https://oktelugu.com/

ప్రభాస్ కోసం దర్శకుడితో పూజ హెగ్డే గొడవ !

రెబల్ స్టార్ ప్రభాస్ సరసన ‘రాధే శ్యామ్’లో టాల్ బ్యూటీ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. సినిమా మొదలైన దగ్గర నుండి పూజాకి ప్రభాస్ అంటే తెగ ఇష్టం ఏర్పడిందట. అందుకే, షూటింగ్ అయిపోయ్యే కొద్దీ పూజా తెగ ఫీల్ అవుతుందట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకొంది. ఇక రెండు రోజులు మాత్రమే ‘ప్రభాస్ – పూజా’ కాంబినేషన్ లో సీన్స్ షూట్ ఉంది. అందుకే, ఈ సినిమా కోసం తాను […]

Written By:
  • admin
  • , Updated On : December 27, 2020 / 05:23 PM IST
    Follow us on


    రెబల్ స్టార్ ప్రభాస్ సరసన ‘రాధే శ్యామ్’లో టాల్ బ్యూటీ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. సినిమా మొదలైన దగ్గర నుండి పూజాకి ప్రభాస్ అంటే తెగ ఇష్టం ఏర్పడిందట. అందుకే, షూటింగ్ అయిపోయ్యే కొద్దీ పూజా తెగ ఫీల్ అవుతుందట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకొంది. ఇక రెండు రోజులు మాత్రమే ‘ప్రభాస్ – పూజా’ కాంబినేషన్ లో సీన్స్ షూట్ ఉంది. అందుకే, ఈ సినిమా కోసం తాను నటిస్తోన్న ఓ బాలీవుడ్ మూవీ షూటింగ్ మధ్యలో నుండి వచ్చేసి మరీ, ప్రభాస్ కోసం రెండు రోజుల డేట్స్ కేటాయించిందట పూజా.

    Also Read:  ‘మారుతి – రవితేజ’ సినిమాకి క్రేజీ టైటిల్ !

    నిజానికి, హీరోయిన్లు బాలీవుడ్ సినిమాల పేర్లు చెప్పి, తెలుగు సినిమాలకు డేట్స్ ఇచ్చేందుకు నిర్మాతలను ఇబ్బంది పెడుతూ.. తెగ ఫోజు కొడుతూ ఉంటారు. కానీ పూజ హెగ్డే మాత్రం వరుస బాలీవుడ్ సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్నా.. ప్రభాస్ సినిమాకే మొదటి ప్రాధ్యాన్యం ఇస్తూ.. ఏకంగా బాలీవుడ్ మేకర్స్ కే హ్యాండ్ ఇస్తూ మొత్తానికి బెస్ట్ హీరోయిన్ అనిపించుకుంటుంది. అయితే ప్రభాస్ సినిమాకి డేట్స్ కేటాయించడానికి పూజా ఓ బాలీవుడ్ సినిమా దర్శకుడితో కూడా గొడవ పడిందట. ప్రభాస్ “రాధే శ్యామ్” కోసం ఇటీవల ఆమె బాలీవుడ్ దర్శక, నిర్మాత రోహిత్ శెట్టి వద్దకు వెళ్లి… తన డేట్స్ ని మార్చాలని అడిగిందని.. కానీ రోహిత్ శెట్టి అందుకు అంగీకరించలేదని సమాచారం.

    Also Read: నాగార్జునపై మండిపడ్డ కామ్రేడ్‌

    రణవీర్ సింగ్ హీరోగా రోహిత్ శెట్టి “సర్కస్” అనే సినిమా తీస్తున్నాడు. పూజ హెగ్డే ఇందులో హీరోయిన్. అయితే తనకు “రాధే శ్యామ్” షూటింగ్ ఉందని… తనకు సంబందించిన పోర్షన్ ని తర్వాత తీయండి అని రోహిత్ తో చిన్నపాటి గొడవ కూడా పడిందట పూజా. కానీ రోహిత్ శెట్టి సినిమా షూట్ అవ్వకపోయినా పూజ మాత్రం ప్రభాస్ సినిమా కోసం హైదరాబాద్ వచ్చేసి షూట్ లో పాల్గొంది. ఏది ఏమైనా పూజ హెగ్డే ప్రభాస్ సినిమా కోసం బాలీవుడ్ దర్శకుడినే కాదనుకుంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    Tags