https://oktelugu.com/

ఆ ఆరు పదవులూ వైసీపీవే..

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ రిలీజ్‌ అయింది. అక్కడి ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నోటిఫికేషన్‌ ఇచ్చారు. దీంతో ఈ ఆరు ఎమ్మెల్సీ సీట్లు వైసీపీ ఖాతాలోనే పడనున్నాయి. ఫిబ్రవరి 25న నోటిఫికేషన్‌ విడుదల అవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నామినేషన్ల దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 4. మార్చి 15న పోలింగ్‌ జరుగుతుంది. Also Read: సీఎం కేసీఆర్ సంచలనం.. భూముల డిజిటల్ సర్వేకు ఆదేశం అయితే.. ఇవన్నీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలే […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 19, 2021 / 10:24 AM IST
    Follow us on


    ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ రిలీజ్‌ అయింది. అక్కడి ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నోటిఫికేషన్‌ ఇచ్చారు. దీంతో ఈ ఆరు ఎమ్మెల్సీ సీట్లు వైసీపీ ఖాతాలోనే పడనున్నాయి. ఫిబ్రవరి 25న నోటిఫికేషన్‌ విడుదల అవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నామినేషన్ల దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 4. మార్చి 15న పోలింగ్‌ జరుగుతుంది.

    Also Read: సీఎం కేసీఆర్ సంచలనం.. భూముల డిజిటల్ సర్వేకు ఆదేశం

    అయితే.. ఇవన్నీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలే కావడంతో వైసీపీ క్లీన్‌ స్వీప్‌ చేయనుంది. ఒక్కో ఎమ్మెల్సీ గెలుచుకోవడానికి 29 మంది ఎమ్మెల్యేలు కావాలి. టీడీపీకి 20 మంది ఎమ్మెల్యేల బలం కూడా లేదు. దీంతో పోటీ చేసే చాన్స్ ఎలాగూ లేదు. ఖాళీ అవుతున్న ఆరు స్థానాల్లో గుమ్మడి సంధ్యారాణి, గుండుమల తిప్పేస్వామి, వీవీవీ చౌదరి టీడీపీ ఎమ్మెల్సీలు. మహ్మద్‌ ఇక్బాల్‌, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, చల్లా రామకృష్ణారెడ్డి వైసీపీ ఎమ్మెల్సీలు.

    సంధ్యారాణి, తిప్పేస్వామి, వీవీవీ చౌదరి, మహ్మద్‌ ఇక్బాల్‌ పదవీ కాలం పూర్తయింది. పిల్లి సుభాష్‌ రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే.. పదవి కాలం తక్కువగా ఉండటంతో.. ఇప్పుడు పూర్తయ్యాక ఎన్నికలు పెడుతున్నారు. చల్లా రామకృష్ణారెడ్డి కరోనాతో ఇటీవల మృతిచెందారు. రాజ్యసభకు ఎన్నికయిన మరో ఎమ్మెల్సీ మోపిదేవి స్థానాన్ని గతంలోనే భర్తీ చేశారు. నిజానికి వైసీపీ అధినేత జగన్ శాసనమండలిని రద్దు చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఈ మేరకు తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు.

    Also Read: నటుడు మోహన్ బాబుకు షాకిచ్చిన టీఆర్ఎస్ సర్కార్

    మరో ఏడాదిలో మండలిలో పూర్తి స్థాయిలో వైసీపీకి బలం వస్తుందని తెలిసినా .. అసలు మండలి అవసరం లేదని అందుకే రద్దు చేస్తున్నామని శాసనసభలో ప్రకటించారు. కానీ.. ఇప్పుడు.. యూటర్న్ తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఖాళీ అవుతున్న ప్రతీ ఎమ్మెల్సీని తమ పార్టీ నేతలతో భర్తీ చేస్తున్నారు. దీంతో శాసనమండలి రద్దు కాదన్న ప్రచారం ఊపందుకుంది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్