఈ క్రమంలోనే బీజేపీ కూడా ఇటు నుంచి నరుక్కురావడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. సాగు చట్టాలకు అవగాహన కల్పించేలా బీజేపీ సదస్సులను దేశవ్యాప్తంగా నిర్వహిస్తోంది. ఏపీలోనూ ఈరోజు గుంటూరు జిల్లా పెద్దవడ్లపూడిలో బీజేపీ రైతు సాధికారిక సదస్సు నిర్వహించారు.
Also Read: వైసీపీ, బీజేపీలు టీడీపీని టార్గెట్ చేశాయట..
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఎంపీ జీవీఎల్ హాజరై మాట్లాడారు. రైతులకు మేలుచేసేలా కేంద్రం కొత్త వ్యవసాయ చట్టాలు తెచ్చిందని తెలిపారు.
ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై విపక్షాలు అందరినీ మభ్యపెడుతున్నాయని విమర్శించారు. కొత్త చట్టాల విషయంలో రైతులు ఐదు అంశాలపై ఉద్యమిస్తున్నారని చెప్పారు. పంటలకు కనీస మద్దతు ధర కొనసాగుతుందన్నారు. వ్యవసాయ మార్కెట్లు మూతపడుతాయనే ప్రచారం వట్టి అపోహ మాత్రమేనన్నారు.
Also Read: ప్రగతి భవన్ ముట్టడి.. ఉద్రిక్తం..!
రైతుల భూములకు ఎలాంటి ఇబ్బంది ఉండదని సోము వీర్రాజు అన్నారు. రైతులకు నిర్ధేశించిన ధరను గడువులోగా చెల్లించకపోతే జరిమానా విధిస్తామని సోము వీర్రాజు చట్టం గురించి అవగాహన కల్పించారు. ఒప్పంద వ్యవసాయ విధానంతో రైతులకు మేలు జరుగుతుందని.. ఇది చాలా రాష్ట్రాల్లో ఉందని గుర్తు చేశారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్