ఢిల్లీలోని ఆందోళనలకు.. ఏపీ రైతుల ఆర్థిక సాయం..!

కేంద్ర ప్రభుత్వం ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో వ్యవసాయ సంస్కరణ పేరిట మూడు కొత్త చట్టాలను తీసుకొచ్చింది. ఈ చట్టాలు వల్ల రైతులకు ప్రయోజనం కలుగుతుందని కేంద్రం చెబుతోంది. అయితే ఈ చట్టాల వల్ల తమకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని రైతులు కొద్దిరోజులుగా ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్నారు. Also Read: బ్రేకింగ్: రజినీకాంత్ గురించి కీలక అప్ డేట్ గడిచిన నెలరోజులుగా ఢిల్లీలో వణికించే చలిలోనూ రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. కొత్త వ్యవసాయ చట్టాలను […]

Written By: Neelambaram, Updated On : December 27, 2020 7:16 pm
Follow us on

కేంద్ర ప్రభుత్వం ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో వ్యవసాయ సంస్కరణ పేరిట మూడు కొత్త చట్టాలను తీసుకొచ్చింది. ఈ చట్టాలు వల్ల రైతులకు ప్రయోజనం కలుగుతుందని కేంద్రం చెబుతోంది. అయితే ఈ చట్టాల వల్ల తమకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని రైతులు కొద్దిరోజులుగా ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్నారు.

Also Read: బ్రేకింగ్: రజినీకాంత్ గురించి కీలక అప్ డేట్

గడిచిన నెలరోజులుగా ఢిల్లీలో వణికించే చలిలోనూ రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వీరికి వివిధ రాజకీయాల పార్టీలతోపాటు దేశంలోని ప్రముఖులుగా వ్యక్తిగతంగా సంఘీభావం తెలుపుతున్నారు. మరికొందరు రైతులకు ఆర్థిక సాయం చేస్తున్నారు.

కొద్దిరోజుల క్రితం ప్రముఖ సింగర్ దిల్జిజ్ దోసంజ్ రైతు ఉద్యమానికి మద్దతు ప్రకటించడమే కాకుండా కోటి విరాళం ప్రకటించారు. చలిలో రైతులు రోడ్లపై చేస్తున్న నిరసనకు ఆయన చలించిపోయారు. రైతులందరికీ దుప్పట్లు.. స్వైటర్లు అందించేందుకు దిల్జిజ్ దోసంజ్ కోటి విరాళం ప్రకటించారు. కేంద్రంపై రైతులు శాంతియుతంగా పోరాటం సాగించి సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.

Also Read: జమిలిపై బీజేపీ దూకుడు

తాజాగా ఢిల్లీ రైతుల ఆందోళనలకు ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి సంఘీభావం తెలుపడంతోపాటు రూ.10లక్షల ఆర్థికసాయం ప్రకటించింది. ‘ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి’ సమన్వయకర్త వడ్డే శోభనాద్రీశ్వరరావు నేతృత్వంలో ఏపీకి చెందిన 12 రైతు సంఘాల ప్రతినిధుల బృందం ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనకు మద్దతు తెలిపింది.

ఈమేరకు అఖిల భారత కిసాన్ సభ జనరల్ సెక్రటేరీ హన్నన్ మోల్లాకు రూ.5లక్షలు.. అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి కోకన్వీనర్ దర్శన పాల్ కు మరో రూ. 5లక్షల ఆర్థికసాయాన్ని ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు అందించారు. మొత్తం రూ.10లక్షల సాయాన్ని ఏపీ రైతులు అందించి రైతులకు మద్దతు తెలుపడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్