హైదరాబాద్ సిటీకి మరో అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. భారతదేశంలోనే అత్యధికంగా చెట్లు ఉన్న మహానగరంలో హైదరాబాద్ నిలిచింది. ఈ విషయాన్ని ఆర్బర్ డే ఫౌండేషన్ అనే సంస్థ ధృవీకరించింది. ఈ సంస్థ ఐక్యరాజ్య సమితితో కలిసి పనిచేస్తుంటుంది. హైదరాబాద్‌కు దక్కిన ఈ ఘనత గురించి కేటీఆర్ ట్విట్టర్‌లో ప్రకటించారు. దేశంలో మరే నగరానికి ఈ ఘనత దక్కలేదని ఆయన ఘనంగా ప్రకటించారు.
Also Read: సీఎం కేసీఆర్ సంచలనం.. భూముల డిజిటల్ సర్వేకు ఆదేశం
దేశంలో ఐఎఫ్ఓఎస్ గుర్తింపు పొందిన.. ఏకైక నగరం హైదరాబాద్ కావడం గర్వించదగ్గ విషయమని.. ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమానికి దక్కిన ఫలితమే ఇదని కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. భాగ్యనగరాన్ని ‘ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్–-2020’గా ఐక్యరాజ్య ఎఫ్‌ఏఓ, ఆర్బర్ డే ఫౌండేషన్ ప్రకటించింది. హైదరాబాద్ మహానగరంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో పాటు వాటిని పెంచేందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నందుకుగాను ఈ గుర్తింపు లభించింది. ఈక్రమంలో ఎఫ్‌ఏఓ, ఆర్బర్ డే ఫౌండేషన్ ప్రపంచంలోని 63 దేశాల నుంచి 120 నగరాలు పరిశీలించాయి.
హైదరాబాద్‌లో తెలంగాణ సర్కార్ వివిధ కార్యక్రమాల ద్వారా 2 కోట్ల 40 లక్షల మొక్కలు నాటింది. వీటిలో అత్యధికం హరితహారం ద్వారానే నాటారు. ఈ కారణంగా హైదరాబాద్‌లో పచ్చదనం పెరిగింది. అత్యధిక మొక్కలు చెట్లుగా మారి.. హైదరాబాద్‌లో కాలుష్య స్థాయిని తగ్గించడంలో తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో పచ్చదనం పెంపుపై సీఎం కేసీఆర్ ప్రత్యేకమైన ఆసక్తితో ఉన్నారు. పెద్ద మొత్తం వెచ్చించి మొక్కలు నాటే కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. వాటిని సంరక్షించేందుకు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటారు. గ్రేటర్ చట్టంలో ఇందుకోసం ప్రత్యేక సెక్షన్లు కూడా పెట్టారు.
Also Read: నటుడు మోహన్ బాబుకు షాకిచ్చిన టీఆర్ఎస్ సర్కార్
అలాగే.. పంచాయతీలు, మున్సిపాలిటీల్లోనూ జాగ్రత్తలు తీసుకున్నారు. పట్టణ, పురపాలక మంత్రిగా హైదరాబాద్ విషయంలో కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. హైదరాబాద్ అభివృద్ధిని ఆయన జాగ్రత్తగా డిజైన్ చేస్తుంటారు కాబట్టి ఇదంతా సాధ్యపడిందని చెబుతున్నారు. మంచినీటి సమస్యను దాదాపుగా తీర్చేసేలా ప్రణాళికలు అమలు చేసిన కేటీఆర్ ఇప్పుడు.. పచ్చదనంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ విషయంలో ఫలితం వచ్చింది. హైదరాబాద్ దేశంలోనే ఏకైక ట్రీ నగరంగా నిలిచింది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్