https://oktelugu.com/

కంచుకోటకు బీటలు.. చంద్రబాబుకు ఏం మిగిలింది?

చంద్రబాబు కంచుకోటను వైసీపీ బద్దలు కొట్టింది. చంద్రబాబుకు ఉన్న ఏకైక ఆశను చిదిమేసి ఆయనకు ఏం లేకుండా చేసింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగం నుండి తెలుగు దేశం పార్టీని తుడిచిపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టిడిపి అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు కంచుకోటను జయించడంలో విజయం సాధించింది. చంద్రబాబు గత నాలుగుదశాబ్ధాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల్లో ఏకంగా 89 గ్రామ పంచాయతీలలో వైయస్ఆర్సి మద్దతు దారులైన అభ్యర్థులు 74 […]

Written By:
  • NARESH
  • , Updated On : February 19, 2021 / 10:27 AM IST
    Follow us on

    చంద్రబాబు కంచుకోటను వైసీపీ బద్దలు కొట్టింది. చంద్రబాబుకు ఉన్న ఏకైక ఆశను చిదిమేసి ఆయనకు ఏం లేకుండా చేసింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగం నుండి తెలుగు దేశం పార్టీని తుడిచిపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టిడిపి అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు కంచుకోటను జయించడంలో విజయం సాధించింది. చంద్రబాబు గత నాలుగుదశాబ్ధాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల్లో ఏకంగా 89 గ్రామ పంచాయతీలలో వైయస్ఆర్సి మద్దతు దారులైన అభ్యర్థులు 74 మంది గెలవడం విశేషం.

    Also Read: ఆ ఆరు పదవులూ వైసీపీవే..

    టిడిపి మద్దతుదారులు కేవలం 14 గ్రామ పంచాయతీలను మాత్రమే గెలుచుకోగలిగారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఒక కాంగ్రెస్ మద్దతుదారుడు ఒక పంచాయతీలో సర్పంచ్ పదవిని గెలుచుకోవడం విశేషం. కుప్పం నియోజకవర్గంలోని మండలాల్లో ఏ ఒక్క గ్రామ పంచాయతీ ఎన్నికలలో టిడిపి సింగిల్ డిజిట్ దాటకుండా ఓట్లు సంపాదించకోవడం చంద్రబాబు ఘోర అవమానంగా చెప్పొచ్చు.

    టిడిపికి బలమైన కోటలుగా భావించే కుప్పం, రామకుప్పం, గుడుపల్లె, శాంతిపురం వంటి ప్రాంతాల్లో కూడా టిడిపి కొట్టుకుపోయింది. వైయస్ఆర్ కాంగ్రెస్‌ ధాటికి నిలవలేక ఓడిపోయింది. కుప్పంలో గ్రామ పంచాయతీలలో వైయస్ఆర్సిపీ సాధించిన అద్భుతమైన విజయం సీఎం జగన్ కు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చింది. దీంతో ఇప్పుడు వైయస్ఆర్సిపీ టార్గెట్ మారింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో చంద్రబాబును చిత్తుగా ఓడించేందుకు ఈ పంచాయతీ ఎన్నికలు దోహదపడుతాయని వైసీపీ ఇప్పటికే నుంచే ప్లాన్లు చేస్తోంది. చంద్రబాబు రాబోయే ఓటమికి సూచనగా పంచాయతీ ఎన్నికలు పరిగణించబడుతున్నాయి.

    Also Read: మన హైదరాబాద్‌కు.. మరో ఖ్యాతి

    అధికార పార్టీ చంద్రబాబును ఆయన సొంత నియోజకవర్గంలో ఓడించగలిగితే, అది టిడిపి చీఫ్‌ రాజకీయ జీవితానికి ముగింపు అవుతుందని వైసీపీ భావిస్తోంది. “కుప్పం నియోజకవర్గంలో వైయస్ఆర్సిపీ విజయం టిడిపి ఓటమి కాదు, ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనపై ప్రజల పెరుగుతున్న విశ్వాసానికి ప్రతిబింబం. ప్రజలు చంద్రబాబు నాయుడుపై విశ్వాసం కోల్పోయారని ఇది చూపిస్తుంది ”అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

    ఇప్పటివరకు జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో దాదాపు 90 శాతం గెలిచినట్లు వైయస్ఆర్సి పేర్కొంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో, అధికార పార్టీ వారు ఏకగ్రీవంగా లేదా ప్రజలతో ఎన్నుకోబడిందని స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచిందని అన్నారు. ఉదాహరణకు గుంటూరు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో వైయస్ఆర్సి మొత్తం 77 గ్రామ పంచాయతీలను గెలుచుకుంది. వాస్తవానికి, వారిలో 74 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూడు పంచాయతీలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. ఈ మూడింటినీ వైయస్ఆర్సి చేజిక్కించుకుంది!

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్